Eluru

పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు...తనను చంపడానికి ఆ ముగ్గురు కుట్ర

Submitted by arun on Fri, 09/28/2018 - 10:39

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పోరాట యాత్రలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. తనను చంపడానికి ముగ్గురు క్రిమినల్స్ కుట్ర చేస్తున్నారని అన్నారు. వారు మాట్లాడుకున్న వాయిస్ క్లిప్ తనదాకా వచ్చిందని పవన్ చెప్పారు. తనను చంపడానికి కుట్ర చేస్తున్న వారి పేర్లు, ముఖాలు కూడా తనకు తెలుసునని పవన్ వివరించారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాడిలో పెట్టడంలో డిజిపి వైఫల్యం చెందారని...అందుకే ఇలాంటి కిరాయి హంతకులు రెచ్చిపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఫేస్‌బుక్‌ లో మరో కేటుగాడు

Submitted by arun on Tue, 06/12/2018 - 11:28

ఫేస్‌బుక్‌ అడ్డగా.. ఆడవారిని నయవంచన చేసే గుంట నక్కల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న పాన్ షాప్ ఓనర్ ఆగడాలు మరువక ముందే.. తాజాగా ఏలూరులో అలాంటి ఘటనే వెలుగుచూసింది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల నుంచి బంగారు ఆభరాణాలను దోచుకునే ఓ వ్యక్తిని కటకటాల్లోకి పంపారు.. పోలీసులు. 

ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పంపిస్తూనే.. ప్రేమను నటిస్తారు.. ముద్దులొలికే మాటలతో ఛాటింగ్ చేస్తారు.. నేనున్నా అంటూ భరోసా ఇస్తారు.. పర్సనల్ డిటైల్స్ అడుగుతారు.. ఫోటోస్ పంపమంటారు.. 

కోడిపందాలపై ఎంపీ మాగంటి బాబు షాకింగ్‌ కామెంట్స్‌

Submitted by arun on Fri, 01/12/2018 - 12:51

కోడిపందాలపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. జల్లికట్టు తరహాలో కోడిపందాలకు ఆర్డినెన్స్‌ అవసరం లేదన్నారు. ఫ్లెక్సీలు కట్టి పందాలను అడ్డుకోలేరన్నారు. కోడి పందాలు అనాదిగా వస్తున్న సంప్రదాయ కీడ్ర అన్నారు.  కేవలం మూడ్రోజులు మాత్రమే జరిగే పందాలకు ఇన్ని ఆంక్షలు అనవసరం అన్నారు.  ఎవరు ఏమన్నా  కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా పందాలకు కాలు దువ్వాల్సిందేనన్నారు.