high court

అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు

Submitted by chandram on Fri, 11/16/2018 - 17:02

అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. హాయ్‌ల్యాండ్ ఆస్తి తమది కాదని అగ్రిగోల్డ్ ఎండీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణలో ఈ విషయాన్ని ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని అగ్రిగోల్డ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఐడీపై దర్యాప్తు అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు సిట్ ఏర్పాటు చేసే, విచారణను తాము పర్యవేక్షిస్తామని తెలిపింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తనేదని అలూరి వెంకటేశ్వర్లు హైకోర్టు తెలపడంతో కొత్త మలుపు తిరిగింది. కేసుపై సీఐడీ దర్యాప్తు సరిగ్గా లేదని మందలిస్తూ తదుపరి విచారణ ఈనెల 23కు వాయిదా వేసింది. 
 

ధర్నాచౌక్‌ పునరుద్దరణపై పరిరక్షణ సమితి హర్షం

Submitted by chandram on Wed, 11/14/2018 - 20:02

ధర్నాచౌక్‌ను పునరుద్దరించడంతో ధర్నాచౌక్ పరిరక్షణ సమితి స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేసింది. ఇది ప్రజా విజయం అని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ధర్నాచౌక్‌పై హైకోర్టు తీర్పు హర్షనీయం అని సమితి సభ్యులు చెబుతున్నారు. ధర్నచౌక్ పై అరుణోదయ కళాకారిణి, ప్రజా ఉద్యమాల పోరాట వనిత విమలక్క మాట్లాడుతూ హైకోర్టు తీర్పును స్వాగతీస్తున్నామని ఇంత కాలానీకి న్యాయ్యం బ్రతికేఉందని ఈ తీర్పే నిదర్శనమని, నియంత్రుత్వ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. కొంతమంది చిరువ్యాపరస్తులకు నష్టం కలుగుతుందని అంటున్నారు అయితే చిరు వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం కలుగుదని అన్నారు. ఇది ప్రజల విజయం,పోరాటాల విజయం.

హైకోర్టులో తెలంగాణ పోలీసులకు చుక్కెదురు

Submitted by arun on Tue, 11/13/2018 - 17:50

తెలంగాణ పోలీసులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ తరలించాలన్న పోలీసు శాఖ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నాచౌక్ లో యధావిధిగా నిసనలు తెలుపడానికి అనుమతిచ్చింది కోర్టు. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో యదావిధిగా నిరసనలు తెలుపుకోవచ్చంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం ధర్నాచౌక్ ను ఎత్తివేసింది. ధర్నాలతో తమకు ఇబ్బంది ఎదురవుతుందంటూ స్థానికులు ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

జగన్‌‌పై జరిగిన దాడి కేసులో కీలక మలుపు

Submitted by arun on Tue, 11/13/2018 - 16:16

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో తనపై జరిగిన దాడిపై దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తోపాటు మొత్తం 8మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు విచారణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. 

వైఎస్‌ జగన్‌పై హత్యయత్నం కేసులో కీలక అంశాలను ప్రస్తావించిన హైకోర్టు

Submitted by arun on Tue, 11/13/2018 - 13:51

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు కీలక అంశాలను ప్రస్తావించింది.  కేసు విచారణ ధర్డ్ పార్టీకి అప్పగించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. కేసు విచారణ ప్రారంభం కాగానే సిట్ అధికారులు కేసు విచారణ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా దాడి జరిగిన రోజు విమనాశ్రయంలోని సీసీ పుటేజీ ఎక్కడుందంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే గత మూడునెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ  ఎయిర్ ఫోర్ట్‌ సీసీ టీవీ కోర్ టీం కోర్టుకు తెలిపింది.

వైఎస్ జగన్‌ రిట్‌ పిటీషన్‌లో కీలక మలుపు

Submitted by arun on Fri, 11/09/2018 - 13:07

తనపై జరిగిన దాడి కేసు విచారణను స్వతంత్ర సంస్ధకు అప్పగించాలంటూ వైఎస్ జగన్ దాఖలు చేసిన రిట్‌ పిటీషన్‌ విచారణ కీలక మలుపు తిరిగింది. కేసు విచారణ జరుపుతున్న అధికారులకు సీఆర్‌పీసీ 161 ప్రకారం స్టేట్‌మెంట్ ఇవ్వాలంటూ జగన్‌ను  హైకోర్టు ఆదేశించింది. మంగళవారం లోపు స్టేట్ ఇవ్వాలని ఆదేశించిన కోర్టు కేసు పూర్తి నివేదికను తమకు అందజేయాలంటూ సిట్‌ను ఆదేశించింది. 
 

వైఎస్ జగన్‌పై దాడి కేసులో దాఖలైన వ్యాజ్యలపై నేడు హైకోర్టులో విచారణ ..

Submitted by arun on Tue, 11/06/2018 - 09:14

గత నెల 26న విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడి విచారణను థర్డ్‌ పార్టీకి అప్పగించాంటూ  దా‌ఖలైన పిటిషన్లపై  హైకోర్టు నేడు విచారించనుంది. కేసును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు జరిపించేలా ఆదేశించాలని  వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గత నెల 30న హైకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో కేసు విచారణ పారదర్శకంగా జరగడం లేదంటూ వైసీపీకి చెందిన అమర్‌నాథ్‌రెడ్డి, అనీల్ కుమార్‌ యాదవ్‌లు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. వీటితో పాటు తనపై జరిగిన దాడిపై థర్డ్ ‌పార్టీతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ జగన్‌ కూడా కోర్టును ఆశ్రయించారు.

నాపై ఎన్ని క్రిమినల్ కేసులున్నాయి?...హైకోర్టులో రేవంత్‌‌రెడ్డి పిటిషన్

Submitted by arun on Fri, 11/02/2018 - 14:44

తనపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నయో తెలపాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసుల వివరాలు పొందుపరిచే నిమిత్తం ఆర్టీఐని సమాచారం కోరగా వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనను టార్గెట్ చేస్తూ పోలీసులు అక్రమంగా క్రిమినల్ కేసులు పెడుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా తెలంగాణ డీజీపీ, ఆర్టీఐ కమిషనర్ ను చేర్చారు. కాగా రేవంత్‌ రెడ్డి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల(నవంబరు) 6కు వాయిదా వేసింది.
 

హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో జగన్ రిట్ పిటిషన్

Submitted by arun on Wed, 10/31/2018 - 16:07

వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తనపై జరిగిన హత్యాయత్నంపై హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. 
 

యాదాద్రిలోవ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ

Submitted by arun on Tue, 10/23/2018 - 16:48

యాదాద్రిలోవ్యభిచారం కేసుపై హైకోర్టులో విచారణ  జరిగింది. బాలికలకు హార్మోన్‌ ఇంజక్షన్లు ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం  వ్యక్తం చేసింది. ఇంజక్షన్ వాడడం వల్ల కలిగే అనర్థాలపై ధర్మానం వివరణ కోరింది. ఆపరేషన్ ముస్కాన్‌లో ఎలాంటి చర్యలు చేపట్టారో వివరాలు తెలపాలని పోలీసులను ఆదేశించింది. యాదాద్రిలో రెస్క్యూ అయిన చిన్నారులకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన కోర్టు ఎంత మందికి బెయిల్ లభించిందో వివరాలు తెలపాలని కోరింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.