trs party

బుజ్జగింపుల పర్వం పార్ట్‌-2...మిగతా 12 స్థానాల్లో ఆశావహులను...

Submitted by arun on Sun, 11/04/2018 - 14:28

గులాబీ తెరపై బుజ్జగింపుల పర్వం పార్ట్‌ టు మొదలైంది. మొన్నటి వరకు కొందర్ని దారిలోకి తెచ్చిన అధినాయకత్వం, మాటవినని మిగతా నేతలనూ చల్లబరిచేందుకు సిద్దమైంది. త్వరలో ప్రకటించబోతున్న 12 స్థానాల్లో, ఆశావహులు, మిగతా నేతలనూ పిలిపించుకుని మాట్లాడబోతున్నారు కేసీఆర్.

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్...కాంగ్రెస్‌లో చేరబోతున్న...

Submitted by arun on Sun, 11/04/2018 - 13:31

సూర్యాపేట జిల్లాలో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైంది. హుజూర్‌నగర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మేళ్లచెరువు, చింతలపాలెం, మఠంపల్లి మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, మరో 100మంది నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు హైదరాబాద్‌ బయల్దేరినట్టు తెలుస్తోంది. వీరంతా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరబోతున్నారు. గత కొద్ది రోజులుగా హుజూర్‌నగర్ టీఆర్ఎస్ పార్టీని అధిష్టానం పట్టించుకోకపోవడమేగాక ఇప్పటికీ టీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేయలేదు.

టీఆర్ఎస్ నుంచి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సస్పెన్షన్

Submitted by arun on Fri, 10/26/2018 - 12:22

గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని టీఆర్‌ఎస్‌ పార్టీ సస్పెండ్‌ చేసింది. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గులాబీ పార్టీ అభియోగాలు మోపింది. గజ్వేల్‌ నియోజకవర్గంలో గ్రూప్‌ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్టీ కేంద్ర కార్యాయలం నర్సారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 

టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాముల్ నాయక్ సస్పెన్షన్‌

Submitted by arun on Mon, 10/15/2018 - 13:02

టీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమైన రాములు నాయక్‌పై గులాబి దళం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అధిష్టానం సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఇల్లెందు నుంచి టికెట్ ఆశిస్తున్న రాములు నాయక్ గత కొద్ది కాలంగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారు. నిన్న పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ ‌కుమార్ రెడ్డితో సమావేశమయిన ఆయన  తన మనసులోని మాటను బయటపెట్టారు. దీనికి అధినాయకత్వం సానుకూలంగా స్పందించడంతో  ఈ నెల 20న కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. 

గులాబీ అసమ్మతి నేతలపై వేటు

Submitted by arun on Wed, 10/03/2018 - 16:06

రేపు నల్గొండలో కేసీఆర్ సభ నేపథ్యంలో అసమ్మతి నేతలపై హైకమాండ్ వేటు వేస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ నేత వేనేపల్లి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వేనేపల్లి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు టీఆర్‌ఎస్ ప్రకటించింది. మునుగోడు సీటును ఆశించిన వెంకటేశ్వరరావును పలుమార్లు బుజ్జగించారు. అయినా ఆయన వినలేదు. దీంతో పార్టీ నుంచి బహిష్కరించారు. అలాగే నల్గొండ, నాగార్జున సాగర్, తుంగతుర్తిలో అసమ్మతి నేతల వేటు వేసే అవకాశం అవకాశం ఉంది. 

ఎల్లారెడ్డి లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన మార్కల్‌ గ్రామస్తులు

Submitted by arun on Wed, 09/26/2018 - 14:20

 కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో టీఆర్‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌కే కంచుకోటగా నిలిచే మార్కల్‌ గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి గ్రామాభివృద్ధికి గతంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకపోవడంతో స్థానికులు మండిపడుతున్నారు. దీంతో టీఆర్ఎస్‌ నేతలు గ్రామంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు గ్రామానికి వెళ్లేందుకు టీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమయ్యారు. దీంతో గ్రామంలో  టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఆ 14 నియోజకర్గాల్లో పెండింగ్.. ఎందుకంటే?

Submitted by arun on Fri, 09/07/2018 - 10:20

ముందస్తు గంట మోగించిన టిఆరెస్ అధినేత కేసిఆర్ ఏకంగా 105 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేసి సమరానికి సై అన్నారు. చాలా మంది సిటింగ్ లకు సీట్లు ఖరారైనా.. ఇద్దరికి మాత్రం టిక్కెట్లు నిరాకరించగా, అయిదుగురు సిటింగ్ ల సీట్లను పెండింగ్ లో పెట్టారు. మరో 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది.  

టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పనున్న డీఎస్

Submitted by arun on Tue, 09/04/2018 - 09:13

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కారు దిగడం ఖాయమైపోయింది. అధికార పార్టీకి గుడ్‌బై చేప్పేయనున్నారు. నిజామాబాద్‌లో తన ప్రధాన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న డీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని వీడాలంటూ మెజార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని డీఎస్ ప్రకటించారు. మరి డీఎస్ కారు దిగితే  నెక్ట్స్ హస్తం గూటికి చేరతారా..? కమలం దళంలో చేరతారా..? 

ప్రత్యర్థులపై ఎదురుదాడికి సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ...సొంత దళాన్ని రంగంలోకి...

Submitted by arun on Fri, 07/13/2018 - 10:57

సోషల్ మీడియాలో ఇక గులాబీ దళం ప్రవేశిస్తోంది. తమపై వస్తున్న విమర్శలకు దీటైన సమాధానం చెప్పేందుకు సొంత బలగాన్ని నియమించబోతుంది. నియోజకవర్గానికి  100 మంది చొప్పున సోషల్ మీడియా యాక్టివిస్టులను తయారు చేయబోతుంది. త్వరలోనే హైదరాబాద్‌లో వందలాది మందికి శిక్షణ ఇచ్చి రంగంలోకి దించబోతుంది టీఆర్ఎస్ పార్టీ. అయితే, ఈ దళం ఎందుకు..? ఎవరిపై దండయాత్ర చేస్తుంది..? 

ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్...వ‌రుస చేరిక‌లకు టీఆర్ఎస్ ప్లాన్

Submitted by arun on Sat, 06/09/2018 - 12:47

వ‌రుస చేరిక‌లకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. వివిద పార్టీలకు చెందిన‌ నేత‌ల‌ను కారెక్కించేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో కొందరు కీలక నేత‌ల‌కు గులాబీ కండువా క‌ప్పి ప్ర‌తిప‌క్షాల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వ్యూహం రచిస్తున్నారు..అధికార పార్టీ నేతలు. పాల‌మూరు జిల్లాకు చెందిన ముగ్గురు నాయకులకు గులాబీ తీర్థం ఇవ్వడం ద్వారా చేరికలకు మరోసారి తెరలేపుతున్నారు.