motkupalli narasimhulu

మోత్కుపల్లితో చంద్రబాబే మాట్లాడిస్తున్నారా?

Submitted by arun on Sat, 03/03/2018 - 06:50

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణంగా నష్టపోతే.. తెలంగాణలో మాత్రం అది టీడీపీ వంతు అయ్యింది. కాంగ్రెస్ అంత దారుణంగా కాకున్నా.. ప్రస్తుతానికి ముఖ్య నాయకులు ఎవరూ లేనంత స్థాయికి టీడీపీ పరిస్థితి కాస్త తగ్గిపోయిందనే చెప్పవచ్చు. ఇలాంటి స్థితిలో.. పార్టీని కాపాడుకునేందుకు అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

నా దారి రహదారి

Submitted by arun on Fri, 03/02/2018 - 18:20

టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. తెగ మదనపడిపోతున్నారు. పార్టీలో తనకు కనీస గుర్తింపు లేదని ఆవేదన చెందుతున్నారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి తనను పిలవకపోవడం బాధ కలిగించిందని బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డిపైనా మోత్కుపల్లి ధ్వజమెత్తారు. ఉన్నన్నాళ్లూ పార్టీని భ్రష్టుపట్టించి.. చివరకు నిండా ముంచేసి జంప్ అయ్యారని మండిపడ్డారు.
తెలంగాణ టీడీపీకి సరైన నాయకత్వం లేదని మరోసారి అన్నారు మోత్కుపల్లి. సరైన నాయకులు, నాయకత్వం లేకపోవడం వల్లే.. పార్టీ పరిస్థితి దుర్భరంగా తయారైందని చెప్పారు.

రేవంత్‌రెడ్డిపై టీడీపీ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 03/02/2018 - 13:40

తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరిన రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసుతో రేవంత్‌ తెలుగుదేశం పార్టీ పరువు తీశారన్నారు. రేవంత్‌రెడ్డిని ఆనాడే సస్పెండ్‌ చేసి ఉంటే తెలంగాణలో పార్టీ బతికేది అని మోత్కుపల్లి అన్నారు. ‘టీఆర్‌ఎస్‌తో రేవంత్‌‌రెడ్డికి వైరం ఉండొచ్చు... కానీ నాకు లేదు’ అని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేదని ఆరోపించారు మోత్కుపల్లి నర్సింహులు. కమిట్మెంట్ లేనివాళ్లకి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ భ్రష్టు పట్టిందన్నారు.

పాపం మోత్కుపల్లి

Submitted by arun on Sat, 02/17/2018 - 11:41

ఒకప్పుడు టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత మోత్కుపల్లి. విభజన తర్వాత కూడా ఆయన తన సత్తా చాటుకున్నారు. సీఎం కేసీఆర్ మీద ఎవరూ చేయని స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలే ఆయన్ని ఇరకాటంలో పడేశాయా? అటు సొంత పార్టీ పట్టించుకోక.. అధికార పార్టీ నుంచి ఆహ్వానం అందక మోత్కుపల్లి అయోమయంలో పడిపోయారని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 

మోత్కుపల్లి మాటలపై హై కమాండ్ గరం గరం

Submitted by arun on Sun, 01/21/2018 - 11:57

సీనియర్ నేత మోత్కుప‌ల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై టీటీడీపీ అధిష్టానం సీరియ‌స్ అయింది. దీంతో టీటీడీపీ రాష్ట్ర క‌మిటి నిన్న అత్య‌వ‌స‌ర సమావేశం ఏర్పాటు చేసింది. మోత్కుప‌ల్లి మాట‌లపై అంద‌రీ అభిప్రాయం తీసుకోని జాతీయ క‌మిటికి నివేదిక పంపింది. మోత్కుపల్లిపై పార్టీ అధినేత చంద్రబాబు వేటు వేస్తారని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

పార్టీని విలీనం చేస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది

Submitted by arun on Thu, 01/18/2018 - 18:05

తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలు.. ఆ పార్టీలోనే గాక రాజకీయ విశ్లేషకుల్లోనూ చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనే గాక.. తెలంగాణ ఏర్పడే కీలకమైన దశలో కూడా మోత్కుపల్లి నరసింహులు.. కేసీఆర్ టార్గెట్ గా తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి టీడీపీని దెబ్బతీసే కుట్ర పన్నాయని విమర్శలు గుప్పించారు. అదే మోత్కుపల్లి టీడీపీ విలీనాన్ని ప్రతిపాదించడం ఆసక్తి రేపుతోంది. 

మోత్కుపల్లి కామెంట్స్ పై స్పందించిన రమణ

Submitted by arun on Thu, 01/18/2018 - 13:32

తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలను టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ఖండించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ఉంటుందన్న ఎల్‌.రమణ విలీనం వ్యాఖ్యలు మోత్కుపల్లి వ్యక్తిగతమంటూ కొట్టేశారు. దీనిపై పొలిట్ బ్యూరోలో చర్చిస్తామని ఆయన అన్నారు. టీడీపీలో అందరకీ మాట్లాడే స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణాలో టీడీపీ ఉంటుంది అని చంద్రబాబు చాలాసార్లు స్పష్టం చేశారని రమణ గుర్తుచేశారు. రాబోయే ఎలక్షన్స్‌లో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 01/18/2018 - 11:08

తెలంగాణ టీడీపీ మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళులర్పించిన మోత్కుపల్లి తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుందన్నారు. రెండు రాష్ట్రాల్లోని తెలుగుదేశం అభిమానులకు ఇదే మంచిదన్నారు. తెలంగాణలో టీడీపీ ఇబ్బందుల్లో ఉందన్న మోత్కుపల్లి భుజాన వేసుకుని నడిపేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని మోత్కుపల్లి అన్నారు. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే, కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే అని ఆయన వ్యాఖ్యానించారు.