cheating case

భార్య పిచ్చిదని వదిలించుకుని..మరో పెళ్లికి సిద్దమైన పోలీస్ ఆఫీసర్

Submitted by arun on Sat, 09/22/2018 - 10:37

ఆడపిల్లలు పుట్టారని భార్యా, బిడ్డలను వదిలేసి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. అప్పటికే మొదటి భార్యను పిచ్చిదని, పిల్లలు పుట్టడం లేదని వదిలేసిన ఆ ప్రబుద్ధుడు రెండో పెళ్లి చేసుకుని ఇద్దరి ఆడపిల్లలకు తండ్రయ్యాడు. ఇప్పుడు వాళ్లనూ వదిలేసి మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. అతను పోలీస్‌ శాఖలో ఉద్యోగి. మొదటిసారి అతడికి పెళ్లయ్యింది భార్య పిచ్చిది పిల్లలు పుట్టడం లేదని విడాకులిచ్చాడు మరో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఆమెను కూడా వదిలి దూరంగా వెళ్లిపోయాడు. ప్రస్తుతం మరో పెళ్లికి సిద్ధమయ్యాడు.

వల్లభనేని VS సుంకర

Submitted by arun on Thu, 07/26/2018 - 17:14

ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరుకు చెందిన పఠాన్ మరియంబీలు తమకు ఇవ్వవలసిన 90 వేల రూపాయలను సుంకర పద్మశ్రీ మోసం చేసింది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తప్పుడు ఫిర్యాదు, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించానిని సుంకర పద్మశ్రీ వాదిస్తున్నారు. ఈ కేసు వెనుక  ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. 

ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై ఛీటింగ్ కేసు

Submitted by arun on Thu, 07/26/2018 - 12:25

ఏపీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మపై ఆత్కూరు పోలీస్‌‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కేసులో రాజీ చేస్తానని లక్ష రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై కుట్ర చేస్తున్నారంటున్న సుంకర పద్మ.... ఇది తనపై నాలుగో కేసు అంటూ తెలిపారు.

ఫేస్‌బుక్‌ లో మరో కేటుగాడు

Submitted by arun on Tue, 06/12/2018 - 11:28

ఫేస్‌బుక్‌ అడ్డగా.. ఆడవారిని నయవంచన చేసే గుంట నక్కల సంఖ్య.. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న పాన్ షాప్ ఓనర్ ఆగడాలు మరువక ముందే.. తాజాగా ఏలూరులో అలాంటి ఘటనే వెలుగుచూసింది. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అమ్మాయిల నుంచి బంగారు ఆభరాణాలను దోచుకునే ఓ వ్యక్తిని కటకటాల్లోకి పంపారు.. పోలీసులు. 

ఫ్రెండ్ రిక్వెస్ట్‌ పంపిస్తూనే.. ప్రేమను నటిస్తారు.. ముద్దులొలికే మాటలతో ఛాటింగ్ చేస్తారు.. నేనున్నా అంటూ భరోసా ఇస్తారు.. పర్సనల్ డిటైల్స్ అడుగుతారు.. ఫోటోస్ పంపమంటారు.. 

టీడీపీలో కలకలం... మేయర్‌పై కేసునమోదు

Submitted by arun on Thu, 01/11/2018 - 11:33

నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు షాక్‌ తగిలింది. స్టార్ ఆగ్రో పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మేయర్‌ తో పాటు అత‌ని సోద‌రుడు జ‌లీల్, డైరెక్ట‌ర్ అనిల్ పై మద్రాస్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో చీటింగ్ కేసు న‌మోదు అయింది. క్రైమ్ నెంబర్ 431-2017 అండర్ సెక్షన్ 406, 420, 506, రెడ్‌విత్ 120-బి, ఐపీసీ కేసులు నమోదు చేశారు. స్టార్ ఆగ్రోలో వాటా కోసం ఇచ్చిన రూ.42 కోట్లు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారంటూ ప్రసాద్ జెంపెక్స్ అనే కంపెనీ మద్రాస్ చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో మేయర్, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.