ntr

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు

Submitted by arun on Fri, 09/21/2018 - 17:13

తెలుగు తెరకి రెండు కన్నులు,

అభినయానికి మూల ఆత్మలు,

వెండితెర యొక్క బంగారు  వెలుగులు,

‘ఎన్టీఆర్’ “ఏఎన్నార్‌” సోదరులు. శ్రీ.కో. 

Tags

ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 17:20

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      

జమున గారంటే ఆ రోజుల్లో

Submitted by arun on Sat, 08/18/2018 - 13:21

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ హీరోలయిన ఎన్.టి.ఆర్, ఎఎన్ఆర్ మూడు సంవత్సరాల పాటు ప్రఖ్యాత నటి "జమునా" తో నటించటానికి నిషేధించారట, ఆమెకు బాగా గర్వం ఉంది అని, కానీ “జమున” గారు ఎప్పటికీ తగ్గక, క్షమాపణలు కూడా చెప్పడానికి అంగీకరించక పోవడంతో చివరగా బిఎన్ రెడ్డి మరియు చక్రాపణి గారు వారి మధ్య రాజీ కుదిర్చి ఆ తర్వాత "గుండమ్మకథ" సినిమాకి కలిసి పని చేసారట. శ్రీ.కో.     

ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం..?

Submitted by arun on Sat, 08/04/2018 - 10:38

చిత్రసీమతో పాటు రాజకీయాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన అన్న నందమూరి తారకరామారావుకు భారతరత్న పురస్కారం లభించనుందా..? తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచానికి చాటిన ఘనుడు ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించనున్నారా..? హస్తిన నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ యేడు ప్రకటించే పద్మ పురస్కారాల లిస్టులో అన్నగారి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అంత‌ర్జాతీయ ఫిలిం ఫెస్టివ‌ల్‌కి ఎన్టీఆర్ సినిమా

Submitted by arun on Sat, 07/21/2018 - 17:37

కథానాయకుడు ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. నార్త్ కొరియాలో జ‌రిగే బిఐఎఫ్ఎఫ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌, బుచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో రెండు రోజుల ప్రదర్శనకి గాను 'జై లవ కుశ' సినిమాను ఎంపిక చేశారు. ఉత్త‌మ ఏషియ‌న్ సినిమా విభాగంలో జై ల‌వ‌కుశ చిత్రానికి గౌర‌వం ద‌క్క‌గా, ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా 'జై లవ కుశ' కావడం విశేషం. జై ల‌వ‌కుశ చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న‌కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. 125 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించగా, క‌ళ్యాణ్ రామ్ నిర్మించాడు.

రాజ‌మౌళి చిత్రంలో చ‌రణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌లివే..!

Submitted by arun on Fri, 06/01/2018 - 15:14

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అయితే జక్కన్న ఎక్కవగా ఎన్టీఆర్ తో చిత్రాలు తీశారు.  దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిందే ఎన్టీఆర్ తో అని  చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ ఎన్టీఆర్, రాజమౌళికి మొదటి చిత్రం.  ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండవ చిత్రం ‘మగధీర’మరో అద్భుతమైన విజయం సాధించారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

టాలీవుడ్‌ టాప్‌ సెలబ్రిటీలకు ఎన్టీఆర్‌ ఛాలెంజ్‌!

Submitted by arun on Fri, 06/01/2018 - 14:44

సోషల్ మీడియాలో ఇపుడు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ట్రెండ్ వైరల్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఇతరలకు ఛాలెంజ్ విసురుతుండటం అభిమానుల్లోనూ ఫిట్‌నెస్ మీద ఆసక్తి పెంచుతోంది. అలా సినీ నటుడు మోహన్ లాల్ నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్...మహేష్ బాబు, రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ఈ ఛాలెంజ్ విసిరారు.
 

ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యుల నివాళి

Submitted by arun on Mon, 05/28/2018 - 10:43

టీటీడీ వ్యవస్ధాపకుడు ఎన్‌టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని  ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్న కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి అంజలి ఘటించారు. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి, మనమడు దేవాన్ష్ .. ఎన్టీఆర్ సమాధి దగ్గరకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జోహార్ ఎన్టీఆర్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు  చేశారు.   

Tags

బాబాయ్ పిలవలేదు..

Submitted by arun on Wed, 04/04/2018 - 12:09

ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెట్‌తో తనకున్న అనుభవాన్ని షేర్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇదే వేదికపై మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముఖ్యంగా త్వరలో బాలయ్య తెరకెక్కించబోతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ గురించి ఆయన తెలిపారు.

ఆత్మగౌరవం దెబ్బతిన్నందుకే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి..: మోదీ

Submitted by arun on Wed, 02/07/2018 - 13:15

పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చెలరేగిపోయారు. దేశంలో ఇన్ని సమస్యలకు కారణం కాంగ్రెస్సే అంటూ ఆ పార్టీని తూర్పారపట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన మోడీ... కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యంపై మాట్లాడే అర్హత లేదంటూ మండిపడ్డారు. తెలుగువారిని తీవ్రంగా అవమానించింది కాంగ్రెస్సే అంటూ దుయ్యాబట్టారు. ఆ అవమానాల నుంచే తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీకి జీవం పోశారని పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా సభలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు లేచి చప్పట్లు కొట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రిని రాజీవ్‌గాంధీ అందరి ముందు అవమానించారని మోదీ అన్నారు.