supreme court

భార్య గురించి తప్పుడు సమాచారమిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే!

Submitted by arun on Wed, 03/21/2018 - 15:56

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. పిటిషనర్ వాదనతో ఏకీభవించి పూర్తి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. 

న్యాయమా నీవెక్కడ ?

Submitted by arun on Mon, 03/19/2018 - 10:20

ప్రతీరోజూ ఎక్కడో ఒకచోట బాలికలపై లైంగికదాడుల వార్తల్ని వినాల్సివస్తోంది. ఇవేవీ పాలకుల, ప్రభుత్వాల చెవిన మాత్రం పడటం లేదు. సుప్రీంకోర్టు స్వయంగా కలుగజేసుకొని పెండింగ్‌ కేసులు ఎన్ని ఉన్నాయని హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరల్‌ను అడిగితే లక్షకు పైగా కేసులు ఉన్నాయని తేలింది. 'పోక్సో' చట్ట ప్రకారం బాలికలపై లైంగిక దాడి కేసుల విచారణ ఒక్క సంవత్సరంలో పూర్తి చేయాలి. అలాంటిది ట్రయల్‌ కోర్టుల్లో లక్షకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండటమేందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

జీవించే హక్కుతో పాటు శాశ్వత సెలవుకూ హక్కు

Submitted by arun on Fri, 03/09/2018 - 16:28

ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సమాజంలో గౌరవప్రదంగా బతికిన మనిషి అంతిమ ఘడియల్లో కూడా అదే గౌరవంతో కన్నుమూసే అవకాశాన్ని కల్పించింది. కారుణ్య మరణానికి అనుమతినిస్తూ చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. అయితే దీనిపై పూర్తిస్థాయిలో చట్టం వచ్చేదాకా మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. 

సుప్రీంలో తెలంగాణాకి ఘన విజయం

Submitted by arun on Fri, 02/23/2018 - 17:47

తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తీ చేయడానికి ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. అర్హత లేని పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్‌కి ముక్క చీవాట్లు పెట్టింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. ఏపీకి పోలవరం ఎంతనో తెలంగాణాకి కాళేశ్వరం ప్రాజెక్టు అంత. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తీ అయితే ఉత్తర తెలంగాణ తాగు, సాగు నీటి కష్టాలు కడతేరతాయని జల రంగ నిపుణులంటున్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారని దాఖలైన పిటిషన్‌కి, పిటిషనర్‌కి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Submitted by arun on Fri, 02/23/2018 - 13:08

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించినట్లయింది. సుప్రీంకోర్టు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్‌రావు హర్షంవ్యక్తంచేశారు.
 

ప్రియా వారియర్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట

Submitted by arun on Wed, 02/21/2018 - 12:02

సోషల్ మీడియా సంచలనం,  మలయాళ నటి ప్రియా వారియర్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఒరు ఆదార్ లవ్‌ పాటలో నటించిన ప్రియా వారియర్‌పై దాఖలైన కేసులపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ప్రియా వారియర్‌పైనా, చిత్ర దర్శకుడిపైనా .ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మలయాళ సినిమా ఒరు ఆదార్ లవ్‌ పాటలో నటించిన ప్రియపైనా దర్శకుడిపైనా..తెలంగాణ, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఓ వర్గం మనోభావాలను కించపరచేలా పాట ఉందనే ఫిర్యాదుతో పోలీసులు కేసులు పెట్టి ప్రియకు నోటీసులు జారీ చేశారు.

సుప్రీంను ఆశ్రయించిన ప్రియా వారియర్

Submitted by arun on Tue, 02/20/2018 - 16:15

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఒరు ఆదార్ లవ్ మూవీలోని.. పాటపై వచ్చిన ఫిర్యాదు మేరకు డైరెక్టర్‌ ఒమర్ లులూతో కలిసి సుప్రీంను ఆశ్రయించింది. హైదరాబాద్, మహారాష్ట్రలో నమోదైన కంప్లైంట్లపై.. స్టే ఇవ్వాలని పిటిషన్ వేసింది.

రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌ ప్రభుత్వాలకు సుప్రీంలో చుక్కెదురు

Submitted by arun on Tue, 01/23/2018 - 13:37

వివాదాస్పద సినిమా పద్మావత్ పై నిషేధం విధించే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లో పద్మావత్‌‌ను నిసేధించాంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. పద్మావత్ చిత్రం విషయంలో గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రముఖ దర్శకుడు సంజలీలా భన్సాలీ దర్శక నిర్మాణంలో రూపొందిన పద్మావత్ ఎల్లుండి విడుదల కాబోతోంది. ఈ సినిమాకు వ్యతిరేంగా కర్ణిసేన కొద్ది నెలలోగా ఆందోళనలు వ్యక్తం చేస్తోంది.   

రాజ‌కీయం చేయోద్దు .నా తండ్రిది స‌హ‌జ‌మ‌ర‌ణ‌మే

Submitted by lakshman on Mon, 01/15/2018 - 04:13

త‌న తండ్రిది స‌హ‌జ‌మ‌ర‌ణమేన‌ని బీహెచ్ లోయా కుమారుడు అనుజ్ లోయా తెలిపారు. 
ఇటీవ‌ల జ‌స్టిస్ బీహెచ్ లోయా కేసుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసిన న‌లుగురు సుప్రీం న్యాయ‌వాదులు ప్రెస్ మీట్ పెట్ట‌డంతో పెద్ద‌వివాద‌మే చెల‌రేగింది. అయితే దీనిపై స్పందించిన అనుజ్  లోయా త‌న తండ్రి ది స‌హ‌జ‌మ‌ర‌ణేమ‌న‌ని ..త‌మ‌కు ఎలాంటి అనుమానాలు లేవ‌ని అన్నారు. ఇదిలా ఉంటే 

భారత న్యాయవ్యవస్థలో కలకలం..మీడియా ముందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల

Submitted by arun on Fri, 01/12/2018 - 14:13

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి నలుగురు సీనియర్ జడ్జిలు తిరుబాటు బావుటా ఎగరేశారు. నేరుగా ప్రధాన న్యాయమూర్తిపైనే విమర్శలు చేశారు. జాస్తి చలమేశ్వర్‌తో పాటు మురో ముగ్గురు న్యాయమూర్తులు అనూహ్యంగా ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై విమర్శలు గుప్పించారు. భారత దేశ చరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇలా మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఊహించని విధంగా నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం కలకలం రేపుతోంది.