Amala Paul

నా మొదటి ప్రేమికుడెవరో తెలుసా?

Submitted by arun on Sat, 06/23/2018 - 12:46

కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో ముగినితేలి, ఆ తర్వాత ఆయనను నటి అమలాపాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మనస్పర్థల నేపథ్యంలో, అతని నుంచి అంతే వేగంగా ఆమె విడిపోయింది. ప్రస్తుతం సినిమాలతోనే ఆమె బిజీగా ఉంది. తాజాగా ప్రేమ గురించ ఆమె మాట్లాడుతూ, ఇటీవల ఒక కార్యక్రమంలో అమలాపాల్‌ పేర్కొంటూ తనకు తొలిప్రేమ కథ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన మొదటి ప్రేమ అనుభవం గురించి మాట్లాడుతూ తానిప్పుడు నచ్చిన చిత్రాలను ఎంచుకుని నటిస్తున్నానని చెప్పింది.

నిన్న అమ‌లాపాల్, నేడు మ‌రో హీరోయిన్ పై లైంగిక‌ వేధిపులు

Submitted by lakshman on Fri, 02/02/2018 - 11:31

ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు హీరోయిన్ల‌పై లైంగిక వేధింపులు కొన‌సాగుతున్నాయి. నిన్న హీరోయిన్ అమ‌లాపాల్ పై వ్యాపారవేత్త లైంగిక వేదింపులు పాల్ప‌డ్డాడ‌నే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌ల‌యాళ న‌టి అత్యాచార వేధింపుల‌కు గురైంది. హీరోయిన్ అమ‌లాపాల్ పాల్ త‌న‌ పై లైంగిక వేధింపులు జ‌రిగిన‌ట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  డాన్స్ స్కూల్ య‌జ‌మాని అయిన అళ‌గేశ‌న్ త‌నతో అస‌భ్యంగా , ప‌రుష‌ప‌ద‌జాలంతో అశ్లీలంగా మాట్లాడ‌ని మొర‌పెట్టుకుంది. అంతేకాదు మ‌లేషియాలో ఉన్న త‌న ఫ్రెండ్స్ తో డిన్న‌ర్ కి వెళ్లాల‌ని కోరాడ‌ని తెలిపింది.

అమ‌లాపాల్ పై లైంగిక వేధింపులు

Submitted by lakshman on Thu, 02/01/2018 - 16:21

హీరోయిన్ అమ‌లాపాల్  పై లైంగిక వేధింపులు జ‌రిగాయి. డాన్స్ స్కూల్ య‌జ‌మాని అయిన అళ‌గేశ‌న్ త‌నతో అస‌భ్యంగా, ప‌రుష‌ప‌ద‌జాలంతో అశ్లీలంగా మాట్లాడ‌ని మొర‌పెట్టుకుంది. అంతేకాదు మ‌లేషియాలో ఉన్న త‌న ఫ్రెండ్స్ తో డిన్న‌ర్ కి వెళ్లాల‌ని కోరాడ‌ని తెలిపింది. ఈ సంద‌ర్బంగా త‌న పై వ‌చ్చిన వేధింపులపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన అమ‌లా పాల్ మ‌హిళ‌ల‌కు రక్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇదిలా ఉంటే అమ‌లాపాల్ ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.  

అమ‌లాపాల్ కు బెయిల్ మంజూరు

Submitted by lakshman on Thu, 01/18/2018 - 01:23

హీరోయిన్ అమ‌లాపాల్  కు బెయిల్ మంజూరు అయ్యింది.  కేర‌ళ‌లో రూ. కోటి రూపాయ‌ల విలువ చేసే కారు కొనుగోలు చేసిన అమ‌లాపాల్ రిజ‌స్ట్రేష‌న్ మాత్రం పాండిచ్చేరిలో చేయించింది. స‌మాచారం తెలుసుకున్న కేర‌ళ  ట్రాన్స్ పోర్టు అధికారులు 430, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు హాజ‌రు కావాల‌ని సూచించారు. కానీ అమ‌లా పాల్ కోర్టులో హాజ‌రు కాకుండా ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు జ‌రిపింది.  దీంతో కేర‌ళ కోర్టు క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తర్వాత కేసు పరిశీలిస్తామని పేర్కొంది. దీంతో అమలాపాల్‌ సోమవారం తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల వద్ద లొంగిపోయారు.