press meet

డబ్బులు తీసుకున్నట్లు జగ్గారెడ్డి ఒప్పుకున్నారు: డీసీపీ సుమతి

Submitted by arun on Tue, 09/11/2018 - 11:08

జగ్గారెడ్డి తప్పుడు ధృవపత్రాలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారని నార్త్‌జోన్‌ డీసీపీ సుమతి తెలిపారు. కుటుంబ సభ్యుల పేరుతో వేరే వ్యక్తులను విదేశాలకు పంపారని చెప్పారు. ఫేక్‌ డాక్యుమెంట్స్‌, ఫేక్‌ పాస్‌పోర్టుతో వీసాకు ధరఖాస్తు చేశారని సుమతి తెలిపారు. నాలుగేళ్ల కూతురును 17ఏళ్లుగా, నాలుగేళ్ల కొడుకును 15ఏళ్లుగా చూపించారని.. ఆధార్‌ డేటా చూస్తే నిజానిజాలు బయటపడ్డాయన్నారు. వెళ్లిన ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాదని తెలుస్తోందని చెప్పారు.

మూడు మీటింగులు,ఆరు సర్వేలు

Submitted by arun on Tue, 08/14/2018 - 12:29

ఎన్నికలపై ఇప్పటికే ఆరు సర్వేలు చేసినారట,

వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయడంఖనట,

కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి తప్పదట,

తము చేసిన అభివ్రుద్దే తమ కంటివెలుగట. శ్రీ.కో

ఢిల్లీ వేదికగా కేంద్రంపై చంద్రబాబు దాడి

Submitted by arun on Sat, 07/21/2018 - 14:50

ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీ వచ్చిందని లోక్ సభలో మోడీ చెప్పారని ప్రజా తీర్పును తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది తామేనని చంద్రబాబు అన్నారు. 

విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యం: కిరణ్ కుమార్ రెడ్డి

Submitted by arun on Fri, 07/13/2018 - 14:09

కాంగ్రెస్‌ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండవా కప్పుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్‌ పార్టీతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన విభజన చట్టాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు. ఇందిరా గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టే ముఖ్యమంత్రి అయ్యాయని కిరణ్ కుమార్‌ రెడ్డి తెలిపారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ 8 సార్లు గెలిపించిందన్నారు. 30 నుంచి 40 మంది కాంగ్రెస్‌ నేతలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తారని స్పష్టం చేశారు.

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు

Submitted by arun on Wed, 06/20/2018 - 13:56

తప్పులను ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తారా అని ప్రశ్నించారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు  రమణదీక్షితులు. టీటీడీ తనకు నోటీసులిచ్చిందని, వందకోట్లకు పరువు నష్టం దావా వేసినట్టు ఆయన తెలిపారు. అంటే స్వామివారి పరువు వందకోట్లేనని తేల్చేశారని అన్న రమణదీక్షితులు... ఇది ప్రజాస్వామ్యమా, నిరంకుశత్వమా అని ప్రశ్నించారు. స్వామివారి పరువు విలువ  వందకోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు .తిరుమలలో మలినమైన ప్రసాదాలు పెడుతున్నారని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ తన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీవారికి అన్ని పూజలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.

మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ కన్నీరుమున్నీరు

Submitted by arun on Thu, 03/29/2018 - 16:16

క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను సైతం మానసికంగా కృంగదీసింది. కేప్ టౌన్ టెస్టులో చోటు చేసుకొన్న పరిణామాలకు తన నాయకత్వలోపమే కారణమని సిడ్నీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. ఈ తప్పుకు తానే కారణమని, తన కారణంగా తమజట్టు భారీమూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఈ పొరపాటు తనను జీవితకాలం వెంటాడుతూనే ఉంటుందని స్మిత్ విలపిస్తూ చెప్పాడు. ఓ దశలో స్టీవ్ స్మిత్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు.

భారత న్యాయవ్యవస్థలో కలకలం..మీడియా ముందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల

Submitted by arun on Fri, 01/12/2018 - 14:13

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి నలుగురు సీనియర్ జడ్జిలు తిరుబాటు బావుటా ఎగరేశారు. నేరుగా ప్రధాన న్యాయమూర్తిపైనే విమర్శలు చేశారు. జాస్తి చలమేశ్వర్‌తో పాటు మురో ముగ్గురు న్యాయమూర్తులు అనూహ్యంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై విమర్శలు గుప్పించారు. భారత దేశ చరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఊహించని విధంగా నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం కలకలం రేపుతోంది.