Balka Suman

ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే బలిదానాలు జరిగేవా?: బాల్క సుమన్

Submitted by arun on Sat, 10/27/2018 - 13:45

కాంగ్రెస్ నాయకులు మాట్లాడే భాష, వారి వ్యవహరిస్తున్న తీరును అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్. విద్యార్థుల బలిదానాలకు కేసీఆర్ కారకుడని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రకటనను వెనక్కి తీసుకోవడం వల్లే బలిదానాలు జరిగాయన్నారు. ఆనాడే నిర్ణయం తీసుకుని ఉంటే ఇంతమంది బలిదానాలు జరిగేవా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. 

‘రేవంత్‌ రెడ్డి దేశ ద్రోహి’...: ఎంపీ బాల్క సుమన్‌

Submitted by arun on Fri, 09/28/2018 - 13:59

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటీ దాడులకు, టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిపోయిందని విమర్శించారు. తప్పులు, అక్రమాలు చేసినందుకు సోదాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ను విమర్శించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. రేవంత్‌రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఈ విషయానికి టీఆర్ఎస్‌కు సంబంధం లేదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్‌రెడ్డి ఇళ్లల్లో ఐటీ సోదాలు జరగడంలేదే..

అభిమానమే గట్టయ్యను కుటుంబాన్ని రోడ్డున పడేసింది...అభిమానులారా... ఒక్కసారి ఆలోచించండి.!!

Submitted by arun on Wed, 09/19/2018 - 11:28

నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య చనిపోయాడు. అభిమాన నాయకుడు ఆశించిన టిక్కెట్‌ రాలేదన్న బాధతోనే కన్నుమూశాడు. స్థానికుడికి కాకుండా స్థానికేతరుడికి టిక్కెట్‌ ఎలా ఇస్తారంటూ పెట్రోలు పోసుకున్న గట్టయ్యను మృత్యుదేవత గట్టెక్కనివ్వలేదు. తనతో పాటే తీసుకుపోయింది. మొత్తంగా ఈ ఘటనలో గట్టయ్య సాధించేదేమిటి?

ఇందారంలో ఉద్రిక్తత...బాల్కసుమన్, ఓదేలు వచ్చి, గట్టయ్య కుటుంబాన్ని...

Submitted by arun on Wed, 09/19/2018 - 11:01

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. ఓదేలుకు టికెట్‌ ఇవ్వలేదని ఆత్మహత్య చేసుకున్న టీఆర్‌ఎస్‌ నేత గట్టయ్యకు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, బాల్కసుమన్, ఓదేలు వచ్చి.. గట్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ వచ్చే వరకు అంత్యక్రియలు నిర్వహించేదిలేదని బంధువులు అంటున్నారు. గట్టయ్య ఇద్దరు పిల్లలకు చెరో ఇరవై లక్షలు ఇవ్వడంతో పాటు ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.   

నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి

Submitted by arun on Tue, 09/18/2018 - 15:53

టీఆర్ఎస్‌ కార్యకర్త, నల్లాల ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతిచెందాడు. ఓదెలుకు టిక్కెట్‌ ఇవ్వాలంటూ.. ఈ నెల 12 న ఆయన పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తాజా మాజీ ఎమ్మెల్యే ఓదెలును కాదని.. బాల్క సుమన్‌కు టిక్కెట్‌ ఇవ్వడంపై ఆయన వర్గం ఆందోళన చేపట్టింది. ఈ నెల 12 న బాల్క సుమన్‌ ర్యాలీలో గట్టయ్య పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పటి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇవాళ ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ప్రాణాలు కోల్పోయాడు. 

చంద్రబాబుపై బాల్కసుమన్‌ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 09/15/2018 - 15:23

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను అడ్డంపెట్టుకుని టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. గత 15 రోజులుగా హైదరాబాద్‌లో ఏపీ ఇంటెలిజెన్స్ చీప్ ఏపీ వెంకటేశ్వర్లు తిష్ట వేసి విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారని విమర్శించారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీప్ ఏపీ వెంకటేశ్వర్లుపై గవర్నర్‌కు, డీజీపీకి ఫిర్యాదు చేస్తామని, వారు చర్యలు తీసుకోకపోతే టీఆర్‌ఎస్ ప్రతీకార చర్యలకు దిగుతుందని బాల్క సుమన్ హెచ్చరించారు. ఇన్నాళ్లు చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు చంద్రబాబు చేతులు పట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొలిక్కివచ్చిన చెన్నూరు టీఆర్‌ఎస్‌ టికెట్‌ వివాదం

Submitted by arun on Fri, 09/14/2018 - 10:03

టీఆర్‌ఎస్‌లో వారంరోజులుగా రగులుతున్న చెన్నూరు టికెట్‌ వ్యవహారం కొలిక్కి వచ్చింది. కేసీఆర్ బుజ్జగింపులతో ఓదేలు మెత్తబడ్డారు. తన జీవితాంతం కేసీఆర్‌తోనే కలిసి పనిచేస్తానన్న ఓదేలు చెన్నూరులో బాల్క సుమన్‌ గెలుపు కోసం కృషిచేస్తామంటూ ప్రకటించారు.

సుమన్‌ చరిత్ర బయటపెడతా: ఓదేలు

Submitted by arun on Thu, 09/13/2018 - 11:17

బాల్క సుమన్ పై దాడికి తనకు సంబంధంలేదని టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు స్పష్టంచేశారు. స్థానికేతరుడికి టికెట్ కేటాయించడంతో చెన్నూర్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. సుమన్ జీవిత చరిత్రను కేసీఆర్ ముందు పెడతానని నల్లాల ఓదేలు తెలిపారు. నా వర్గానికి సంబంధించిన వారు బాల్క సుమన్‌పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. స్థానికేతరుడికి టికెట్‌ కేటాయించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. దాడి చేయించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు. తాను ప్రజల మధ్య ఉండి రాజకీయం చేస్తానే తప్ప ఇలాంటి దిగజారుడు పనులకు పాల్పడనని చెప్పారు. బాల్క సుమన్‌ గురించి ఓయూ విద్యార్థులకు తెలుసునని విమర్శించారు.

ఇందారంలో సంచలనంగా నమోదైన ఈ ఘటనపై ఆసక్తికరమైన...

Submitted by arun on Thu, 09/13/2018 - 10:32

ఇందారంలో బాల్క సుమన్‌పై హత్యాయత్నం జరిగిందా? లేదంటే ఓదేలుకు సీటు రాలేదన్న బాధతో ఆయన వర్గీయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా? రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా, ఇందారంలో సంచలనంగా నమోదైన ఈ ఘటనపై ఆసక్తికరమైన సంగతులు బయటపడుతున్నాయి. 

చెన్నూరు టిక్కెట్‌ తనకు రాలేదన్న బాధతో ఉన్న ఓదేలు కొన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తన అసమ్మతిరాగాన్ని అధినేతకు కూడా వినిపించారు. ఇంతలోనే సుమన్‌పై ఎదురైన చేదు అనుభవం ఓదేలు కేంద్రంగా చక్కర్లు కొడుతుంది. కావాలనే తనపై హత్యాయత్నం చేయించారన్న సుమన్‌ వర్గీయుల ఆరోపణ రాజకీయంగా సరికొత్త అస్త్రాన్ని సంధించినట్టయింది. 

నాపై హత్యాయత్నం జరిగింది.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 14:35

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాల్క సుమన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఓదేలు వర్గానికి చెందిన ఆరుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘటనపై బాల్క సుమన్ స్పందించారు. చెన్నూరులో పోటీ చేయమని తమ అధినేత కేసీఆర్ తనను ఆదేశించారని బాల్క సుమన్ చెప్పారు. ఎవరి సీటును తాను కావాలని తీసుకోలేదని అన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఎన్నికల్లో తాను చెన్నూరు నుంచే పోటీ చేస్తానని తెలిపారు.