Sexual assault

రేపిస్టుకు గ్రామ శిక్ష…దున్నపోతుపై ఊరేగించారు...

Submitted by arun on Tue, 09/18/2018 - 11:18

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచారం చేసిన వ్యక్తికి దేహాశుద్ధి చేశారు స్థానికులు. నిందితుడి ముఖానికి నల్ల రంగు పూసి, అతన్ని దున్నపోతుపై ఊరేగించారు. అతని మెడలో షూలతో చేసిన దండను వేసి చాలా హేయంగా శిక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏళ్ళ బాలుడికి మాయ మాటలు చెప్పి ఓ వ్యక్తి నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. సదరు బాధిత బాలుడు ఇంటికి వచ్చి అమ్మానాన్నలతో జరిగిన ఉదంతం గురించి చెప్పాడు. వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళకుండా గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు. అప్పుడు వాళ్ళు పంచాయితీ పెట్టి నిందితుడికి శిక్ష అమలు చేశారు.

న్యాయమా నీవెక్కడ ?

Submitted by arun on Mon, 03/19/2018 - 10:20

ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట బాలికలపై లైంగికదాడుల వార్తల్ని వినాల్సివస్తోంది. ఇవేవీ పాలకుల, ప్రభుత్వాల చెవిన మాత్రం పడటం లేదు. సుప్రీంకోర్టు స్వయంగా కలుగజేసుకొని పెండింగ్‌ కేసులు ఎన్ని ఉన్నాయని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్‌ను అడిగితే లక్షకు పైగా కేసులు ఉన్నాయని తేలింది. 'పోక్సో' చట్ట ప్రకారం బాలికలపై లైంగిక దాడి కేసుల విచారణ ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాలి. అలాంటిది ట్రయల్‌ కోర్టుల్లో లక్షకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండటమేందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

తల్లితో సహజీవనం.. కుమార్తెపై అత్యాచారం

Submitted by arun on Sun, 01/21/2018 - 11:39

తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఫిర్యాదు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాదులోని పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ(35)కు నలుగురు పిల్లలు. మధ్యప్రదేశ్‌కు చెందిన జయవీర్‌(21)తో ఆమెకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో సఖ్యత లేకపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని జయవీర్‌తో కలిసి విజయవాడకు వెళ్లింది. అక్కడ రెండు నెలలు ఉండి గతేడాది మే నెలలో జల్‌పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్‌కాలనీకి వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఓ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు. మహిళతో సహజీవనం చేస్తున్న జయవీర్‌ ఆమె కూతురు(15)పై కన్నేశాడు.

ప్రయాణికుల‌పై హ‌త్యాచారానికి పాల్ప‌డుతున్న ఓలా క్యాబ్ డ్రైవ‌ర్

Submitted by arun on Mon, 01/15/2018 - 12:26

క్యాబ్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికులపై అత్యాచార యత్నానికి పాల్పడుతోన్న ఓ క్యాబ్‌ డ్రైవర్‌ను కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్‌ అనే యువకుడు కొంత కాలంగా వోలా సంస్థలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన క్యాబ్‌లో ప్రయాణించే మహిళా ప్రయాణికులను మాటలతో మభ్యపెట్టి, ఆపై  వాహనం దారి మళ్లించి వారిపై అత్యాచారాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ  నెల 5న కుషాయిగూడలోని ఇదే తరహాలో ఓ యువతిపై అత్యాచార యత్నం చేశాడు. తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు  సీసీ ఫుటేజీ ఆదారంగా కారును గుర్తించి నిందితుడిని అరెస్టు చేశారు.