Bharat Ane Nenu

వచ్చాడయ్యో సామి!

Submitted by arun on Wed, 11/28/2018 - 16:20

ఈ మద్య కాలంలో వచ్చిన “భరత్ అనే నేను” సినిమాలోని రామజోగయ్య శాస్త్రి వ్రాసిన కైలాష్ ఖీర్, దివ్య కుమార్ పాడిన ఒక చక్కటి పాట... వచ్చాడయ్యో సామి!

ముసలి తాతా ముడత ముఖం 
మురిసిపోయనే…మురిసిపోయనే
గుడిసె పాకా గుడ్డి దీపం
మెరిసిపోయనే…మెరిసిపోయనే
రచ్చబండ పక్కనున్న రాములోరి గుళ్ళో గంటా 
రంగ రంగ సంభరంగ మోగెనే 

వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ.. 
ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. 
వచ్చాడయ్యో సామి నింగి సుక్కల్తో గొడుగెత్తింది భూమీ 
ఓ…ఇచ్చాడయ్యో సామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ 

అనుమానాలుంటే మా ఆఫీస్‌కు రండి

Submitted by arun on Mon, 07/16/2018 - 12:35

మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. అయితే, సినిమా కోసం పని చేసిన కొందరికి దానయ్య రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు వెలువడ్డాయి. కొరటాల శివ, హీరోయిన్ కైరా అద్వానీలకు ఆయన పూర్తి రెమ్యునరేషన్ చెల్లించలేదనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. 

‘భరత్‌ అనే నేను’ రివ్యూ

Submitted by arun on Fri, 04/20/2018 - 10:49

చిత్రం: భరత్‌ అనే నేను 
నటీనటులు: మహేష్‌బాబు.. కైరా అడ్వాణీ.. ప్రకాష్‌రాజ్‌.. శరత్‌కుమార్‌.. రమాప్రభ.. దేవరాజ్‌.. ఆమని.. సితార.. పోసాని కృష్ణమురళి.. రవిశంకర్‌.. జీవా.. యశ్‌పాల్‌ శర్మ.. రావు రమేష్‌.. అజయ్‌.. బ్రహ్మాజీ తదితరులు 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఛాయాగ్రహణం: రవి కె. చంద్రన్‌, తిరు 
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌ 
కళ: సురేష్‌ సెల్వరాజన్‌ 
సాహిత్యం: రామ జోగయ్యశాస్త్రి 
నిర్మాత: డీవీవీ దానయ్య 
దర్శకత్వం: కొరటాల శివ 
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 
విడుదల తేదీ:20-04-2018

‘భరత్ అనే నేను’ ఫస్ట్ రివ్యూ: ‘రంగస్థలం’ కంటే ఎక్కువ రేటింగ్!

Submitted by arun on Thu, 04/19/2018 - 16:00

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ‘భరత్ అనే నేను’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ‘శ్రీమంతుడు’ సినిమాతో మహేష్ కెరియర్‌లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి.. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ వేసవి కానుకగా ఏప్రిల్ 20 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డి.వి.వి ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. 

అలాంటి ప్రయోగాలు మళ్లీ చేయను: మహేష్

Submitted by arun on Thu, 04/19/2018 - 15:45

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. కియారా అద్వాని హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం గురించి మహేశ్‌ బుధవారం విలేకరులతో మాట్లాడారు. కొత్తగా వచ్చే హీరోలు సైతం కమర్షియల్ సినిమాలను చేస్తుంటే.. సూపర్ స్టార్ అయ్యుండి కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక చిత్రాలే ఎక్కువగా చేశారు ప్రిన్స్ మహేశ్ బాబు. అలాంటి మ‌హేశ్ ఇక‌మీద‌ట‌ ప్రయోగాత్మ‌క సినిమాల జోలికి వెళ్ళ‌నని..పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తానని అంటున్నారు.

రిలీజ్‌కు ముందే రికార్డు

Submitted by arun on Mon, 04/16/2018 - 15:32

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘ భరత్ అనే నేను ‘ విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షో లను ప్రదర్శించ నున్నట్టు ఈ మూవీ యూనిట్ తెలిపింది. అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్య కన్నా ఎక్కువ థియేటర్లలో ” భరత్ అనే నేను ” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొంది.

భ‌ర‌త్ అనే నేను ప్రి రిలీజ్ ఎక్క‌డంటే

Submitted by lakshman on Sat, 03/10/2018 - 22:02

భ‌ర‌త్ అనే నేను మ‌హేష్- కొర‌టాల కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా. ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను త్వ‌ర‌గా పూర్తి చేసుకుంటున్న యూనిట్.. సినిమా ప్ర‌మోష‌న్స్ ను కూడా అంతే వేగంగా చేసింది. ఇప్ప‌టికే టీజ‌ర్ తో సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగా మారిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈ వెంట్ కు గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది. 

భరత్‌ అనే నేను.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా..

Submitted by arun on Fri, 01/26/2018 - 13:04

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమాణ స్వీకార ఆడియోను చిత్ర బృందం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు విడుదల చేసింది.

ఏ హీరో కెరియ‌ర్ లో ఇలా జ‌రిగుండ‌దేమో

Submitted by lakshman on Tue, 01/23/2018 - 21:18

ప్రిన్స్ మ‌హేష్ బాబు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మ‌హేష్ బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నార‌ని , అందుకు ప్రిన్స్ అభిమానులు సిద్ధంగా ఉండాల‌ని డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ పిలుపునిచ్చారు. డైర‌క్ట‌ర్ కొర‌టాల శివ - ప్రిన్స్ మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో భ‌ర‌త్ అను నేను సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా కు సంబంధించి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది. సాదార‌ణంగా సినిమా ఫ‌స్ట్ లుక్ అంటే  ఓ ఇమేజ్ ను విడుద‌ల చేస్తారు.