high court

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌

Submitted by arun on Tue, 10/23/2018 - 13:09

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కోసం నిర్దేశించిన జీవో నెంబర్‌ 90ని కోర్టు కొట్టివేసింది. గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్ధానం మూడు నెలల్లో పంచాయతి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. గత వారం హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే తరహాలో ఆదేశాలు జారీ చేసింది.  
 

కోళ్లకిచ్చినట్లు బాలికలకు హార్మోన్‌ ఇంజక్షన్లా ?

Submitted by arun on Tue, 10/23/2018 - 10:22

యాదాద్రికి మాయని మచ్చగా మిగిలిన వ్యభిచార గృహాల వ్యవహారాన్ని హైకోర్టు సిరియస్‌గా తీసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రంలో అభం శుభం తెలియని చిన్నారులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టినతీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బ్రాయిలర్‌ కోళ్లకు ఇచ్చినట్లు ఆడపిల్లలకు హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇచ్చినా ఇంటెలిజెన్స్‌ ఏం చేస్తోందని మండిపడింది.  52 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దందా జరుగుతున్నా మీకు తెలియలేదంటే అసలేం చేస్తున్నారని  ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

గ్రూప్-2 నియామకాలకు లైన్ క్లియర్

Submitted by arun on Fri, 10/12/2018 - 15:16

తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో గ్రూప్ 2 వైటర్న్, డబుల్ బబ్లింగ్ చేసిన వారిని ఇంటర్వూల నుంచి తొలగించాలని పిటిషన్ వేయడంతో పెండింగ్ పడింది. దీంతో గ్రూప్ 2 పరీక్షల్లో సెలక్టయిన 3,147 మంది  అభ్యర్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వైటర్న్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1.2 పద్ధతిలో గ్రూప్ 2లో సెలక్టయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Submitted by arun on Thu, 10/11/2018 - 12:03

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక అధికారులతో పంచాయతిల్లో పాలన సాగిస్తున్న తీరును హైకోర్టు తీవ్ర స్ధాయిలో తప్పుబట్టింది. రాజ్యాంగ విరుద్ధంగా పాలన ఎలా నిర్వహిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పదవి కాలం ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహింకుండా  ప్రత్యేక జీవో ఎందుకివ్వాల్సి వచ్చిందని ప్రశ్నించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ  మూడు నెలల లోపు పంచాయతి ఎన్నికలు నిర్వహించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  ప్రత్యేక అధికారుల పాలనను రద్దు చేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్లపై  కోర్టు నేడు తీర్పు వెలువరించింది.

రోజాపై కామెంట్స్: టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Submitted by arun on Tue, 09/18/2018 - 13:26

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యే రోజా తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు బోడె ప్రసాద్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 

టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 12:35

టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపైదాఖలైన పిటిషన్‌ను  హైకోర్టు కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగేలా సభను నిర్వహిస్తున్నారంటూ న్యాయవాది శ్రీధర్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. అయితే లక్షలాది మంది ఒకే చోటుకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటూ పిటీషనర్ అభ్యంతరం లేవనెత్తారు. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ ..సభ ఏర్పాట్లను అడ్వకేట్ జనరల్ వివరించారు.

కోమటిరెడ్డి–సంపత్‌ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

Submitted by arun on Wed, 08/15/2018 - 10:55

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాల రద్దుపై హైకోర్టు సంచలనాత్మక చర్యలకు దిగింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల గన్‌మెన్లు ఎలా ఉపసంహరిస్తారంటూ తెలంగాణ డీజీపీతో పాటు రెండు జిల్లాల ఎస్పీలకు నోటీసులిచ్చింది.

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్ నోటీసులు

Submitted by arun on Tue, 08/14/2018 - 16:07

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అలాగే, అసెంబ్లీ, లా సెక్రటరీలు సెప్టెంబర్‌ 17న విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఎత్తివేత!

Submitted by arun on Tue, 08/14/2018 - 11:39

పరిపూర్ణానందస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ , రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. నెలరోజుల క్రితం పరిపూర్ణానంద స్వామిపై నగర పోలీసులు బహిష్కరణ విధించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆయనహైకోర్టు కు వెళ్లారు. ఆయనపై హైదరాబాద్ పోలీసులు విధించిన నగర బహిష్కరణపై స్టే విధిస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం హైకోర్టు ప్రకటించింది. తనపై బహిష్కరణ వేటు సరికాదని, తన వ్యక్తిగత స్వేచ్ఛకు అది భంగం కలిగిస్తోందని ఆరోపిస్తూ, పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ధర్మపురి సంజయ్‌కి కోర్టులో చుక్కెదురు..

Submitted by arun on Thu, 08/09/2018 - 11:23

సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు ధర్మపురి సంజయ్‌కి బుధవారం హైకోర్టులో చుక్కెదురైంది. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ సంజయ్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టి వేసింది. కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలన్న వినతిని కూడా తోసిపుచ్చింది. అరెస్ట్ విషయంలో పోలీసులు సీఆర్‌పీసీ 41ఏ సెక్షన్ ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. నిజామాబాద్‌లోని శాంకరీ నర్సింగ్ కాలేజీకి చెందిన 11 విద్యార్థినులపై సంజయ్ లైంగిక వేధింపులుకు పాల్పడినట్లు కేసు నమోదైంది.