Bakthi

యాదాద్రికి పోటేత్తిన భక్తులు

Submitted by chandram on Sun, 11/11/2018 - 12:02

యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. కార్తీక మాసం కావడంతో కొండపైన సత్యనారాయణ వ్రత మండపాలు, స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. కుటుంబ సమేతంగా లక్ష్మీ నర్సింహున్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. 

అయ్యప్ప దర్శనానికి 550మంది మహిళలు

Submitted by nanireddy on Sat, 11/10/2018 - 09:19

25 రోజుల విరామం అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం పునఃప్రారంభం అవుతుంది. దాంతో అయ్యప్పను దర్శించుకునేందుకు మహిళలు పోటీపడుతున్నారు. ఇప్పటికే శబరిమల యాత్రకు ఆన్‌లైన్‌లో 550 మంది రుతుస్రావ వయసు అమ్మాయిలు, మహిళలు టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డ్‌ తెలిపింది. అంతేగాక శుక్రవారం నాటికి దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనానికి బుక్‌ చేసుకున్నట్లు తెలిపింది.ఇదిలావుంటే మహిళలందరూ కూడా అయ్యప్పను దర్చించుకోవచ్చని సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో  గత రెండు నెలలుగా శబరిమల పరిసరాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం..

Submitted by arun on Sun, 11/04/2018 - 11:15

ఒక రోజు ఉత్సవం కోసం శబరిమల ఆలయం రేపు తెరుచుకోనుంది. దీంతో ఆలయపరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు ఐదు వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. సన్నిధానం, పంబ, నిలక్కల్‌ ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకూ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పతనంతిట్ట జిల్లా మేజిస్ట్రేట్‌ పిబి నూత్‌ ప్రకటించారు. 'చితిర అట్ట విశేషం' సందర్భంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 5.30 గంటలకు తెరుస్తారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు.

5న తెరుచుకోనున్న శబరిమల

Submitted by arun on Sat, 11/03/2018 - 16:35

'చితిర అట్ట విశేషం' సందర్భంగా ఈనెల 5వ తేదీన శబరిమల ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. ఆలయాన్ని 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తెరిచి, 6వ తేదీ రాత్రి 10.30 గంటలకు మూసి వేస్తారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, ఈ సందర్భంగా మహిళలు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, అక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం 5000 మంది పోలీసులను మోహరింపజేశారు. పంబ, ఇల్లువంగళ్, నీలక్కళ్ లలో ఈరోజు నుంచే 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు.

అయోధ్య‌లో 151 మీటర్ల ఎత్తున్న రాముడి విగ్ర‌హం

Submitted by arun on Sat, 11/03/2018 - 12:25

గుజ‌రాత్‌లోని న‌ర్మ‌దా న‌దిపై 182 మీటర్ల ఎత్తున్న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ విగ్ర‌హాన్ని మోదీ ఆవిష్క‌రించిన విషయం తెలిసిందే, ఇదే తరహాలో అయోధ్య‌లో రాముడి భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.. స‌ర‌యూ న‌ది తీరంలో సుమారు 151 మీట‌ర్ల ఎత్తున్న రాముడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ దీనికి సంబంధించిన వివరాలు దీపావ‌ళి రోజున ప్ర‌క‌ట‌న వెల్లడించనున్నారు.. భూప‌రీక్ష నిర్వ‌హించకే విగ్ర‌హాన్ని ఎక్క‌డ ఏర్పాటు చేయాలో నిర్ణ‌యిస్తామ‌ని అధికారులు స్పష్టంచేశారు..

శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో పరిసమాప్తం

Submitted by nanireddy on Thu, 10/18/2018 - 06:59

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. శిరస్త్రాణాన్ని ధరించిన గోవిందుడు ఖడ్గం చేతపట్టి యుద్ధవీరుని రీతిలో అశ్వవాహనంపై ఊరేగుతుంటే.. వీక్షించిన భక్తులు ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేటితో పరిసమాప్తం కానున్నాయి... చక్రస్నానం నిర్వహించేందుకు టీటీడీ సన్నాహాలు చేసింది. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటలవరకు స్వామివారి ఉత్సవమూర్తులకు.

శబరిమలలో దర్శనం : మహిళలను అడ్డుకుంటున్న అయ్యప్ప మహిళా భక్తులు

Submitted by nanireddy on Wed, 10/17/2018 - 15:08

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు కొందరు మహిళలు సిద్ధపడుతుండటంతో... శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము కచ్చితంగా స్వామిని దర్శించుకుంటామని పలువురు మహిళలు పట్టుబడుతుంటడం...వారికి ఎలాగైనా అడ్డుకుంటామని మరికొందరు మహిళా భక్తులు, హిందూ సంఘాలు ప్రకటించడంతో శబరిమల పరిసరాల్లోనే టెన్షన్ నెలకొంది. అయితే అన్ని వయసుల మహిళలను శబరిమలకు అనుమతిస్తామంటున్న కేరళ పోలీసులు... ఆందోళన చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.

వైకుంఠానికేగిన రఘునాథాచార్య స్వామి

Submitted by nanireddy on Sun, 10/14/2018 - 07:55

ఉభయ వేదాంత ప్రవీణకవిశాబ్ది కేసరి, మహా మహోపాధ్యాయ డాక్టర్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి(93) కన్నుమూశారు. కొంతకాలంగా    అనారోగ్యంతో బాధపడుతున్న అయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతమ్మ(88), నలుగురు కుమార్తెలు శేషమ్మ(70), శ్రీదేవి(63), నీలాదేవి(62), గోదాదేవి(61) ఉన్నారు. 1926 మే 1న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాలోని మోటూరులో జన్మించిన రఘునాథాచార్యులు, పండితులైన తన తండ్రి తాతాచార్యుల వద్ద సంస్కృత దివ్యప్రబంధ సంప్రదాయక విషయాలు అధ్యయనం చేశారు. వరంగల్‌లో ఉంటూ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేశారు.

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం

Submitted by nanireddy on Wed, 10/10/2018 - 09:26

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి కనకదుర్గ అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అమ్మవారికి ఈవో కోటేశ్వరమ్మ దంపతులు తొలిపూజ నిర్వహించగా, రెండో పూజను పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు దంపతులు నిర్వహించారు. తొలిరోజు అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు(బుధవారం) 11 గంటల వరకు భక్తులకు కనకదుర్గమ్మ దర్శనం కల్పించనున్నారు. 

రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ.. పాడుకున్న వ్యక్తి ఎవరంటే..

Submitted by nanireddy on Sun, 09/23/2018 - 11:07

భారీగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో బాలాపూర్ లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ ఏడాది బాలాపూర్‌ లడ్డూ.. వేలం పాటలో రికార్డు ధర పలికింది. రూ.16 లక్షల 60వేలకు శ్రీనివాస్‌గుప్తా అనే వ్యక్తి లడ్డూను సొంతం చేసుకున్నాడు. గతేడాది కంటే లక్ష ఎక్కువ ధర పలికింది.  వేలంపాటలో 12 మంది పాల్గొనగా.. అత్యధిక ధర చెలించి శ్రీనివాస్‌గుప్తా లడ్డూను కైవసం చేసుకున్నాడు. . కాగా 1994లో లడ్డూకు వేలంపాట నిర్వహించగా కొలను మోహన్ రెడ్డి 450రూపాయలకు సొంతం చేసుకున్నారు. క్రమంగా లడ్డూ విలువ పెరుగుతూ 2016 నాటికి అది రూ.15లక్షల 65 వేలకు చేరింది. ఈ ఏడాది 16లక్షల60వేలు పలికింది.