Uttam Kumar Reddy

వేడెక్కుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు

Submitted by arun on Thu, 07/05/2018 - 13:05

ముందస్తు ఎన్నికల అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు సవాళ్లు, ప్రతిసవాళ్ళు విసురుకుంటున్నాయి. అయితే ముందస్తుకు  తెలంగాణ కాంగ్రెస్ అధినేతకు ఎందుకంత తొందర..? తన పదవిని కాపాడుకునేందుకే ముందస్తు హడావిడి చేస్తున్నారా..? అందుకే అధికార పార్టీ సవాల్ కు ప్రతిసవాల్ చేస్తూ రాజకీయ వేడి పుట్టించడానికి ప్లాన్ వేస్తున్నారా...? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

ఒకే దెబ్బకు...మూడు పిట్టలు

Submitted by arun on Tue, 07/03/2018 - 12:07

ముందస్తు ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్‌ కొత్త అస్త్రాలను ప్రయోగించబోతోందా ? అధికార పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అస్త్రాలుగా వాడుకునేందుకు రెడీ అవుతోందా ? పాత ఎన్‌కౌంటర్‌ తెరపైకి తెచ్చి గులాబీ బాస్‌ను ఇరుకున పెట్టడానికి వ్యూహాలు సిద్ధం చేస్తోందా ? ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్‌ పార్టీ అస్త్రాలేంటీ ?

‘కేటీఆర్...మీ నాన్న కేసీఆర్ అన్న మాటలు విను’ :ఉత్తమ్

Submitted by arun on Mon, 07/02/2018 - 13:53

తెలంగాణ మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు మరోసారి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా చేసిన కృషిని ఎవరూ కాదనలేరన్నారు. సోనియా వల్లే తెలంగాణ కల సాకారం అయ్యిందని, కాదన్న వారు మూర్ఖులని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సోనియాకు కృతజ్ఞతలు తెలుపుతూ కేసీఆర్‌ అన్న మాటలను ఉత్తమ్ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘సోనియా గురించి అసెంబ్లీలో మీ నాన్న కేసీఆర్‌ అన్న మాటలు విను’ అంటూ ఉత్తమ్ ట్వీట్ చేశారు.

టార్గెట్ ఉత్తమ్...ఉత్తమ్‌కు వ్యతిరేకంగా ఏకమవుతున్న సీనియర్లు

Submitted by arun on Fri, 06/29/2018 - 16:31

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు విభేదాలు వీడటం లేదా ? పీసీసీ చీఫ్‌పై ఫిర్యాదు చేసేందుకు రహస్యంగా సీనియర్ నేతలు భేటీ అయ్యారా ? పీసీసీ చీఫ్‌ను మార్చకపోతే భవిష్యత్‌పై బెంగ మొదలైందా ? రహస్యంగా నిర్వహించిన సమావేశానికి హాజరైన నేతలెవరు ? 

ముందస్తుకు ఉత్తమ్ రంకెలు వేయడం వెనుక సొంత అజెండా ఉందా..?

Submitted by arun on Wed, 06/27/2018 - 11:09

కేసీఆర్ ముందస్తు ఎన్నికల సవాల్‌కు ఉత్తమ్ సై అనడం హాట్ టాపిక్‌గా మారింది. సవాళ్ళు ప్రతి సవాళ్ళు సరే...ముంద‌స్తు ఎన్నిక‌లకు హ‌స్తం పార్టీ నిజంగానే సిద్ధంగా ఉందా అనే అనుమాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నారు. అసలు ఉత్తమ్ ఎందుకు ముందస్తుకు మొగ్గు చూపారనే చర్చ జోరుగా సాగుతోంది..? 

కేసీఆర్ ముందస్తు రాగం సవాలా..? వ్యూహ‌మా..సీఎం స‌వాల్‌కు ఉత్త‌మ్ సై అనటంలో ఆంత‌ర్య‌మేంటి..?

కేసీఆర్‌ సవాల్‌ను స్వీకరించిన ఉత్తమ్‌

Submitted by arun on Mon, 06/25/2018 - 12:12

ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలు డిసెంబర్‌ లేదా మే నెలలో ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనన్నారు.‌ ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్త అని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నారు.

ఉత్తమ్ ఒంటరి ?

Submitted by arun on Thu, 06/21/2018 - 10:55

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఒంటరవుతున్నారా.. సీనియర్లంతా ఏకమై.. అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో.. ఉత్తమ్ వెంట ఎవరూ కనిపించడం లేదా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు మాజీ మంత్రులంతా యాంటీ ఉత్తమ్ గ్రూపులో చేరినట్లేనా.. తాజా పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి.?

హస్తినకు చేరిన టీ.కాంగ్రెస్ పంచాయతీ...ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఫిర్యాదు చేయనున్న సీనియర్ల

Submitted by arun on Wed, 06/20/2018 - 07:58

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ హస్తినకు చేరింది. గతకొంత కాలంగా పీసీసీ చీఫ్ వర్సెస్.. ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు పార్టీలో వర్గపోరు తీవ్రం కావడంతో పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉత్తమ్ వ్యతిరేక వర్గం నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. 

ఉత్తమ్‌ బస్సు యాత్రకు బ్రేక్‌?

Submitted by arun on Wed, 06/20/2018 - 07:16

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేవరకూ గడ్డం గీసుకోనంటూ ప్రతినబూని.... పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్ర చేపట్టిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కు... సీనియర్లు చెక్‌ పెట్టారనే టాక్‌ వినిపిస్తోంది. మూడు విడతల్లో 38 నియోజకవర్గాలను చుట్టేసిన ఉత్తమ్‌ను... నాలుగో విడత యాత్ర చేపట్టొద్దని అధిష్టానం ఆదేశించినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఉత్తమ్‌ ఢిల్లీ టూర్ తర్వాత పరిస్థితి మొత్తం తారుమారైందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు...ఉత్తమ్‌కి వ్యతిరేకంగా ఢిల్లీ వెళ్తోన్న వ్యతిరేక వర్గం

Submitted by arun on Tue, 06/19/2018 - 12:00

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గాంధీభవన్‌ వేదికగా ఒక వర్గం... సీఎల్పీ వేదికగా మరో వర్గం వ్యవహరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. 2019లో కచ్చితంగా అధికారంలోకి వస్తామని చెబుతోన్న తెలంగాణ కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ముఖ్య నేతల మధ్య ఒక్కొక్కటిగా అభిప్రాయ భేదాలు బహిర్గతమవుతుంటే జిల్లాల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లూ అంతర్గతంగా సాగిన ఆధిపత్య పోరు, కుమ్ములాటలు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతుండటంతో కేడర్‌ అయోమయంలో పడుతోంది.