tamanna

త్వరలో తమన్నా పెళ్లి...వరుడెవరంటే..

Submitted by arun on Tue, 07/24/2018 - 16:49

మూడుపదుల వయసు దాటిన హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్నారు. డబ్బుతో పాటు దాంపత్య జీవితమూ ముఖ్యమేనంటున్నారు.  మొన్ననే శ్రియ పెళ్లి చేసుకోగా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా పెళ్లి పీటలెక్కనుంది. తమన్నా కోసం వరుడు కూడా రెడీగా ఉన్నాడని అంటున్నారు. అతడు డాక్టర్‌గా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. పెళ్లికొడుకు ఫ్యామిలీ అమెరికాలో బాగా సిర్థరపడిన కుటుంబమని సమాచారం! అక్కడ వారికి చాలా వ్యాపారాలున్నాయని తెలుస్తోంది. ఇరువైపులా పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చి నిశ్చితార్ధానికి ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం. పెళ్ళి తరువాత తమన్నా అమెరికా వెళ్ళిపోతుందని అంటున్నారు.

Tags

'జై ల‌వ‌కుశ'@ రూ.100 కోట్లు

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 21:42

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జై ల‌వ‌కుశ' బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. గురువారం విడుద‌లైన ఈ సినిమా నేటితో రూ.100 కోట్ల గ్రాస్‌ని క్రాస్ చేసింది. తార‌క్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది.

విక్ర‌మ్‌తో రిపీట్ చేస్తుందా?

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:31

త‌మ‌న్నాకి తెలుగులో కంటే త‌మిళంలో మంచి విజ‌యాలున్నాయి. సూర్య‌తో చేసిన 'అయ‌న్' (తెలుగులో 'వీడొక్క‌డే').. కార్తీతో చేసిన 'ప‌య్యా'(ఆవారా), 'సిరుత్తై'('విక్ర‌మార్కుడు' రీమేక్‌), 'తోళా' (ఊపిరి).. అజిత్‌తో చేసిన 'వీర‌మ్' (వీరుడొక్క‌డే).. ధ‌నుష్‌తో చేసిన 'ప‌డిక్కాద‌వ‌న్‌'.. విజ‌య్‌సేతుప‌తితో చేసిన 'ధ‌ర్మ‌దురై' చిత్రాలు విజ‌యం సాధించ‌డంతో పాటు త‌మ‌న్నాకి త‌మిళ‌నాట మంచి పేరుని తీసుకువ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న త‌మిళ చిత్రం 'స్కెచ్‌'. ఇందులో విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. విక్ర‌మ్‌తో త‌మ‌న్నా జోడీ క‌ట్ట‌డం ఇదే తొలిసారి.

కాజ‌ల్ 'పారిస్ పారిస్‌'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 13:55

కాజ‌ల్‌కి ఈ ఏడాది బాగా క‌లిసొచ్చింది. 'ఖైదీ నెం.150', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల రూపంలో తెలుగునాట మంచి విజ‌యాలు ద‌క్కాయి. మ‌రోవైపు ఆమె న‌టించిన భారీ బ‌డ్జెట్ త‌మిళ చిత్రం 'మెర్స‌ల్' విడుద‌ల‌కి సిద్ధమైంది. తెలుగులో 'అదిరింది' పేరుతో రానున్న ఈ చిత్రంలో విజ‌య్ త్రిపాత్రాభిన‌యం చేశారు. ఈ సినిమా విజ‌యంపై కాజ‌ల్ పూర్తి న‌మ్మ‌కంతో ఉంది.

'స్కెచ్' టీజ‌ర్‌.. దీపావ‌ళికి

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 19:19

విక్ర‌మ్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తొలి చిత్రం 'స్కెచ్‌'. విజ‌య్ చంద‌ర్ తెర‌కెక్కిస్తున్న ఈ త‌మిళ చిత్రానికి యువ సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కుతున్న 'స్కెచ్‌'లో.. త‌మ‌న్నా డీ గ్లామ‌ర్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని త‌మిళ‌నాట వార్త‌లు వినిపిస్తున్నాయి.

2400 థియేట‌ర్స్‌లో 'జై ల‌వ కుశ‌'

Submitted by nanireddy on Wed, 09/20/2017 - 11:30

'టెంప‌ర్', 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌న‌తా గ్యారేజ్' వంటి హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా  చిత్రం 'జై ల‌వ కుశ‌'. కెరీర్‌లోనే మొద‌టిసారిగా ఈ సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేశాడు తార‌క్‌. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి 'ప‌వ‌ర్‌', 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్' చిత్రాల ద‌ర్శ‌కుడు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

'జై లవ కుశ'లు ఎలా ఉంటారంటే..

Submitted by nanireddy on Tue, 09/19/2017 - 15:56

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం 'జై ల‌వ కుశ‌'. నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ప‌వ‌ర్' ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని ఈ నెల 21న విడుద‌ల కానుంది. 158 నిమిషాల పాటు సాగే ఈ సినిమాలో  మూడు పాత్ర‌లు ఎలా ఉంటాయో ఎన్టీఆర్ నే ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా చెప్పుకొచ్చారు.

త‌మ‌న్నాతో నాట్ ఓకే.. మ‌రి సాయిప‌ల్ల‌వితో?

Submitted by nanireddy on Sat, 09/16/2017 - 11:53

ఎ.ఎల్‌.విజ‌య్‌.. సినిమాకో జోన‌ర్‌ని ట‌చ్ చేసే ఓ త‌మిళ ద‌ర్శ‌కుడి పేరిది. తెలుగులోనూ ఆయ‌న చిత్రాలు డ‌బ్బింగ్ అయ్యాయి. '1947 ఎ ల‌వ్‌స్టోరీ', 'నాన్న‌', 'శివ‌తాండ‌వం', 'అన్న' త‌దిత‌ర చిత్రాల‌తో త‌న ప్ర‌తిభ‌ని తెలుగు వారికి కూడా ప‌రిచ‌యం చేసిన విజ‌య్‌.. న‌టి అమ‌లా పాల్‌కి మాజీ భ‌ర్త‌. ఇదిలా ఉంటే.. గ‌తేడాది తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో త‌మ‌న్నాతో రూపొందించిన చిత్రం 'అభినేత్రి' పేరుతో ఇక్క‌డ రిలీజ‌య్యింది. సినిమా కాన్సెప్ట్ వైజ్ మెప్పించింది కానీ.. రిజ‌ల్ట్ విష‌యంలో తేడా కొట్టింది. అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి తెలుగు, త‌మిళ భాషల్లో ప్ర‌య‌త్నం చేస్తున్నాడు విజ‌య్‌.

జైలవకుశలో తమన్నా స్పెషల్ సాంగ్ లుక్

Submitted by lakshman on Fri, 09/15/2017 - 16:55
తెలుగు ఐటమ్ సాంగ్స్‌లో ఒకప్పుడు ఉత్తరాది భామలు ఆడిపాడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్పెషల్ సాంగ్స్ కోసం వాళ్లనో, వీళ్లనో దింపడం ఎందుకనే భావనకు దర్శకనిర్మాతలొచ్చారు. సినిమాకు ఏ మాత్రం సంబంధం లేని మరో హీరోయిన్‌తో....

త‌మ‌న్నా క్వీన్ అవ‌తారం..

Submitted by nanireddy on Wed, 09/06/2017 - 14:42

త‌మ‌న్నా క్వీన్ పాత్ర‌లో క‌నిపించ‌నుందా? అవున‌నే వినిపిస్తోంది టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో. అలాగ‌ని.. యుద్ధాలు చేసే రాణి పాత్ర అనుకుంటే పొర‌పాటే. బాలీవుడ్ లో ఘ‌న‌విజ‌యం సాధించిన సోష‌ల్ మూవీ 'క్వీన్' ఆధారంగా రూపొందుతున్న తెలుగు రీమేక్‌లో త‌మ‌న్నా న‌టించ‌నుంది. కంగనా ర‌నౌత్ హీరోయిన్‌గా న‌టించిన 'క్వీన్' నాలుగేళ్ల క్రింద‌ట విడుద‌లైంది. ఇక‌ గ‌త రెండేళ్లుగా ఈ సినిమాని రీమేక్ చేయాల‌ని ద‌క్షిణాదిలో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ మ‌ధ్యే క‌న్న‌డ‌ వెర్ష‌న్ షూటింగ్ కి వెళ్ల‌గా.. త‌మిళంలో కాజ‌ల్‌తో అనౌన్స్ అయ్యింది. ఇక తెలుగులో ఆ పాత్ర‌కి త‌మ‌న్నా పేరు వినిపిస్తోంది.