surender reddy

సైరాగా మారిన ఈ బుడతడు ఎవరో తెలుసా ?

Submitted by arun on Sat, 01/27/2018 - 12:33

చిరు 151వ చిత్రంగా ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తు్న్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. నయనతార, అమితాబ్‌ బచ్చన్‌, జగపతిబాబు, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధరాంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.అయితే సైరాపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా చిన్న పిల్లలతో పాటు పండు ముసలి వరకు ఈ సినిమాపై ఎంతో ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి తనయుడు చిరు కాస్ట్యూమ్ కి ఇంప్రెస్ అయి అలాంటి డ్రెస్ తనకి కావాలని అడిగాడట.

'సైరా'.. రెగ్యుల‌ర్ షూటింగ్ అప్ప‌ట్నుంచే

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 11:49

'ఖైదీ నెం.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు త‌న 151వ చిత్రాన్ని స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్నారు. 'సైరా న‌ర‌సింహారెడ్డి' పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం గ‌త నెల లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యింది. అలాగే చిరు పుట్టిన‌రోజున ఫ‌స్ట్‌లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ నేప‌థ్య సంగీతంతో వ‌చ్చిన ఈ మోష‌న్ పోస్ట‌ర్ అభిమానుల్ని అల‌రించింది. 

సురేంద‌ర్‌కి ఆ విష‌యంలో బ్రేక్ ప‌డుతోంది

Submitted by nanireddy on Mon, 09/18/2017 - 12:19

రాశి కంటే వాసికే ప్రాధాన్యం ఇచ్చే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. 12 ఏళ్ల కెరీర్‌లో 8 చిత్రాల‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. కెరీర్ ప్రారంభంలో సంవ‌త్స‌రానికో సినిమా అన్న‌ట్లుగా ఉన్న సూరి.. త‌రువాత రెండేళ్ల‌కో సినిమా అన్న‌ట్లుగా త‌న‌ శైలిని మార్చుకున్నాడు. అయితే 2014లో వ‌చ్చిన 'రేసు గుర్రం' త‌రువాత వ‌రుస‌గా 'కిక్ 2' (2015), 'ధృవ' (2016) చిత్రాలు చేసి.. మ‌ళ్లీ సంవ‌త్స‌రానికో సినిమా అంటూ పాత రూటునే ఎంచుకున్నాడు.

'సైరా' తోనైనా బ్రేక్ చేస్తాడా?

Submitted by nanireddy on Fri, 09/15/2017 - 15:27

 

జ‌యాప‌జ‌యాలు అనేవి చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌ర్వ సాధార‌ణం. కాక‌పోతే.. ఒక్కోసారి వ‌రుస‌గా విజ‌యాలు ప‌ల‌క‌రిస్తే.. మ‌రోసారి వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తాయి. అయితే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్  రెడ్డి విష‌యంలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుందీ ప‌రిస్థితి. 'కిక్' నుంచి సురేంద‌ర్ రెడ్డి సినిమాల‌ను గ‌మ‌నిస్తే.. ఓ హిట్, ఆ త‌రువాత ఫ్లాప్,  ఆ త‌రువాత మ‌ళ్లీ హిట్ .. ఇలా సినిమాకో ఫ‌లితం వ‌స్తోంది.