vv vinayak

‘ఇంటిలిజెంట్’ టాక్: తేజూ మళ్లీ దెబ్బకొట్టాడు!

Submitted by arun on Fri, 02/09/2018 - 12:50

హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన ఈ మెగా హీరో ఇంటెలిజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఇంటిలిజెంట్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.

జవాన్ ప్లాప్ తర్వాత సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఈసారి కూడా సుప్రీమ్ హీరో సోసో అనిపించాడు. యాక్టింగ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ..సన్నివేశాల్లో యాక్షన్ డోస్ మరీ ఎక్కువయ్యింది. లావణ్య త్రిపాఠి గ్లామర్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. 

పవన్‌కల్యాణ్‌కు ఓ చిన్న విన్నపం

Submitted by arun on Mon, 02/05/2018 - 17:01

సాయిధరమ్‌తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. లావణ్య త్రిపాఠి కథానాయిక. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం రాజమహేంద్రవరంలో ప్రీరిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది.

15 ఏళ్ల 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 13:03

కొన్ని సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా.. ఏదో రూపంలో గుర్తుండిపోతాయి. అలా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'. ఇందులో బాల‌కృష్ణ తండ్రీకొడుకులుగా రెండు పాత్ర‌లు పోషించాడు. ఒక‌టి చెన్న‌కేశ‌వ రెడ్డి కాగా.. రెండోది భ‌ర‌త్‌. ఈ రెండు పాత్ర‌ల్లోనూ వేరియేష‌న్ చూపిస్తూ.. బాల‌య్య చాలా బాగా న‌టించాడు. 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' పాత్ర‌లో ప‌గ‌, ప్ర‌తీకారం తాలుకు ఇంటెన్సిటీ ఎక్కువ‌గా ఉంటే.. కొడుకు భ‌ర‌త్‌ది సిన్సియ‌ర్ పోలీస్ పాత్ర‌. ఈ రెండు పాత్ర‌ల ప‌రంగా బాల‌య్య తీసుకున్న శ్ర‌ద్ధ సినిమాలో స్ప‌ష్టంగా తెలుస్తుంది.

14 ఏళ్ల 'ఠాగూర్‌'

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 12:03

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన చిత్రాల‌లో 'ఠాగూర్' ఒక‌టి. లంచంపై పోరాటం చేసిన ఓ కామ‌న్‌మ్యాన్‌ క‌థగా 'ఠాగూర్' తెర‌కెక్కింది. త‌మిళంలో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సూప‌ర్‌హిట్ చిత్రం 'ర‌మ‌ణ' (విజ‌య్ కాంత్ క‌థానాయ‌కుడు)కి రీమేక్ వెర్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి తెలుగులో వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాకి మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

క‌ల నిజ‌మైంద‌న్నమాట‌ - సాయిధ‌ర‌మ్ తేజ్‌

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 14:03

'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌', 'సుప్రీమ్' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన‌ యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి స్వ‌యానా మేన‌ల్లుడు అయిన సాయిధ‌ర‌మ్‌.. చాలావ‌ర‌కు వారి పోలిక‌ల‌తో ఉండ‌డంతో అభిమానుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో న‌టించిన 'జ‌వాన్' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మ‌రో వైపు కొత్త చిత్రాల‌తో బిజీ అవుతున్నాడు సాయిధ‌ర‌మ్‌.

మావ‌య్యల ద‌ర్శ‌కుల‌తో హిట్ కొడ‌తాడా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 15:41

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మేన‌ల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా.. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ క‌థానాయ‌కుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌', 'సుప్రీమ్' వంటి విజ‌యాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తా చాటుకున్న సాయి ధ‌ర‌మ్‌కి.. 'తిక్క‌', 'విన్న‌ర్‌', 'న‌క్ష‌త్రం' రూపంలో వ‌రుస ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించాయి. ఈ నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్‌కి అర్జంట్‌గా ఓ హిట్ సినిమా కావాలి.