Sunil Gavaskar

60 ఓవర్లు బ్యాటింగ్ ఒక్కడే చేసాడు

Submitted by arun on Mon, 10/15/2018 - 12:52

అప్పట్లో ఒక వన్ డే మ్యాచ్ లో 60 ఓవర్లు  ఉండేవి.. అయితే మొత్తం 60 ఓవర్లు  బ్యాటింగ్ చేసిన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా! ఇంగ్లండ్తో జరిగిన 1975 ప్రపంచ కప్ మ్యాచ్లో , సునీల్ గవాస్కర్ 60 ఓవర్లు  బ్యాటింగ్ చేసి ఆ ఒక వన్ డే మ్యాచ్ మొత్తం ఆడాడు, అయితే అతను  కేవలం 36 పరుగులు చేశాడు. చివరికి భారత్ 200 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. శ్రీ.కో.
 

నిజమైన హీరో సునీల్ గవాస్కర్

Submitted by arun on Sat, 09/15/2018 - 17:28

సునీల్ గవాస్కర్ 1992-93లో హిందూ-ముస్లిం అల్లర్లలో ఒక గుంపు నుండి ఒక కుటుంబాన్ని కాపాడాడని మీకు తెలుసా, ఒక రోజు గవాస్కర్ తన కిటికీ నుండి బయటకి చుస్తువుండగానే, ఆ ప్రాంతంలో ఒక గుంపుగా వస్తున్న వ్యక్తులు, ఒక టాక్సీలో వెళ్తున్న ఒక కుటుంబం వెంబడించాసాగారట, అది కిటికీలోనుంచి గమనించి, అతను వెంటనే తన భార్యను, ఈ విషయం గురుంచి  పోలీసులు పిలవమని చెప్పి, తను ఆ గుంపు మరియు టాక్సీల మధ్య నిలబడి, ఆ టాక్సీ లోని కుటుంబానికి హాని చేసేముందు, తనని చంపి ముందుకు వెల్లలాని చెప్పగా, సునీల్ మొండితనానికి, దైర్యానికి, ఆ గుంపు వారు చివరికి అక్కడి నుండి వెళ్లిపోయారట. శ్రీ.కో.

"బలీ కా బకరా"

Submitted by lakshman on Sun, 01/14/2018 - 23:28

టీమిండియా కెప్టెన్ పై మాజీ క్రికెటర్లు మండిప‌డుతున్నారు. త‌ప్పుడు నిర్ణ‌యాల‌తో ఆట‌గాళ్ల ప్ర‌తిభ‌ను తొక్కే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం టీమిండియా- సౌత్రాఫ్రికా ల మ‌ధ్య  టెస్ట్ మ్యాచ్ జ‌రుగుతుంది. అయితే టెస్ట్ కోసం జ‌ట్టులో మార్పులు జ‌రిగాయి. ఆ మార్పులపై సీనియ‌ర్లు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ధవన్, భువనేశ్వర్‌లను తొలగించి వాళ్ల స్థానంలో రాహుల్, ఇశాంత్‌లను సెల‌క్ట్ చేసుకోవ‌డం స‌రైంద‌ని కాద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. జ‌ట్టు ఎంపిక విష‌యంలో కెప్టెన్ కోహ్లీని త‌ప్పుబ‌ట్టిన మాజీ కెప్టెన్ సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.