nara lokesh

మా నిప్పునే అనేటంత మొన‌గాడా ప‌వ‌న్ క‌ల్యాణ్ : చ‌ంద్ర‌బాబు

Submitted by lakshman on Thu, 03/15/2018 - 09:30

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ బుధవారం సాయంత్రం గుంటూరులో నిర్వహించిన బహిరంగ సభలో తనను, తన కుమారుడ్ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేయడంపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి బుధవారం రాత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఏపీలో భారీ అవినీతి జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని సభలో పవన్ ప్రశ్నించారు.

ఏపీలో జోరందుకున్న ఐటీ రంగం

Submitted by lakshman on Fri, 02/16/2018 - 06:39

ఏపీలో మెల్లమెల్లగా ఐటీ రంగం జోరందుకుంటోంది... ఐటీ కంపెనీలతో పాటు... వాటిని పెట్టాలనుకునేవారికి పెట్టుబడులు సమకూర్చే సంస్థలు, వాటిలో పనిచేయాలనుకునే యువతకు శిక్షణ ఇచ్చే ఏజెన్సీలు... ఇలా అన్నింటితో కూడిన సమగ్రమైన ‘ఐటీ వాతావరణం’ వస్తోంది... రాజధాని అమరావతి ఏరియాలోని అమరావతి, మంగళగిరితోపాటు గన్నవరం ప్రాంతాలను ఐటీ కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి.. మంగళగిరిలో ఇప్పటికే ఏపీఐఐసీకి చెందిన 22 ఎకరాల్లో ఐటీ పార్కును నెలకొల్పి పై డాటా, పై కేర్‌, వీ సాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థలు రూపుదిద్దుకున్నాయి...

బాలయ్యపై నారా లోకేశ్ సరదా కామెంట్

Submitted by arun on Mon, 02/05/2018 - 13:04

ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సరదాగా పంచ్ లు వేస్తున్నాడు..ఆంధ్ర ఎన్నారైలతో మంత్రి లోకేష్ న్యూజెర్సీలో సమావేశం ఏర్పాటు చేశారు.. ఇందులో భాగంగా ఆంధ్ర ఎన్నారైలను లోకేష్ ప్రశ్నలు అడిగి మరి సమాధానాలు తెలుసుకున్నారు.. అయితే లోకేష్ సమావేశం జరుగుతుండగా బాలయ్య పేరు బయటకు వచ్చింది.. దీంతో అక్కడ ఉన్నవాళ్ళంతా ఒక్కసారి బాలయ్య.. బాలయ్య అంటూ నినదించారు..ఓ సందర్భంలో వారిని కట్టడి చేయడానికి లోకేశ్, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. సింహం గురించి తాను ఏం చెప్పాలని ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.

మోత్కుపల్లి వ్యాఖ్యలపై స్పందించిన లోకేష్‌

Submitted by arun on Thu, 01/18/2018 - 15:55

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని అన్నారు. నర్సింహులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీడీపీ ప్రాభవాన్ని కోల్పోతోందని అందరూ అంటున్నారని, ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు ఎన్‌టీఆర్‌కు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్‌ రాలేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నారా లోకేష్‌.. కలెక్టర్లతో సమావేశం ఉన్నందు వల్లే ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రాలేకపోయారని చెప్పారు.

నేడు ఏపీలో 16 ఐటీ కంపెనీలు ప్రారంభం

Submitted by lakshman on Wed, 01/17/2018 - 09:01

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉద్యోగాలే ల‌క్ష్యంగా కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో రాజధాని ప్రాంతం మంగళగిరిని మైటెక్ సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్న ఐటీ మంత్రి నారాలోకేష్ నేడు 16ఐటీ కంపెనీలు ప్రారంభించనున్నారు. 
ఈ కంపెనీల ద్వారా ఇప్పటికిప్పుడు 600 మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా ఏడాదిలోపు మరో 1600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మంగళగిరి ఆటోనగర్ ప్రాంతంలో ఇప్పటికే మూడు ఐటీ కంపెనీలు పనిచేస్తుండగా వీటిలో 500 మంది పనిచేస్తున్నారు.