Nirmala Sitharaman

నన్నుముట్టుకుంటే భ‌స్మమే

Submitted by lakshman on Sat, 03/03/2018 - 18:40


టీఆర్ఎస్ పార్టీ పార్ల‌మెంట‌రీ స‌మావేశం ముగిసింది. స‌మావేశంలో ఎంపీల‌కు పార్ల‌మెంట్ అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై దిశా నిర్దేశం చేశారు. ఈసంద‌ర్భంగా సీఎం కేసీఆర్ పీఎం మోడీ పై చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. తాను మోడీని మోడీగారు అని అస్ప‌ష్టంగా అన్నాన‌ని, మోడీ గాడు అని సంబోధించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. 

కేసీఆర్‌ వ్యాఖ్యల గురించి కేటీఆర్‌ను నిలదీశాను: సీతారామన్‌

Submitted by arun on Fri, 03/02/2018 - 11:26

కేసీఆర్ కామెంట్స్ వర్సెస్ బీజేపీ ఇప్పుడిదే తెలంగాణలో ట్రెండింగ్. ప్రధాని మోడీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గల్లీ పరిధి దాటి ఇప్పుడు ఢిల్లీ ఇష్యూగా మారింది. స్టేట్ బీజేపీయే కాదు కేంద్రం కూడా సీరియస్‌గా తీసుకుంది. టాటా బోయింగ్ కంపెనీ ప్రారంభానికి హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కేసీఆర్ కామెంట్స్‌పై కేటీఆర్‌ను నిలదీశారంటేనే ఇష్యూ ఎంత సీరియస్‌గా మారిందో అర్థమవుతోంది.

టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభం

Submitted by arun on Thu, 03/01/2018 - 12:04

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఎరోస్పెస్ కంపెనీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో 200కోట్లతో ఈ ఏరోస్పెస్ సెంటర్ ను నిర్మించారు. బోయింగ్ విడిభాగాలు, అపాచీ హెలికాఫ్టర్ల తయారీ  చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలాసీతరామన్, రతన్ టాటాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) వైమానిక సెజ్‌లో విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

సుఖోయ్ యుద్ధ విమానంలో నిర్మలా సీతారామన్ విహారం

Submitted by arun on Wed, 01/17/2018 - 15:44

కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌...సుఖోయ్-30 యుద్ధ విమానంలో విహరించారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ ఆర్మీ ఎయిర్‌బేస్‌కు వెళ్లిన నిర్మలా సీతారామన్...పైలెట్ షూట్ ధరించి గ్రూప్‌ కెప్టెన్‌ గార్గ్‌తో 8వేల మీటర్ల ఎత్తులో పయనించారు. యుద్ధం వస్తే భారత వాయు దళం...ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందా ? లేదా అన్నది సీతారామన్ పరిశీలించారు. సుఖోయ్‌లో ప్రయాణించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సీతారామన్ చెప్పారు.