lesbian

కలిసి బతకనివ్వట్లేదు.. ఇక వచ్చే జన్మలోనే...

Submitted by arun on Tue, 06/12/2018 - 14:45

సమాజం తమను దూరంగా పెడుతుందని.. వెలేస్తుందనే భావనతో ఓ లెస్బియన్ జంట ఆత్మహత్య చేసుకుంది. ఓ మూడేళ్ల పాపతో పాటు వారిద్దరూ సబర్మతి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..అహ్మదాబాద్‌.. బావ్లా పట్టణానికి చెందిన ఆశా(30) తన ఇద్దరు పిల్లలతో, అదే ప్రాంతంలో భావన(28) అనే మరో మహిళ తన ఇద్దరు కుమారులతో నివసిస్తున్నారు. భర్తలు దూరం కావటంతో ఓ ఫ్యాక్టరీలో పని చేస్తూ వీరిద్దరూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య బంధం బలపడింది. గత ఏడు నెలలుగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న వీరిద్దరూ... త్వరలో వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డారు. అయితే కుల పెద్దలు మాత్రం వీరి సంబంధాన్ని వ్యతిరేకించారు.

లెస్బీయ‌న్ గా నిత్యామీన‌న్

Submitted by lakshman on Mon, 01/15/2018 - 12:00

హీరోయిన్ నిత్యామీన‌న్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతుంది. న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీన‌న్ ఓ సినిమాలో  లెస్బియన్ పాత్రలో కనిపించనుందట.  ప్రస్తుతం నిత్యామీనన్ 'అ!' సినిమాతో పాటు మరో భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేస్తుంది. ఈనేప‌థ్యంలో నిత్యా లెస్బీయ‌న్ గా యాక్ట్ చేస్తుంద‌ని టాక్ . అయితే సుప్రీం కోర్టులో, లెస్బియన్ సెక్స్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో.. లెస్బియన్‌గా నటించే నిత్యామీనన్ రొమాన్స్‌కు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందో లేదోనని చర్చ సాగుతోంది.