Nandamuri Balakrishna

ఈ ఆదిత్య 369 సినిమా, కాలం తో ప్రయాణం

Submitted by arun on Sat, 10/27/2018 - 15:20

కాలం... అనే విషయం  మీద ఎన్నో పరిశోదనలు జరుగుతున్నాయి.. అలాగే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అందులో బాగంగానే వచ్చిన ఒక సినిమా ఆదిత్య 369..  ఈ ఆదిత్య 369 సినిమా 1991లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకి  బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం. సైన్స్‌ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాలలో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది.

క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్

Submitted by arun on Mon, 05/28/2018 - 10:54

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కనున్న సినిమాపై సస్పెన్స్ వీడింది. ఎన్టీఆర్ బయోపిక్ ను క్రిష్ డైరెక్షన్ చేయనున్నట్టు బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా ప్రారంభించారు. కానీ తేజ ఈసినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో మూవీపై అనుమానాలు తలెత్తాయి. అయితే చివరకు ఎన్టీఆర్ మూవీని డైరెక్షన్ చేసే అవకాశం క్రిష్ కి దక్కింది. క్రిష్, బాలకృష్ణలది హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు పెరిగిపోనున్నాయి.

బాలయ్య ఇదేం హిందీ....అర్థాల కోసం వెతుకున్న మేధావులు

Submitted by arun on Sat, 04/21/2018 - 13:50

బావకళ్లల్లో ఆనందం చూడటానికి బాలయ్య రెచ్చిపోయాడు. వచ్చీరాని హిందీలో అడ్డంగా మాట్లాడేశాడు. సినీ డైలాగులు సొంత కవిత్వాన్ని వాడేస్తూ తనదైన శైలిలో ప్రసంగించాడు. ప్రధాని మోడీని ఉద్దేశించి మాట్లాడిన బాలయ్య హిందీ మాటలకు అర్థాలేంటి? హిందీ పండితులకు, ఉర్దూకు ఆలవాలమైన హైదరాబాదీ ముస్లింలు కూడా ఈ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.

విషాదంలో బ్రహ్మానందం

Submitted by arun on Mon, 02/19/2018 - 10:19

హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గుండు హనుమంతరావుతో తనది 30 ఏళ్ల అనుబంధమని, ఆహ నా పెళ్లంట సినిమాతోనే తామిద్దరికీ గుర్తింపు వచ్చిందని బ్రహ్మానందం గుర్తు చేసుకొని కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తనను బ్రహ్మానందం బావ అని ఆప్యాయంగా పిలిచేవాడని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలే ఆయన తన ఇంటికి వచ్చాడని, హనుమంతు లేడంటే నమ్మలేకపోతున్నాను. ఆప్యాయతలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి హనుమంతరావు. నాకున్న అతితక్కువ మంది మిత్రుల్లో ఆయన ఒకరు. హనుమంతరావు ధన్యజీవి. హాస్యప్రదర్శనలతో ఎంతోమందిని అలరించాడు.

నటసార్వభౌముడి కోసం హాలీవుడ్

Submitted by lakshman on Sun, 02/04/2018 - 14:32

 ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ టీం రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ టెక్నీషియ‌న్ లు సినిమాకు సంబంధించి డ్రాయింగ్ వ‌ర్క్,  తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించి ఎన్టీఆర్ స్నేహితుల్ని , ద‌గ్గ‌ర బంధువుల్ని , క్లాస్ మెట్స్ తో భేటీ కానున్నారు. అనంత‌రం ఈ భేటీలో ఎన్టీఆర్ గురించి త‌గిన డేటా సేక‌రించి ..ఆ డేటాను సినిమాకోసం వినియోగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇక  బాల‌కృష్ణ  హీరోగా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో యాక్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కు తేజ డైర‌క్ట‌ర్ గా, సాయి కొర్రుపాటి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

‘జై సింహా’కు కత్తి మహేష్ ఇచ్చిన రివ్యూ ..!

Submitted by arun on Fri, 01/12/2018 - 10:54

బాలయ్య అభిమానులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. జై సింహా రూపంలో బాలయ్య అభిమానులకు పండుగ పలకరించింది. జైసింహా సినిమా సూపర్ అంటున్నారు....అభిమానులు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చిందని సంబర పడుతున్నారు. జైసింహా హిట్ అంటున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’.. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. బాలయ్య- నయనతార కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘జై సింహా’కు చిరంతన్ భట్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానులను అలరించింది. ఈ సినిమాలో హరి ప్రియ, నటాషా దోషి కూడా హీరోయిన్లుగా నటించారు. 
 

పరిటాల రవిని అందుకే రంగంలోకి దించాం: బాలయ్య

Submitted by arun on Thu, 01/11/2018 - 13:58

నాడు పెనుగొండ ఏరియాలో అరాచక శక్తులు రాజ్యమేలుతుండగా తెలుగుదేశం పార్టీ పరిటాల రవిని రంగంలోకి దింపి ఆటకట్టించిందని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.