literature

బంగారం అడ్డా... శంషాబాద్‌ గడ్డ.. యథేచ్ఛగా తరలింపు

Submitted by santosh on Thu, 05/10/2018 - 11:34

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా బంగారం అక్రమరవాణా జోరుగా సాగుతోంది. కిలోలకొద్ది బంగారం అక్రమ మార్గంలో నగరానికి వస్తోంది. ఇంటి దొంగల సహకారంతో అంతర్జాతీయ ముఠాలు సాధారణ ప్రయాణికులనే కొరియర్లుగా మార్చి వేలకోట్ల విలువైన బంగారాన్ని తరలిస్తున్నారు. సిటీలోని బంగారు వ్యాపారులకు ఈ అక్రమరవాణాలో సంబంధాలున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నా..వారిని గుర్తించటంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల నుంచి కిలోల కొద్దీ అక్రమ బంగారం పట్టుబడుతోంది.

వివేక వాణి

Submitted by arun on Tue, 02/06/2018 - 12:58

సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం. అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది. ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది. ఊగిపోయింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. 

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు. వారివారి పనుల్లో మునిగిపోయారు. 

రెండు వేల ఏళ్లకుముందే జల యంత్ర మందిరం

Submitted by arun on Mon, 01/29/2018 - 16:07

కాళిదాసు కవిత్వం అంటే నాటికీ , నేటికీ ఒక కొలమానం. పూర్వం గొప్ప కవుల పేర్లు వరుసగా వేళ్ల మీద లెక్కపెడదామని కాళిదాసు అని చిటికెన వేలు తీసి - రెండో పేరు చెప్పడానికి ఇప్పటిదాకా కవీ లేడు - రెండో వేలు తీయాల్సిన అవసరమూ రాలేదు - అన్న సంస్కృతశ్లోకం ద్వారా కాళిదాసు కవికులగురువు ఎందుకయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఉపమా కాళిదాసస్య - శ్లోకం ఉండనే ఉంది. పోలిక అందంగా , అద్భుతంగా చెప్పడంలో కాళిదాసును మించినవాడు ఉండాలి అంటే మళ్లీ కాళిదాసే పుట్టాలట. 

తప్పెవరిది?

Submitted by arun on Sun, 01/21/2018 - 14:16

పుట్టపర్తి నారాయణాచార్యులు జగమెరిగిన సరస్వతీ పుత్రుడు. శివతాండవాన్ని దర్శించి , పద్యాల్లో శ్లోకాల్లో బంధించినవాడు. చిన్నతనంలో తను సరదాగా రాసుకున్న పద్యకవిత్వం , పెద్దయ్యాక తనకే డిగ్రీ పాఠంగా ఎదురయిన ఏకైక కవి. అనేక భాషల్లో చేయితిరిగినవాడు. తెలుగును మించి సంస్కృతం, ఇంగ్లీషులో కూడా వెలుగులు విరజిమ్మినవాడు. 

సాధారణంగా తమ కావ్యాలకు పేరున్న పెద్ద కవులచేత ముందుమాట, అభిప్రాయం రాయించడం ఆనవాయితీ. పుట్టపర్తి వారు ఒక చిన్ని పద్య కావ్యానికి, చిన్ని పద్యం ముందుమాటగా ఆయనే రాసుకున్నారు.


పద్యం 

హనుమ ప్రతిభ

Submitted by arun on Thu, 01/18/2018 - 16:30

వాలి దెబ్బకు సుగ్రీవుడు గుహలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. హనుమ మరికొందరు సచివులు ఆయనతో ఉన్నారు. చీమ చిటుక్కుమన్నా వాలి దండెత్తి వస్తున్నాడేమోనని హడలిపోతున్నాడు. అప్పుడు అల్లంత దూరంలో రామ - లక్ష్మణులు గుహ వైపుగా వస్తున్నారు. సుగ్రీవుడి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వాళ్లెవరో కనుక్కో అని హనుమను పంపాడు. తీరా వెళ్లబోతుంటే - ఎందుకయినా మంచిది ముసలి భిక్షువు వేషంలో వెళ్లు అన్నాడు. 

స్వభావమే ప్రధానం

Submitted by arun on Thu, 01/18/2018 - 15:04

రామబాణం దెబ్బ రుచి చూసినవాడిగా చెబుతున్నా - సీతాపహరణ ఆలోచన  మానుకో అని మారీచుడు జరగబోయేపరిణామాలతోపాటు రావణుడికి చెప్పాడు. రావణుడు వినలేదు. సీతమ్మ మందలించింది . వినలేదు. హనుమ హెచ్చరించాడు. వినలేదు. విభీషణుడు సవరించబోయాడు. వినలేదు. మండోదరి మధనపడింది. వినలేదు. పంచభూతాలు బిక్కుబిక్కుమన్నాయి.  అష్టదిక్పాలకులు చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయారు.  మద్యం - మగువల మత్తులో తూలిపోయాడు. చివరకు పోయాడు. 

నాకు మంచి తెలుసు - కానీ చేయాలనిపించదు . నాకు చెడు తెలుసు - కానీ చేయకుండా ఉండలేను . స్వభావో దురతిక్రమః - నా స్వభావం ఇంతే . నేను మారను . మారాలని అనుకోవడంలేదు - అన్నాడు రావణుడు.

కనులు - మనసు

Submitted by arun on Thu, 01/18/2018 - 15:02

కళ్లు చుసిన ప్రతిదీ కావాలని మనసు కోరుకోకూడదు. మనసు అడిగిన ప్రతిదీ కావాలని కాళ్లు వెళ్ళకూడదు . శరీరం అడిగిన ప్రతిదీ దొరికితీరాలని బుద్ధి పట్టు పట్టకూడదు .

అజామీలోపాఖ్యానం

Submitted by arun on Thu, 01/18/2018 - 14:59

అజామీళుడు మంచి ధార్మిక కుటుంబంలోనే పుట్టాడు. కానీ చిన్నతనంలోనే దారితప్పాడు. ఇల్లూవాకిలి మరిచి చెడు తిరుగుళ్లు తిరిగాడు. 80 ఏళ్లు దాటాక మంచాన పడ్డాడు. దాదాపు నోట మాటకూడా పెగలడం లేదు. యమభటులు వచ్చి వాకిట్లో నిలుచున్నారు . అజామీళుడికి చివరి కొడుకుమీద ప్రేమతో అంత్యకాలంలో 'నారాయణ ' అని కొడుకు పేరు గొణుక్కుంటూ శ్వాస వదిలాడు . 

యమభటుడి పాశానికి , విష్ణు సేవకులు అడ్డుతగిలేసరికి కథ అడ్డం తిరిగింది. నానా పాపాలు చేశాడు , ఇదిగో లిస్టు , యమలోకం ఇతడికి యమయాతనలు పెట్టడానికి ఆవురావురుమని నిరీక్షిస్తోంది - అన్నది యమభటుడి వాదన . 

గజేంద్ర మోక్షణం

Submitted by arun on Thu, 01/18/2018 - 14:57

పోతన భాగవతంలో శరణాగతికి సంబంధించి గజేంద్ర మోక్షణాన్ని మన పెద్దలు భిన్న కోణాల్లో దర్శింపచేస్తారు. నా అంత వాడు లేడన్నది గజేంద్రుడి నమ్మకం. నిజంగా కూడా వాడి బలానికి కొండలు పిండి అయ్యేవి , పులులు , సింహాలు భయపడి పారిపోయేవి. మొసలితో పోరాటం కూడా మాములుగా చేయలేదు. చివరి రక్తపు బొట్టు వరకు గెలవగలననే అనుకున్నాడు . 

మనమూ అంతే - నా బలం , నా తెలివి తేటలు , నా కార్యదక్షత , నేను , నా . . .అనే అంటూ ఉంటాం .