cpi narayana

పోలీసు శాఖ నిర్లక్ష్యంతోనే ప్రణయ్ హత్య జరిగింది : నారాయణ

Submitted by arun on Sat, 09/15/2018 - 15:40

పోలీసు శాఖ నిర్లక్ష్యంతోనే మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగిందని ఆరోపించారు సీపీఐ నేత నారాయణ. అమృత తండ్రితో ప్రమాదం ఉందని ముందే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ప్రణయ్ హత్యకు గురయ్యాడని చెప్పారు. ప్రణయ్, అమృత కుటుంబ సభ్యులను పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లయితే ఈ హత్య జరిగి ఉండకపోయేదన్నారు నారాయణ.

మాతో పొత్తు పెట్టుకుంటే.. జగన్ జైలుకే

Submitted by arun on Sat, 01/20/2018 - 18:34

కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మోదీ మెప్పు కోసమే ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ సీఈసీ సిఫారసు చేసిందని విమర్శించారు. ఎన్నికల సంఘం అనర్హత వేటు వేయాలనుకుంటే ఏపీ, తెలంగాణలో పార్టీలు ఫిరాయించి మంత్రులుగా వున్నవారు చాలా మంది ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సీబీఐని విధానాలను కూడా తప్పుపట్టిన ఆయన.. కేంద్రానికి పెంపుడు కుక్కల సీబీఐ వ్యవహరిస్తోందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలపై స్పందించిన నారాయణ.. విభజన హామీల సాధనకు చంద్రబాబు కోర్టుకెళ్తాననటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఏపీ సెక్రటేరియట్ వద్ద సీపీఐ నారాయణ హల్‌చల్

Submitted by arun on Thu, 01/11/2018 - 14:20

సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ సెక్రటేరియట్ వద్ద ఎస్పీఎఫ్ సిబ్బందిని పరుగులు పెట్టించారు. వేకువజామునే సైక్లింగ్ చేసుకుంటూ వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన నారాయణ సైకిల్‌తో సహా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సచివాలయం చూద్దామంటూ మరో ఇద్దరు నేతలతో కలిసి వచ్చిన నారాయణ నేరుగా లోపలికి ప్రవేశించడాన్ని  గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది పరుగుపరుగున అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. ఈ సమయంలో లోపల ఎవరూ ఉండరంటూ నారాయణను బయటకు పంపించేశారు. ఇక చేసేది లేక అసెంబ్లీ బయట ఉన్న లాన్‌లో కాసేపు కూర్చొని నారాయణ వెనుతిరిగారు.