Sports

సంచలన నిర్ణయం తీసుకున్న క్రికెటర్‌ అంబటి రాయుడు

Submitted by nanireddy on Sat, 11/03/2018 - 21:36

భారత క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌కు గుడ్‌ బై చెప్పాడు. ఈ మేరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)కు లేఖ రాశాడు. 'నేను హైదరాబాద్‌కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్‌సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల  క్రికెట్‌ మాత్రమే ఆడతాను' అని లేఖలో పేర్కొన్నాడు.

కొడుకుతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ సానియా సందడి!

Submitted by arun on Sat, 11/03/2018 - 17:47

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా మళ్లీ సోషల్‌ మీడియాలోకి మళ్లీ అడుగుపెట్టింది. తమ చిన్నారి తనయుడికి స్వాగతం పలుకుతూ.. ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఇవాళ ఆమె తన కుమారుడు ఇజాన్‌ తొలి పోటోను షేర్ చేసుకుంది. తన కుమారుడితో కలిసి షోయబ్ మాలిక్ ఆడుతున్న క్రికెట్ మ్యాచ్‌ను టీవీలో చూశానంటూ తెగా మురిసిపోయింది సానియామీర్జా.తల్లిగా నేను, కుమారుడిగా నా బిడ్డ ఇజాన్ ఈ ప్రపంచంలోకి వచ్చి 5 రోజులైంది. నా కుమారుడితో కలిసి తండ్రి ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ కూడా వీక్షించాం.

ధోని వేటుపై సచిన్‌ ఏమన్నాడంటే..

Submitted by arun on Sat, 11/03/2018 - 11:57

టీమిండియా మాజీ కెప్టెన్‌, మహేంద్ర సింగ్‌ ధోనిని టీ20ల నుంచి తప్పించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఈ విషయంపై  సెలక్షన్‌ కమిటీ ఛీఫ్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలు ధోని టీ20 కెరీర్‌ ముగియలేదని స్పష్టంచేశారు. కాగా తాజాగా క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఇదే అంశంపై స్పందిస్తూ, మీడియాతో సచిన్ మాట్లాడుతూ సెలక్టర్ల ఆలోచనేంటో అర్థం కావడం లేదని డ్రెస్సింగ్‌ రూంలో ఏం జరిగిందో తనకు తెలియదు కానీ, ఏ వ్యూహం, నిర్ణయాలు తీసుకున్న దేశానికి ఉపయోగపడేలా ఉండాలని టెండూల్కర్ స్పష్టం చేశాడు.

తల్లి ఒడిలో సానియా కుమారుడు...

Submitted by arun on Sat, 11/03/2018 - 11:29

భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియామీర్జా ఇటీవలే కుమారునికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సానియా మీర్జా తన కుమారుడిని ఎత్తుకున్న ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటో ఆసుపత్రిలో తీసినదిగా తెలుస్తోంది. అయితే సానియా కుమారునికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.

క్రికెటర్‌ తలకు బలంగా తాకిన బంతి..

Submitted by nanireddy on Thu, 11/01/2018 - 21:21

లంక బోర్డ్‌ లెవన్‌తో ఇంగ్లండ్‌ జట్టు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుండగా శ్రీలంక క్రికెటర్‌ పాతుమ్‌ నిస్సాంకా తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు.  ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ కొట్టిన ఓ బలమైన షాట్‌.. లెగ్ సైడ్ ఫీల్డింగ్‌ చేస్తున్న నిస్సాంకా తలకు గట్టిగా తాకింది. దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే సహచరులు  అతనికి సపర్యలు చేశారు.  అనంతరం స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు  స్టేడియం సిబ్బంది. ప్రస్తుతం నిస్సాంకా ఆరోగ్యం నిలకడగా ఉంది.

వన్డే సిరీస్‌ భారత్ సొంతం

Submitted by nanireddy on Thu, 11/01/2018 - 18:12

 టీమిండియా 3-1తో కైవసం చేసుకుంది. వెస్టిండీస్ తో జరిగిన నాల్గవ వన్డేలో విజయం సాధించి వన్డే సిరీస్ ను  సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగుకు దిగిన  వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి కేవలం 104 పరుగులకే కుప్పకూలింది. వన్‌సైడ్‌గా ముగిసిన చివరి మ్యాచ్‌లో విండీస్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పావెల్ , హోప్ డకౌటవగా… హెట్‌మెయిర్ 9 పరుగులకే ఔటయ్యాడు. కెప్టెన్ హోల్డర్ చేసిన 25 పరుగులే విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌. భారత బౌలర్లలో జడేజా 4 , బూమ్రా 2, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. విండీస్‌ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది.

కుప్పకూలిన విండీస్.. టీమిండియా టార్గెట్ 105

Submitted by arun on Thu, 11/01/2018 - 16:03

టీమిండియాతో జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌ విలవిల్లాడింది. భారత్‌పై అతి తక్కువ స్కోరుకే ఆలౌటైంది.  కేవలం 104 పరుగులకే ఆలౌటైంది. బౌలర్లంతా కలిసికట్టుగా రాణించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 31.5 ఓవర్లలోనే చాప చుట్టేసింది. కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 

భారత బాక్సర్ దీనగాథ.. ఐస్‌క్రీములు అమ్ముకుంటూ…

Submitted by arun on Tue, 10/30/2018 - 13:19

బాక్సింగ్‌లో దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన బాక్సర్ దినేశ్ కుమార్ ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. బతుకు తెరువు కోసం కుల్ఫీ ఐస్‌క్రీములు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు అందుకున్న బాక్సర్‌కు ప్రభుత్వం అర్జున అవార్డు ఇచ్చి సత్కరించింది కూడా. అర్జున అవార్డు గ్ర‌హీత అయిన అత‌ను త‌న తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు ఐస్ క్రీమ్‌లు అమ్ముతున్నాడు. బాక్స‌ర్ దినేశ్ ఇప్ప‌టి వ‌ర‌కు 17 స్వ‌ర్ణాలు, ఒక సిల్వ‌ర్‌, అయిదు కాంస్య ప‌త‌కాలు గెలుచుకున్నాడు. అంత‌ర్జాతీయ టోర్నీల‌కు వెళ్లేందుకు..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సానియా

Submitted by arun on Tue, 10/30/2018 - 10:09

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఇవాళ మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త షోయెబ్ మాలిక్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు.‘ఈ శుభవార్త మీ అందిరితో పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు. నా భార్య కూడా ఆరోగ్యంగా ఉంది. మీ అందరి ప్రేమాభిమానాలకు, ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని వెల్లడిస్తూ ‘బేబీ మీర్జా మాలిక్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు.

కోహ్లీ ఒంటరి పోరాటం వృధా..

Submitted by nanireddy on Sun, 10/28/2018 - 09:51

వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(107: 119 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేయగా.. అతడు మినహాఇతర ఆటగాళ్ల సహకారం లేకపోవడంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. విండీస్‌ బౌలర్లు మార్లోన్‌ శామ్యూల్స్‌ మూడు , హోల్డర్‌, మెక్‌కాయ్‌, అశ్లేనర్స్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌ 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో విండీస్‌ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మేన్స్ రోహిత్‌(8), ధావన్‌ (35), రాయుడు (22), పంత్‌ (24), ధోని(7)లు విఫలమయ్యారు.