constable

షాకింగ్‌ : కారు ఆపలేదని.. కాల్చేసిన కానిస్టేబుల్‌

Submitted by arun on Sat, 09/29/2018 - 13:05

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. కారు ఆపలేదని ఓ వ్యక్తిని అక్కడి కానిస్టేబుల్‌ ఏకంగా కాల్చిచంపేశాడు. ఆపిల్‌ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వివేక్‌ తివారీ అనే వ్యక్తి శుక్రవారం ఆఫీస్‌ విధులు ముగించుకుని అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే మధ్యలో అతన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకున్నా తివారీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా కారును ముందుకు తీసుకెళ్లాడు. అంతే వెంటనే ఓ కానిస్టేబుల్‌ తన గన్‌ను తీసుకొని తివారీపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో వివేక్‌ తివారీ ప్రాణాలు కోల్పోయాడు. 

కర్నూలు జిల్లాలో కీచకపర్వం...ఒంటరి మహిళపై ఇద్దరు పోలీసుల అత్యాచార యత్నం

Submitted by arun on Mon, 07/02/2018 - 10:50

కర్నూలు జిల్లాలో ఇద్దరు పోలీసులు కీచకులుగా మారారు. ఒంటరిగానున్న మహిళపై అత్యాచారయత్నం చేశారు. 

షాకింగ్: మహిళా కానిస్టేబుల్ కూతురిపై డీసీపీ అత్యాచారం

Submitted by arun on Thu, 06/28/2018 - 11:45

మహారాష్ట్ర ఔరంగబాద్ లో దారుణం జరిగింది. కంచే చేను మేసింది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూతురిని డీసీపీ రేప్ చేశారు. 23 ఏళ్ల యువతికి మంచి జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి ఈ దారుణానికి పాల్పడ్డాడు.  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. డీసీపీ రాహుల్‌ శ్రీరామ్ పై  ఔరంగాబాద్‌ ఎండీసీ పోలీస్‌ స్టేషన్‌లో  కేసు నమోదైంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్‌ శ్రీరామ్‌ను అభ్యర్థించింది మహిళా కానిస్టేబుల్‌. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు.

ఖాకీ’ రాసలీలలు గుట్టురట్టు...రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు

Submitted by arun on Thu, 06/21/2018 - 13:09

కానిస్టేబుల్‌ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్‌ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్‌ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్‌ చేసి మహిళను పిలిపించుకుని గదిలో ఉండగా ఇరుగుపొరుగు వారు గదికి తాళం వేసి బంధించి నాల్గవ పట్టణ పోలీసులకు పట్టించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ తప్పుడు వ్యవహారానికి పాల్పడటంపై కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఖాకీ వనంలో గంజాయి మొక్క

Submitted by arun on Tue, 06/12/2018 - 16:55

అతడో ఏఆర్ కానిస్టేబుల్ చట్టాన్ని కాపాడాల్నిన వాడు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో భార్యకు విడాకుల నోటిస్ పంపించాడు. తన భర్త నిర్వాకంపై భార్య పోలీసులను ఆశ్రయించింది. న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. మంచిర్యాలకు చెందిన స్రవంతిని ప్రేమించానని హన్మకొండ ఏఆర్ కానిస్టేబుల్  శ్రవణ్ వెంటపడ్డాడు. 2012లో  పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్రవంతి. పెళ్లి సమయంలో స్రవంతి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చారు. వివాహం అయిన ఏడాదికే భార్యకు అదనపు కట్నం కోసం వేధించాడు.

constable and his two months old son died in road accident

Submitted by admin on Sun, 09/10/2017 - 21:04

హైదరాబాద్‌ః నగర పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని రెండు నెలల కొడుకు కూడా మరణించాడు. కానిస్టేబుల్ భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్-బిజాపూర్ హైవేపై జరిగింది. శంకరపురం శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ.. భార్య, రెండు నెలల బాబుతో కలిసి కూకట్‌పల్లిలో నివాసముండేవాడు. గత అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలోని స్వగ్రామానికి  వెళ్లి.. స్నేహితుడి కారులో తిరిగొస్తున్నాడు. హైవేపై వస్తుండగా మల్కాపూర్ గేట్ సమీపంలో కారు టైర్ పంక్చరైంది. దీంతో వాహనాన్ని అదుపుచేయలేక..