Special Status

బ్రేకింగ్ న్యూస్ : ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ

Submitted by arun on Wed, 03/07/2018 - 18:18

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితో గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణవారు విభజన కోరుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలు ఉంటాయన్నారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 03/07/2018 - 13:56

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సయోధ్య ఉంటే తప్పు లేనపుడు ఇద్దరు ముఖ్యమంత్రులు సయోధ్యతో ఉంటే తప్పేంటని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. అందర్నీ కలుపుకొని హోదా ఉద్యమాన్ని భూజాన వేసుకుందామని అనుకుంటే మిగిలిన వారు ఆఖరు వరకు నిలబడతారన్న నమ్మకం లేదన్నారు. చేసిన తప్పును సరి చేసుకోవడానికే రాహుల్ గాంధీ హోదాపై తొలి సంతకమంటూ ప్రకటించారని తెలిపారు. హోదాను అన్ని పార్టీలు స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయన్న పవన్‌ ఈ నెల 14 పార్టీ ఆవిర్భావ సభలో జనసేన భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు.
 

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదు : చంద్రబాబు

Submitted by arun on Sat, 02/17/2018 - 15:56

విభజన హామీల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తే...ఇప్పడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏపీకి పూర్తిగా సహకరించడం లేదని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో జేఎన్టీయూ భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న చంద్రబాబు..విభజన హామీలను అమలు చెయ్యాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమని చంద్రబాబు అన్నారు.

కాంగ్రెస్‌ ఆంధ్రుల గొంతు కోసింది..

Submitted by arun on Sat, 02/10/2018 - 13:59

ఆంధ్ర ప్రజల గొంతు కోసింది కాంగ్రెస్ పార్టీయేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కాంగ్రెస్ సరైన న్యాయం చేయలేదని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు, సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారికే వెన్నుపోటు పొడిచిందన్నారు. బీజేపీపై కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం నిజంగా కృషి చేస్తోందని మోడీ ప్రభుత్వమేనని చెప్పుకొచ్చారు. 

ఏపీ ప్రజల డిమాండ్లకు మా మద్దతు ఉంటుంది : రాహుల్

Submitted by arun on Fri, 02/09/2018 - 14:00

ఏపీకి న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఏకమై పోరాటం చేయాలన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఆంధప్రదేశ్‌ ప్రజల డిమాండ్లకు కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా మద్దతిస్తోందన్నారు. ఏపీ ఎంపీల ఆందోళనపై రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 
 

ఏపీ ఎంపీల ఆందోళనతో దిగొచ్చిన కేంద్రం

Submitted by arun on Tue, 02/06/2018 - 17:08

తాజా కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై రాష్ట్ర ఎంపీల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, విభజన చట్ట ప్రకారం ఏపీకి చాలా సంస్థలు ఇచ్చామని ఆర్థికమంత్రి జైట్లీ తెలిపారు. ఏపీ ఆర్థికశాఖ కార్యదర్శిని త్వరలోనే ఢిల్లీకి పిలిపిస్తున్నామని, ఆ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీ విధివిధానాలు రూపిందిస్తామని జైట్లీ తెలిపారు. విదేశీ సంస్థల నుంచి ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే కేంద్రం 90 శాతం చెల్లిస్తుందని ఆర్థికమంత్రి పేర్కన్నారు. 
 

రోజా చెవిలో పూలు..

Submitted by arun on Wed, 01/10/2018 - 16:00

యువతకు రెండు చెవుల్లో పూలు పెట్టి సీఎం చంద్రబాబు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని దగా చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీలో రోజా పాల్గొన్నారు. ఆందోళనకారులు, రోజా చెవుల్లో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహనికి కు పూలమాల వేసి కరపత్రం అందజేశారు. టీడీపీ పాలనకు బుద్ధి చెప్పేందుకు యువత కదలిరావాలని రోజా పిలుపునిచ్చారు.