Bail

సల్మాన్‌కు బెయిల్‌

Submitted by arun on Sat, 04/07/2018 - 15:36

కృష్ణ జింకల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడిన బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.  నాటకీయ పరిణామాల నడుమ.. రూ.50 వేల పూచీకత్తుపై సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు జోధ్‌పూర్‌ కోర్టు శనివారం మధ్యాహ్నం తీర్పు చెప్పింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే జోధ్‌పూర్‌ జైలు నుంచి హీరో విడుదలయ్యే అవకాశంఉంది.
 

కార్తీ చిదంబ‌రానికి బెయిల్ మంజూరు

Submitted by lakshman on Fri, 03/23/2018 - 15:33

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు లో మాజీ కేంద్ర‌మంత్రి పీ.చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి ఢిల్లీ హైకోర్టు లో ఊర‌ట ల‌భించింది.  

అమ‌లాపాల్ కు బెయిల్ మంజూరు

Submitted by lakshman on Thu, 01/18/2018 - 01:23

హీరోయిన్ అమ‌లాపాల్  కు బెయిల్ మంజూరు అయ్యింది.  కేర‌ళ‌లో రూ. కోటి రూపాయ‌ల విలువ చేసే కారు కొనుగోలు చేసిన అమ‌లాపాల్ రిజ‌స్ట్రేష‌న్ మాత్రం పాండిచ్చేరిలో చేయించింది. స‌మాచారం తెలుసుకున్న కేర‌ళ  ట్రాన్స్ పోర్టు అధికారులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజ‌రు కావాల‌ని సూచించారు. కానీ అమ‌లా పాల్ కోర్టులో హాజ‌రు కాకుండా ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపింది.  దీంతో కేర‌ళ కోర్టు క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తర్వాత కేసు పరిశీలిస్తామని పేర్కొంది. దీంతో అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు.