ntr

హలో మూవీతో షాకిచ్చిన డైరెక్టర్ విక్రమ్ కుమార్.. విక్రమ్ కుమార్ ను దూరం పెట్టే యోచనలో ఎన్టీఆర్,బన్నీ

Submitted by arun on Thu, 01/04/2018 - 16:38

మనం, సూర్య 24 మూవీతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు విక్రమ్ కుమార్. ఆ నమ్మకంతోనే నాగార్జున అఖిల్ రెండో మూవీని విక్రమ్ కుమార్ చేతిలో పెట్టాడు. కానీ హలో మూవీ ఫలితంతో అఖిల్ సీన్ మరోసారి రివర్సైంది. దీంతో హలో మూవీ కంటే ముందు విక్రమ్ కుమార్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ ఇప్పుడు దూరం పెడుతున్నారు. అతని పేరు చెబితేనే ఆమాడ దూరం పరిగెత్తుతున్నారు.

ప‌ద‌హారేళ్ల ప్రాయంలో 'స్టూడెంట్ నెం.1'

Submitted by nanireddy on Wed, 09/27/2017 - 10:34

'బాహుబ‌లి' సిరీస్‌తో తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అలాంటి ద‌ర్శ‌క‌మౌళి రూపొందించిన తొలి చిత్రమే 'స్టూడెంట్ నెం.1'. క‌థానాయ‌కుడిగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కి రెండో సినిమా అయిన ఈ 'స్టూడెంట్ నెం.1'.. అత‌నికి తొలి విజ‌యాన్నిచ్చింది. అంతేకాకుండా.. 'అన్న‌మ‌య్య' త‌రువాత స‌రైన హిట్ లేని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణికి మ‌ళ్లీ క్రేజ్‌ని తీసుకువ‌చ్చింది కూడా ఈ సినిమానే.

'జై ల‌వ‌కుశ'@ రూ.100 కోట్లు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 21:42

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ' బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. గురువారం విడుద‌లైన ఈ సినిమా నేటితో రూ.100 కోట్ల గ్రాస్‌ని క్రాస్ చేసింది. తార‌క్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 20:05

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రూపొందించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ రెండో స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి దృష్టి కోణంలో ఈ సినిమాని తీయ‌బోతున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు కూడా. ఇవాళ‌ ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని ఆయ‌న విడుద‌ల చేశారు.

జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత కాద‌ట‌

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 13:15

మ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బ‌యోపిక్ తీస్తున్నాన‌ని.. దానికి 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' అనే పెడుతున్నాన‌ని సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి ప్ర‌ముఖ న‌టుడు జె.డి.చ‌క్ర‌వ‌ర్తి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడని తాజాగా వార్త‌లు వినిపించాయి.

'జైల‌వ‌కుశ' నాలుగో రాజు కూడా..

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 20:56

క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్‌, నిర్మాత‌గా క‌ల్యాణ్ రామ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం 'జైల‌వ‌కుశ‌'. తార‌క్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మొద‌టి మూడు రోజులు మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన 'జైల‌వ‌కుశ‌'.. నాలుగో రోజు అయిన ఆదివారం కూడా వ‌సూళ్ల ప‌రంగా అద‌ర‌గొట్టింది.

దాదాపు రూ.90 కోట్లని గ్రాస్ రూపంలోనూ.. రూ.54 కోట్ల‌ని షేర్ రూపంలోనూ ఈ సినిమా రాబ‌ట్టుకుంది. సోమ‌వారం కూడా ఈ సినిమా చెప్పుకోద‌గ్గ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓవ‌రాల్‌గా ద‌స‌రా సెల‌వులు 'జైల‌వ‌కుశ‌'కి బాగానే ప్ల‌స్ అయ్యాయి అనే చెప్పాలి.

మూడు వారాలు .. మూడు సినిమాలు..

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 18:37

'ఊహ‌లు గుస‌గుస‌లాడే' చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ త‌రువాత 'జోరు', 'జిల్‌', 'శివ‌మ్‌', 'బెంగాల్ టైగ‌ర్‌', 'సుప్రీమ్‌', 'హైప‌ర్' చిత్రాల‌తో సంద‌డి చేసింది. తాజాగా ఎన్టీఆర్‌కి జోడీగా 'జైల‌వ‌కుశ‌'లో మెరిసింది. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ రాశి న‌టిస్తోంది. కాగా, రాశి న‌టించిన మూడు చిత్రాలు అక్టోబ‌ర్ నెల‌లో విడుద‌ల‌కి సిద్ధ‌మ‌య్యాయి. ఆ చిత్రాలే 'రాజా ది గ్రేట్‌', 'విల‌న్‌', 'ఆక్సిజ‌న్‌'.

ఎన్టీఆర్‌.. మ‌రో కొత్త పాత్ర‌

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 21:15

ఈ త‌రం క‌థానాయ‌కుల్లో ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్న హీరో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. తాజాగా వ‌చ్చిన 'జైల‌వ‌కుశ‌'లో మూడు విభిన్న పాత్ర‌లు చేసి మెప్పించాడు. ముఖ్యంగా న‌త్తితో మాట్లాడే జై పాత్ర అత‌నికి మంచి పేరుని తీసుకువ‌చ్చింది. ప్ర‌తినాయ‌కుడి ఛాయ‌లున్న ఈ పాత్ర‌లో తార‌క్ విశ్వ‌రూపం చూపించాడు.

3 రోజులు..రూ.75 కోట్లు

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 15:18

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ‌'.. టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మూడు రోజుల‌కి గానూ ఈ సినిమా రూ.75 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకుంది. ఇవాళ కూడా క‌లెక్ష‌న్లు స్ట‌డీగానే ఉన్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం లేదా సోమ‌వారంతో ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్‌ని సొంతం చేసుకునే అవ‌కాశం ఉంద‌ని వారు చెబుతున్నారు.

తార‌క్ సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయిన‌ట్టే

Submitted by nanireddy on Sat, 09/23/2017 - 16:34

'టెంప‌ర్' నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. 'టెంప‌ర్‌', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్‌'.. తాజాగా 'జైల‌వ‌కుశ'.. ఇలా నాలుగు వ‌రుస చిత్రాలు ఆయ‌నకు మంచి ఫ‌లితాల‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా న‌టుడిగా మంచి పేరుని కూడా తీసుకువ‌చ్చాయి.