online

ఐఫోన్ ఆర్డర్‌ చేస్తే బట్టల సబ్బు డెలివరీ

Submitted by arun on Fri, 02/02/2018 - 10:31

ముంబైలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగుచూసింది. ఐ ఫోన్ కోసం ఆర్డర్ ఇచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అడ్డంగా బుక్కయ్యాడు. ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ 8ని బుక్‌ చేశాడు. కొరియర్‌ రావడంతో ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఐఫోన్‌ను చూద్దామని ఆశతో బాక్స్‌ ఓపెన్‌ చేసి షాకయ్యాడు. అతనికి డెలివరీ అయ్యింది ఐఫోన్‌ 8 కాదు ఓ బట్టల సబ్బు. ముంబైకి చెందిన తబ్రేజ్‌‌ మెహబూబ్‌ ఫ్లిప్‌కార్టులో 55వేల రూపాయలు పెట్టి ఐఫోన్‌ 8ను బుక్‌చేశాడు. అయితే జనవరి 22న అతనికి ఐఫోన్‌ బదులు ఓ సబ్బు డెలివరీ అయింది. దాంతో బైకుల్లా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వన్‌ప్లస్ 5 బుక్ చేస్తే డిటర్జెంట్ ప్యాక్స్ వచ్చాయి!

Submitted by lakshman on Thu, 09/14/2017 - 21:11

ఆన్‌లైన్ షాపింగ్ వినియోగం భారీగా పెరిగింది. కొత్తకొత్త కంపెనీలు ఈ-కామర్స్ రంగంలో రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. వాటిలో వినియోగదారులను మోసగించే ఫ్రాడ్ కంపెనీలు కూడా ఉంటున్నాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ కూడా తాజాగా ఓ వినియోగదారుడికి షాకిచ్చింది. ఫోన్ ఆర్డర్ చేస్తే డిటర్జెంట్ పౌడర్లు పంపించి విమర్శల పాలవుతోంది. అయితే తప్పు ప్యాకింగ్ సెక్షన్‌లో జరిగిందా.. ఆ తర్వాత డెలివరీ బాయ్ ఏమైనా గ్యాంబ్లింగ్ చేశాడా అన్న విషయం తేలాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన చిరాగ్ అమెజాన్‌‌లో ఈ నెల 7న వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేశాడు. నగదును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాడు.