Uttam Kumar Reddy

కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...అయనకు టికెట్ ఇవ్వకపోతే నేనూ పోటీ చేయను...

Submitted by arun on Fri, 11/09/2018 - 11:33

కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా నల్గొండ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటే ఎంతటి వారినైనా ఓడిస్తారని హెచ్చరించారు. ఇవాళ నార్కట్‌పల్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు.

ముగిసిన కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ...95 స్థానాల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్

Submitted by arun on Thu, 11/01/2018 - 14:45

ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ ముగిసింది. ఈ నెల 8న మరోసారి భేటీకావాలని కాంగ్రెస్ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 8 లేదా 9 తేదీల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇవాళ కేవలం 57 స్థానాలపై చర్చ జరిగిందని.. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుందని ఉత్తమ్ తెలిపారు. టిడీపీతో 14 సీట్లకు అంగీకారం కుదిరిందని.. తెజస, సీపీఐతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్‌ చెప్పారు. మొత్తం 95 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో ఉంటుందని, మిగతా 24 స్థానాల్లో మిత్రపక్షాలు పోటీ చేస్తాయన్నారు.

కేటీఆర్‌ ఉత్తమ్‌ల మధ్య ట్వీట్ వార్

Submitted by arun on Thu, 10/25/2018 - 12:18

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ మధ్య ట్విట్టర్‌ వార్‌ మొదలైంది. శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విట్టర్‌లో ఆరోపించారు. మరో బంధువు రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగాలన్న నిబంధనలను అధికారులు ఉల్లంఘిస్తున్నారని.. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలని ఉత్తమ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మా మేనిఫెస్టోనే.. మక్కీకి మక్కి

Submitted by arun on Wed, 10/17/2018 - 09:13

కాంగ్రెస్‌ పథకాలను కేసీఆర్‌ కాపీ కొట్టారంటూ టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఆరోపించారు. కేసీఆర్ ప్రకటించిన మినీ మేనిఫెస్టోను చూస్తే అవన్నీ నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ చెబుతున్న పథకాలేనన్నారు. కాంగ్రెస్‌ హామీలు అమలు సాధ్యంకాదని చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్ హామీలనే మక్కీకి మక్కీ కాపీ కొట్టి టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
 

‘ఈయన చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం’

Submitted by arun on Fri, 09/21/2018 - 17:34

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్ మధ్య కాదని, కేసీఆర్‌ కుటుంబం, తెలంగాణ ప్రజలకు మధ్య అని చెప్పారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 నియోజకవర్గాలకు గాను ఒక్క స్థానంలో గెలిచామని, ఈ సారి పదికి పది గెలిపించేందుకు నేతలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. 

బ్రేకింగ్: డీఎస్‌తో ఉత్తమ్ కీలక సమావేశం

Submitted by arun on Thu, 09/13/2018 - 17:45

రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ సొంత గూటికి చేరుకునేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలతో టచ్‌లో ఉన్న డీఎస్‌తో  పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటి అయ్యారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించిన ఆయన కలిసి కట్టుగా నడిచి పార్టీని అధికారంలోకి తెద్దామంటూ సూచించారు.  ఇందుకు సానుకూలంగా స్పందించిన డీఎస్ త్వరలోనే పార్టీలో చేరేందుకు హామి ఇచ్చినట్టు సమాచారం. తనతో పాటు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఇతర టీఆర్ఎస్ ‌అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి తీసుకెళ్లేందుకు డీఎస్‌ వ్యూహాలు రచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పార్టీ వీడడంపై క్లారిటీ ఇచ్చిన దానం

Submitted by arun on Mon, 09/10/2018 - 14:43

తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తల్నిదానం నాగేందర్ ఖండించారు. తను ఏ హోటల్‌లో ఉత్తమ్‌ను కలువలేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు టిక్కెట్లు దొరక్క తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాట్సప్ మెసేజ్‌లు చూసి ఎమోషనల్ అయ్యే నేతను కానని అన్నారు. కెసిఆర్ తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరిస్తానని దానం తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండానే టీఆర్‌ఎస్ పార్టీలో చేరా. 105 మంది జాబితాలో నా పేరు లేకపోవడం పట్ల నాకుఎలాంటి బాధలేదు. ఇష్టం ఉన్నవారికే సీటు ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధిష్టానానికి చెప్పా. కాంగ్రెస్ పార్టీలో వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఆటలో కాయిన్‌లా తయారైంది.

నేను మీ పప్పులా కాదు: కేటీఆర్‌

Submitted by arun on Sat, 09/08/2018 - 14:40

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో కేటీఆర్ అంట్లు తోముకునేవాడన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తనదైన శైలిలో స్పందించారు.‘ప్రియమైన ఉత్తమ్ కుమార్ గారూ.. నేను అమెరికాలోని నా ఇంట్లో అంట్లు తోమి ఉండవచ్చు(అమెరికాలోని చాలామంది భారతీయులు తమ ఇళ్లలో ఇదే చేస్తారు). నేను అమెరికాలో ఉద్యోగం చేస్తూ గౌరవప్రదంగా సంపాదించుకుంటూ బతికాను. దీని పట్ల నేను గర్వపడుతున్నా. అంతేకానీ మీ నాయకుడు పప్పూలాగా ప్రజా ధనాన్ని లూటీ చేయడమో, మీలాగా దోచుకున్న ప్రజల డబ్బును కారుతో సహా తగలబెట్టడమో చేయలేదు’ అని ట్విట్టర్ లో కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఉత్తమ్‌కు గట్టిపోటీనిచ్చేందుకు గులాబీ బాస్‌ వ్యూహాలు

Submitted by arun on Fri, 09/07/2018 - 11:24

కేసీఆర్‌ తమ అభ్యర్థులను ప్రకటించని మరో రెండు కీలక నియోజకవర్గాలు హుజూర్‌ నగర్, కోదాడ. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలివి. ఉత్తమ్‌కు చెక్‌పెట్టాలని రకరకాల వ్యూహాలు వేస్తున్న గులాబీ బాస్, వీటికి అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఈ స్థానాలకు క్యాండెట్స్‌ను ప్రకటించకపోవడానికి కారణమేంటి....ఈ రెండు నియోజకవర్గాలపై కేసీఆర్‌ గురి ఏంటి? 

ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కాంగ్రెస్‌ శ్రేణులకు ఉత్తమ్‌ పిలుపు

Submitted by arun on Thu, 07/12/2018 - 17:16

ఎన్నికలకు సిద్ధం కావాలంటూ తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులకు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమున్నందున పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్న ఉత్తమ్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీపీసీసీ చీఫ్‌ 100రోజుల్లో రైతులకు రూ.2లక్షల చొప్పున రుణమాఫీ చేసి తీరుతామన్నారు.