accident

కొండగట్టు ఘాట్‌రోడ్‌లో ఘోర రోడ్డుప్రమాదం...పది మంది మృతి

Submitted by arun on Tue, 09/11/2018 - 12:12

జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలియడంతో జిల్లా ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను అధికారులు పరిశీలిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. 
 

లోయలో పడిన బస్సు ; 10 మంది మృతి

Submitted by arun on Thu, 07/19/2018 - 12:14

ఉత్తరాఖండ్‌లోని తిహ్రీ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ప్రమాదవశాత్తూ 250 మీటర్ల లోతైన లోయలో పడటంతో 10 మంది మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న బస్సు రిషీకేశ్ గంగోత్రి హైవేపై జారిపడి లోయలోకి దొర్లిపోయింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 25 మందితో ప్రయాణం చేస్తున్నబస్సు ఉత్తరకాశీ నుంచి హరిద్వార్‌కు వెళుతోంది. క్షతగాత్రులను రిషికేష్‌లో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

జబర్దస్త్ కామెడీ టీమ్‌కు తప్పిన ప్రమాదం

Submitted by arun on Tue, 06/12/2018 - 12:09

జడ్చర్లకు సమీపంలోని బాలానగర్ వద్ద జబర్దస్త్ కామెడీ షో సభ్యులకు ఘోర ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా జబర్దస్త్ టీమ్ ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కాగా ఈ ప్రమాదం నుంచి చంటి, హరికృష్ణ, హరిచరణ్ లు సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

స్పీకర్‌కు తప్పిన పెనుప్రమాదం

Submitted by arun on Sat, 06/09/2018 - 14:22

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తన నియోజవర్గంలోని గణపురం శివారులో స్పీకర్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. గణపురం నుంచి భూపాలపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భూపాలపల్లి జిల్లా గణపురంలో స్పీకర్ మధుసూదనాచారి రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పర్యటనను ముగించుకుని తిరిగి వస్తుండగా దేవాదుల పైపులను తీసుకువస్తున్న రెండు లారీలు ఎదురుగా వస్తున్న స్పీకర్ కాన్వాయ్ వాహనాలను ఢీకొట్టాయి. బలంగా ఢీకొట్టడంతో వాహనం రోడ్డు కిందకు వెళ్లిపోయింది.

మరిది వరసయ్యే వ్యక్తితో బైక్‌పై భార్యను చూసి....

Submitted by arun on Fri, 06/08/2018 - 11:56

వేరొకరి బైక్‌పై తన భార్య కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త.. తాను డ్రైవ్ చేస్తున్న లారీతోనే ఆమెను ఢీకొట్టి చంపేశాడు. విజయనగరం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మ-తవిటయ్య భార్యాభర్తలు. తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పదిహేను రోజులకోసారి ఇంటి వస్తూ వెళ్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమార్తె ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తవిటయ్య తెలంగాణ రాష్ట్రం ఇస్లామాబాద్‌ నుంచి లారీలో వస్తూ భార్యకు ఫోన్‌ చేశాడు. ఖర్చుకు డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు తప్పిన ప్రమాదం

Submitted by arun on Mon, 04/09/2018 - 11:14

గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు ప్రమాదం తప్పింది. ఔరంగాబాద్‌లో సభ ముగించుకొని హైదరాబాద్‌ వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టబోయింది. అయితే, డ్రైవర్‌ అప్రమత్తతో కారును తప్పించగా వెనక ఉన్న మరో కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పారిపోగా క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖలో బాహుబలి తరహా ఘటన..రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఓ కన్నతల్లి ఆరాటం

Submitted by arun on Fri, 01/19/2018 - 18:00

సృష్టిలో తల్లీ బిడ్డల బంధాన్ని మించినది లేదు.. అది అనంతం..పొత్తిళ్లలో బిడ్డ.. అందనంత ఎత్తుకు ఎదగాలని ఏతల్లయినా కలలు కంటుంది.. తన ఆశ, శ్వాస పిల్లల కోసమేనని ఆరాటపడుతుంది..అలాంటి బిడ్డకు ఏదైనా అపాయం కలిగితే? ఆ తల్లి తట్టుకోగలదా?

constable and his two months old son died in road accident

Submitted by admin on Sun, 09/10/2017 - 21:04

హైదరాబాద్‌ః నగర పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని రెండు నెలల కొడుకు కూడా మరణించాడు. కానిస్టేబుల్ భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్-బిజాపూర్ హైవేపై జరిగింది. శంకరపురం శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తూ.. భార్య, రెండు నెలల బాబుతో కలిసి కూకట్‌పల్లిలో నివాసముండేవాడు. గత అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలోని స్వగ్రామానికి  వెళ్లి.. స్నేహితుడి కారులో తిరిగొస్తున్నాడు. హైవేపై వస్తుండగా మల్కాపూర్ గేట్ సమీపంలో కారు టైర్ పంక్చరైంది. దీంతో వాహనాన్ని అదుపుచేయలేక..