tg venkatesh

లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదు : టీజీ వెంకటేష్‌

Submitted by arun on Wed, 07/11/2018 - 13:27

మంత్రి నారా లోకేష్ పై టీజీ వెంకటేష్  ఫైరయ్యారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంపై సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. లోకేష్  పార్టీ అధ్యక్షుడు కాదని అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తే అప్పుడు స్పందిస్తానన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లోకేష్ ను హిప్నాటైజ్ చేసినట్టు ఉందని, అభ్యర్థుల ప్రకటన తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని టీజీ వెంకటేష్  అన్నారు. 

‘టీజీని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి’

Submitted by arun on Sat, 06/23/2018 - 16:33

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్ కె. కేశవరావుపై చేసిన వ్యాఖ్యలను టీఆర్‌ఎస్ ఎంమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. వెంకటేశ్‌ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు. టీజీ వెంకటేశ్ కామెంట్ల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలలని సీఎం చంద్రబాబుకి సూచించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కించపరచవద్దని హెచ్చరించారు. ప్రజలను రెచ్చగొట్టడమే టీజీ పరమావధిగా పెట్టుకున్నారని కర్నె మండిపడ్డారు.

ఆ టీఆర్ఎస్ నేత తాగుబోతు సన్నాసి...రాత్రయితే ఫుల్లుగా తాగి కేసీఆర్‌ కాళ్లు ఒత్తుతాడు

Submitted by arun on Sat, 06/23/2018 - 11:17

టీఆర్‌ఎస్‌ ఎంపీ కే. కేశవరావు(కేకే)ను తీవ్ర పదజాలంతో దూషించారు టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.‘‘కేకే పిచ్చోడు. తాగుబోతు సన్నాసి. పిచ్చోళ్లకు అంతా పిచ్చోళ్లలానే కనిపిస్తారు’’ అంటూ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ కేశవరావును టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ దూషించారు. తెలంగాణ ఉద్యమంలో కేకే ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ పోరాటం చేయాలని, లేకపోతే, టీఆర్‌ఎ్‌సకు ఓటు వేయవద్దంటూ సీమాంధ్రులకు పిలుపు ఇస్తామని టీజీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కేకే..

‘టీజీ...చిల్లర మాటలు, పిచ్చి ప్రేలాపనలు మానుకో’

Submitted by arun on Thu, 06/21/2018 - 15:46

ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతివ్వకపోతే తమ సత్తా చూపుతామంటూ టీడీపీ  రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. టీజీ వెంకటేష్ చిల్లర మాటలు, పిచ్చి ప్రేలాపణలు మానుకోకపోతే బుద్ధి చెప్పాల్సి వస్తుందని  ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. కేంద్రంతో పోరాడి హక్కులు సాధించుకోవడంలో విఫలమైన  టీడీపీ నేతలు ..తమపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.  తెలంగాణ అభివృద్ధి చూసి టీజీలో అసూయ, ద్వేషం పెరగడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోరాటానికి సమయం ఆసన్నమైంది...ఇక తెగదెంపులే: ఎంపీ టీజీ

Submitted by arun on Fri, 02/02/2018 - 12:21

టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లు గడిచిపోయాయి, ఇక సహించేది లేదన్న టీజీ కేంద్రంపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబును ఎవరూ తక్కువ అంచనా వేయొద్దన్న టీజీ వెంకటేష్‌ మరోసారి కేంద్రంలో చక్రం తిప్పే సత్తా బాబుకి ఉందన్నారు. సొంతంగా బలముందనే పొగరు బీజేపీకి ఉన్నా  కేంద్రంపై అంచెలంచెలుగా పోరాడతామన్నారు. మూడు విడతలుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న టీజీ చివరి అస్త్రంగా ఇక తెగదెంపులేనన్నారు. పోరాట కార్యాచరణను ఆదివారం చంద్రబాబు ప్రకటిస్తారన్నారు.
 

కుర్చీల కోసం కోట్లాడుకుంటున్న తెలుగు త‌మ్ముళ్లు

Submitted by arun on Sat, 01/13/2018 - 11:22

కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తమ ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు ఎస్వీ, టీజీ భరత్ లకే పరిమితమైన మాటల యుద్ధంలోకి టీజీ ఎంటరయ్యారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదని జన్మభూమి ముగింపు వేదికపై ఎస్వీకి టీజీ కౌంటర్ వేశారు.