AP Govt

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి లైన్ క్లియర్

Submitted by arun on Fri, 06/08/2018 - 18:51

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి.. త్రిసభ్య కమిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. త్రిసభ్య కమిటీలో జిల్లా కలెక్టర్‌, రిజిస్ట్రార్‌, లీగల్‌ సర్వీస్‌ సెక్రటరీ ఉండాలని సూచించింది. త్రిసభ్య కమిటీతో కలిసి.. సీఐడీ ఆస్తులు వేలం వేయాలని కోర్టు ఆదేశించింది. ఇదే తరహాలో..అన్ని జిల్లాల్లో ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగించాలని తెలిపింది న్యాయస్థానం. మొదట గుర్తించిన 10 ఆస్తుల్లో 5 ఆస్తుల వేలానికి పబ్లిసిటీ ఇచ్చి.. 6 వారాల్లో వేలం పూర్తి చేయాలని చెప్పింది కోర్టు. తదుపరి విచారణ జూన్‌ 25కు వాయిదా వేసింది హైకోర్టు.
 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై కాగ్‌ అక్షింతలు

Submitted by arun on Sat, 04/07/2018 - 12:56

పోలవరమే తన ప్రాణం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే తన ధ్యేయమంటూ, సీఎం చంద్రబాబు, నిత్యం చెబుతూనే ఉంటారు. ప్రాధాన్యతాక్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కానీ అవన్నీ ప్రచార ఆర్బాటాలేనని, కాగ్‌ నివేదికతో తేటతెల్లమైంది. 2017, మార్చి నాటికి పూర్తికావాల్సిన ఒక్క ప్రాజెక్టూ కంప్లీట్ కాలేదని కుండబద్దలు కొట్టింది. అన్నీ కాకిలెక్కలు, తప్పుడు గణాంకాలను ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని నిక్కచ్చిగా నివేదిక ఇచ్చింది కాగ్. రాబడులు, వాస్తవ గణాంకాల మధ్య, తేడా చాలా ఉందన్న  కాగ్, అప్పులు పెరిగిపోతున్నాయని, వ్యాఖ్యానించింది.

ఢిల్లీ వేదికగా చంద్రబాబు హోదా పోరు

Submitted by arun on Mon, 04/02/2018 - 11:10

ఢిల్లీ వేదికగా చంద్రబాబే స్వయంగా హోదా పోరు మొదలుపెట్టనున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేడమే లక్ష్యంగా హస్తిన బాటపడుతున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు, ఎల్లుండి ఆయా పార్టీల నేతలను కలవనున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. 

రోజా చెవిలో పూలు..

Submitted by arun on Wed, 01/10/2018 - 16:00

యువతకు రెండు చెవుల్లో పూలు పెట్టి సీఎం చంద్రబాబు మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని దగా చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగుల నిరసన ర్యాలీలో రోజా పాల్గొన్నారు. ఆందోళనకారులు, రోజా చెవుల్లో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్‌ విగ్రహనికి కు పూలమాల వేసి కరపత్రం అందజేశారు. టీడీపీ పాలనకు బుద్ధి చెప్పేందుకు యువత కదలిరావాలని రోజా పిలుపునిచ్చారు.