Maharashtra

ఆన్‌లైన్‌ అమ్మకాలు... మందుబాబులకు ఇక హద్దేముంది??

Submitted by santosh on Mon, 10/15/2018 - 12:56

ఎన్ని అనర్థాలు జరుగుతున్నా.. ఎన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా.. ప్రభుత్వాలెన్ని మారినా.. మద్యపానాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఖజానాను నింపే మద్యం మాలక్ష్మీని వదిలిపెట్టేందుకు సర్కారు ససేమీరా అంటోంది. అంతేకాదు.. అదే మద్యంపై వచ్చే రాబడిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్ని అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

మద్యం ప్రియులకు సూపర్ న్యూస్

Submitted by arun on Mon, 10/15/2018 - 10:17

ఎన్ని అనర్థాలు జరుగుతున్నా ఎన్ని విలువైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నా ప్రభుత్వాలెన్ని మారినా మద్యపానాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నాయి. ఖజానాను నింపే మద్యం మాలక్ష్మీని వదిలిపెట్టేందుకు సర్కారు ససేమీరా అంటోంది. అంతేకాదు అదే మద్యంపై వచ్చే రాబడిని పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనల్ని అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలకు మహారాష్ట్ర సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. 

మహారాష్ట్ర ధర్మాబాద్‌లో టెన్షన్‌...తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

Submitted by arun on Fri, 09/21/2018 - 10:21

మహారాష్ట్ర ధర్మాబాద్‌లో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. బాబ్లీ వ్యతిరేక పోరాట కేసులో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా 16మందికి ధర్మాబాద్‌ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై ఈరోజు విచారణ జరగనుంది. దాంతో ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు వారెంట్‌పై చంద్రబాబు రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో న్యాయస్థానం ఎలా స్పందింస్తుందోనన్న టెన్షన్‌ నెలకొంది. 

పంట రుణానికి వెళ్లిన రైతు భార్యను కోరిక తీర్చమన్నాడు..!

Submitted by arun on Sat, 06/23/2018 - 17:54

పంట రుణం కోసం తన భర్తతో కలిసి బ్యాంకుకు వెళ్లిన ఓ రైతు భార్యను ఆ బ్యాంక్ మేనేజర్ అడగరాని కోరిక అడిగాడు. తాను చెప్పినట్టు వింటే అడిగినంత రుణం మంజూరు చేస్తానని ఆశ చూపాడు. రైతు భార్య ఫిర్యాదుపై బుల్దానా జిల్లా మల్కాపూర్ తహసిల్‌లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్‌పై పోలీసులు శుక్రవారంనాడు కేసు నమోదు చేశారు. బుల్దానా జిల్లా మల్కాపూర్‌ మండలంలో నివసిస్తున్న రైతు దంపతులు.. లోన్‌ కోసం జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆశ్రయించారు. అయితే బ్యాంక్‌ మేనేజర్‌ రాజేష్‌ హివాసె సదరు మహిళపై కన్నేశాడు.

పిల్లోడి పేరు ఖరారు కోసం ఎన్నికలు

Submitted by arun on Wed, 06/20/2018 - 14:21

పిల్లలకు నామకరణం అనేది మనదేశంలో చాలా సింపుల్‌‌గా జరిగే కుటుంబ వేడుక. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ జంట తమ పిల్లాడికి పేరును వినూత్నంగా పెట్టారు. ఎన్నికల తరహాలో పోలింగ్ నిర్వహించి నామకరణోత్సవం నిర్వహించారు. బంధు, మిత్రులను ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని  గోండియాకి చెందిన మిథున్, మన్షి బంగ్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించాడు. జాతకం ప్రకారం అతడు భవిషత్యులో రాజకీయ నాయకుడు అవుతాడని తెలిసింది. దీంతో ఎన్నికల ద్వారా వినూత్నంగా బాబుకు  పేరు పెడితే బాగుంటుందని తల్లిదండ్రులు నిర్ణయించారు. 

లీటర్ పెట్రోల్‌పై రూ.4 తగ్గింపు.. టూవీలర్లకు మాత్రమే

Submitted by arun on Thu, 06/14/2018 - 17:06

ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్‌ఎస్‌ అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా  ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్‌ల్లో  ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల  9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్‌ ఫుల్‌ చేయించుకుంటున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది దుర్మరణం..

Submitted by arun on Fri, 06/01/2018 - 10:30

మహారాష్ట్రలో ఘోరం రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం యవాట్మల్‌లోని అర్ని వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తవేరా వాహనం-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వేకువ ఝామున ఈ ఘటన జరిగిందని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

పెట్రో షాక్.. బైక్‌ అమ్మి గుర్రం కొన్నాడు..

Submitted by arun on Thu, 05/24/2018 - 17:45

పెట్రోల్‌ ధరలు రికార్డుస్ధాయికి చేరడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతుంటే స్ధానిక పన్నులు అధికంగా వడ్డిస్తున్న మహారాష్ట్రలో పెట్రోల్‌ ధరలు మరింత భారమయ్యాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రజలు పెట్రోల్‌ బంకుల్లో తమ జేబులను ఖాళీ చేసుకుంటున్నారు. ఇక పెట్రో భారాలను భరించలేని ఓ వ్యక్తి ఏకంగా బైక్‌ను అమ్మేసి గుర్రాన్ని కొనుగోలు చేయడం అందరినీ విస్తుగొలుపుతోంది. ముంబయికి 100 కిమీ దూరంలోని ఓ చిన్న గ్రామానికి చెందిన పాలు విక్రయించే పాండురంగ్‌ తన బైక్‌ను రూ 22,000కు అమ్మేసి రూ 25,000కు గుర్రాన్ని కొనుగోలు చేశారు.

అసెంబ్లీలో వివాదాస్ప‌దమైన ఎలుక‌ల పంచాయితీ

Submitted by lakshman on Sat, 03/24/2018 - 11:07

అసెంబ్లీ లో ప్ర‌జాస‌మ‌స్య‌లు చ‌ర్చించాల్సినే నేత‌లు ఎన్ని ఎలుక‌ల్ని చంపారు..? ఆ ప్ర‌దేశంలో ఎన్నిఎలుక‌లు ఉన్నాయి. ఎలుక‌ల్ని చంపే యంత్రాలు ఏమైనా ఉన్నాయా..? ఎలుక‌ల్ని చంపేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలుక‌ల పై డిమాండ్ వివాదం చెల‌రేగుతుంది. 
అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించ‌కుండా ఎన్నిఎలుక‌లు చంపారు..? అనే అంశంపై చ‌ర్చించ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. సీనియ‌ర్ బీజేపీ నేత , మ‌హ‌రాష్ట్ర మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖ‌డ్సే మంత్రాల‌యంలో ఎలుక‌ల్ని చంప‌డానికి ఇచ్చిన కాంట్రాక్ట్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. 

చీమలదండులా కదిలిన ఎర్రదండు

Submitted by arun on Fri, 03/09/2018 - 11:23

చీమల దండు అని వినడమేగానీ ఎవరూ చూసి ఉండరు. మహారాష్ట్రలో రైతులు అచ్చం చీమల దండులా కదిలారు. సమస్యల పరిష్కారం కోసం పదం పదం కలిపారు. పోరు బాట పట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నాసిక్ రైతులు భారీ ఆందోళన చేపట్టారు. నాసిక్ నుంచి ముంబై వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో దాదాపు 30 వేలకు పైగా అన్నదాతలు పాల్గొంటున్నారు.