Bakthi

చివరి అంకానికి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Submitted by nanireddy on Fri, 09/21/2018 - 07:56

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ ఉదయం 7:30 గంటలకు వరాహ పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం మహోత్సవం జరిగింది. రాత్రి 8 గంటలకు శ్రీవారి ఆలయంలో ధ్వాజారోహణ కార్యక్రమం జరగనుంది. గురువారం స్వామివారికి అశ్వవాహన సేవ వైభవంగా సాగింది. శ్రీనివాసుడు బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహన రూడుడై తిరుమాడ వీధుల్లో విహరించారు. అలాగే సూర్యుని కిరణ కాంతుల్లో మేరు పర్వతం వంటి రథంలో శ్రీదేవి భూదేవిలతో కలిసి ఊరేగారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

బ్రహ్మోత్సవాల వెనుకున్న అసలు చరిత్ర ఏంటి...బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి?

Submitted by arun on Tue, 09/11/2018 - 09:55

తిరులేశుని సన్నిధి... బ్రహ్మోత్సవ సంబరాలకు ముస్తాబవుతోంది. ఏడాది పొడవునా ఉత్సవాలు, ఊరేగింపులతో భక్తకోటిని అనుగ్రహించే శ్రీవారికి సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే బ్రహ్మోవత్సవాలంటే ఎందుకింతటి విశిష్టతో మీకు తెలుసా? ఆ లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణుడికి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం వెనుక వాస్తవ చరిత్ర ఏంటి? అసలు ఇంతకీ తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు ఎప్పట్నుంచి జరుగుతున్నాయి. 9రోజులపాటు జరిగే ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అనే పేరు ఎలా వచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్రపై hmtv ప్రత్యేక కథనం.

చిత్తోర్రు రాణి కర్నావతి రాఖి.

Submitted by admin on Sun, 08/26/2018 - 11:13

రాణి కర్నావతి  రాజ్యంఫై గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా, దాడి చేయబడిన వస్తున్నాడని తెలిసి.. రాణి కర్నావతి  చక్రవర్తి హుమయూన్కు రాఖీని పంపి తన రాజ్యంలో భద్రత కోసం కోరిందట... హుమయూన్ ఆమెకు సహాయపడటానికి బయలుదేరాడు కానీ చాలా ఆలస్యంగా చేరుకున్నాడట.. అప్పటికే రాణి చనిపోయినప్పటికీ, హుమాయున్ పోరాడి బహదూర్ షాను ఓడించి రాజ్యాన్ని రాణి కర్నావతి కుమారునికి ఇచ్చాడని ప్రసిద్ది. ఇలా రాఖి ఎందరినో కలిపింది..కాపాడింది. శ్రీ.కో.

అలెగ్జాండర్ని రక్షించిన రాఖి.

Submitted by admin on Sun, 08/26/2018 - 11:02

ఇది రక్షా బంధన్ యొక్క సంఘటనతో బాగా ప్రచారము మరియు సంబంధం ఉన్న ఒక చారిత్రక సంఘటన. ఒకసారి  అలెగ్జాండర్ భార్య, పౌరవ రాజ్యానికి రాజైన పోరసుకి రక్షాబంధనం కట్టడం వల్ల, యుద్ధంలో అలెగ్జాండర్ని హతమార్చే అవకాశం వచ్చినా కూడా పోరస్ చంపకుండా ఉన్నాడని ప్రసిద్ది.. ఈ విధంగా పోరస్ తన భర్తను చంపకుండా అలెగ్జాండర్ భార్యను గౌరవించాడట.

కృష్ణుడికి రాఖీ కట్టిన ద్రౌపది

Submitted by admin on Sun, 08/26/2018 - 10:52

పురాణాలలోని ఒక కధ ప్రకారం, కృష్ణుడు ఒకసారి గాలి పటం ఎగిరేసే సమయంలో తన చేతి కట్ అయ్యిందట, ఇది చూసిన ద్రౌపది వెంటనే ఆమె చీర నుండి కొంత బాగం చింపి ఆ గాయానికి కట్టిందట... ఈ తర్వాత  శ్రీకృష్ణభగవానుడు బదులుగా ఏ పరిస్థితిలోనైన ద్రౌపదిని రక్షిస్థానని  వాగ్దానం చేశాడట.. తరువాత శ్రీ కృష్ణ తన శక్తి తో ద్రౌపదిని కాపాడి, అన్నా చెల్లెల బంధము మరియు రాఖి బంధన్ విశిష్టతని చాటారు...శ్రీ.కో.

రాఖీతో దేవతలందరి రక్షణ

Submitted by nanireddy on Sun, 08/26/2018 - 09:40

అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక రాఖీ.. సోదరికి కొండంత అండగా నిలిచి, ఆకాశమంత ప్రేమను పంచే పండుగ రోజు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ రాఖీ.. శ్రావణ పౌర్ణమి రోజు వచ్చింది.. సోదరులకు రాఖి కట్టేందుకు ఆడపడుచులంతా సిద్ధమయ్యారు.  సోదరిని తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడుచును దేవతా స్వరూపంగా భావిస్తారు. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మిగా పిలుచుకుంటాం.. ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టినట్లుగా భావించే సంప్రదాయం భారతీయులది.

తిరుమల రికార్డును బద్దలు కొట్టిన షిర్డీ సాయిబాబా

Submitted by arun on Tue, 07/31/2018 - 10:29

ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం తిరుమల. నిత్యం లక్షలాది మంది భక్తులు స్వామి వారి సేవలో తరిస్తారు. అయితే ఇంతకాలం ఆదాయం ఆర్జనలోనూ వెంకన్నకు పోటీ పడే ఆలయం లేదు. ఈ నెల 26న తిరుమలకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ రికార్డును వారం రోజులు తిరక్కుండానే మరో ఆలయం బద్దలు కొట్టింది. వడ్డీ కాసుల వెంకన్న మించిన ఆదాయం ఏ ఆలయానికి వస్తోంది. 

నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే తిరుమలలోనే ప్రాణత్యాగం చేస్తా

Submitted by arun on Tue, 06/05/2018 - 19:49

రమణదీక్షితులు ఆరోపణలకు టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రమణ్యం కౌంటర్ ఇచ్చారు. వెయ్యి కాళ్ల మండపం కూల్చేయడంలో తన ప్రమేయం లేదన్న బాలసుబ్రమణ్యం.... నాలుగో మాడ వీధిలో రమణదీక్షితుల ఇంటితో సహా అన్ని ఇళ్లను తొలగించామన్నారు. అందరికీ శాశ్వత ఇళ్లను నిర్మించి ఇచ్చామని, రమణదీక్షితులకు త్రిబుల్‌ బెడ్రూమ్‌ కాటేజీ ఇచ్చామన్నారు. మిరాశిలను వ్యతిరేకించడం వల్లే తనపై ఆరోపణలు చేశారన్న బాలసుబ్రమణ్యం.... మిరాశిలతో మిగతా బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతోందన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లే నిరూపిస్తే తిరుమల శ్రీవారి ముందే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమన్నారు టీటీడీ మాజీ జేఈవో బాలసుబ్రమణ్యం.

రామాయణ కాలంలోనే టెస్ట్ ట్యూబ్ బేబీ.. ఉదాహరణ సీతమ్మవారే!

Submitted by nanireddy on Fri, 06/01/2018 - 16:28

ఇటీవల హిందీ పాత్రికేయుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిధిగా ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేశ్‌ శర్మ  హాజరయ్యారు. ఆ సందర్బంగా పాత్రికేయంపై మాట్లాడిన శర్మ పాత్రికేయం మహాభారతం కాలం నుంచే ఉందని, ఇప్పుడున్న గూగుల్ అప్పట్లోనే ఉందన్నారు.  దానికి ఉదాహరణ ముల్లోకాల సంచారి నారాధమునేనని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే తాజాగా టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ కార్యక్రమానికి హాజరయ్యారు శర్మ ఈ విషయంపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామాయణ కాలంలోనే టెస్ట్‌ ట్యూబ్‌ బేబీల ఎరా మొదలైందని , సీతమ్మవారు మట్టికుండలో జన్మించారని పెద్దలు చెబుతున్నారు.

తిరుమలలో టైం స్లాట్ సర్వదర్శన కౌంటర్ల మూసివేత

Submitted by nanireddy on Tue, 05/22/2018 - 16:59

 తిరుమలలో వేసవి రద్దీ గణనీయంగా పెరగడంతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 50 గంటల సమయం పడుతుంది. దీంతో తిరుమలలోని టైం స్లాట్ సర్వదర్శన కౌంటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. తిరుపతి కంటే తిరుమలలో అధికశాతం మంది భక్తులు టోకన్లు పొందడం వల్ల నిరీక్షించే సమయం 40 గంటలు దాటుతుందని, దీని కారణంగా మూడురోజులపాటు భక్తుడు కొండపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అయుతే తిరుపతిలో యధావిధిగా కౌంటర్లు పనిచేస్తాయని, రద్దీ సాధారణ స్థితికి వచ్చిన అనంతరం తిరుమలలో కౌంటర్లు తెరిచే విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.