assembly

చంద్రబాబు మండిపాటుపై అధికార పార్టీ ఎమ్మెల్యేల‌లో టెన్ష‌న్

Submitted by arun on Sat, 09/08/2018 - 10:19

అసెంబ్లీ స‌మావేశాల‌పై స్పెష‌ల్ పోక‌స్ పెట్టారు ఏపి సీఎం చంద్ర‌బాబు. ప్ర‌తిప‌క్షం రాక‌పోయినా సొంత పార్టీ ఎమ్మెల్యే లు అసెంబ్లీకి వ‌స్తున్నారా లేదా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే, రోజూ అసెంబ్లీకి హాజరుకావాలనే చంద్రబాబు ఆదేశాలను ఎమ్మెల్యేలు సీరియస్ గా పట్టించుకోవడంలేదు. టీడీపీ  ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. 

అసెంబ్లీ రద్దు తర్వాత ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్న కేసీఆర్

Submitted by arun on Thu, 09/06/2018 - 09:11

తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఈ మధ్యాహ్నం మంత్రివర్గం సమావేశమై ఏకవాక్య తీర్మానం ద్వారా శాసనసభ రద్దుకు సిఫార్సు చేయబోతోందని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశ అజెండాలో శాసనసభ రద్దుకు సంబంధించిన అంశం మాత్రమే ఉందని సమాచారం. అయితే మంత్రివర్గం ఎన్ని గంటలకు సమావేశమవుతుందన్న దానిపై స్పష్టత రాలేదు. ఉదయం, మధ్యాహ్నం ఇలా పలు సమయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇవాళ ఉదయం ఆరుగంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం కార్యాలయం చెప్పినట్లు స్పష్టమవుతోంది. దీంతో జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు హూటాహుటిన హైదరాబాద్‌కు చేరుకున్నారు. 

తెలంగాణలో నేడే బిగ్ డే...తీవ్ర ఉత్కంఠ రేపుతున్న...

Submitted by arun on Thu, 09/06/2018 - 08:49

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్దామని యోచిస్తున్న సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీని రద్దు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మధ్యాహ్నం జరిగే కేబినెట్ భేటీ సంచలన నిర్ణయానికి వేదిక కాబోతోంది.

సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమే

Submitted by arun on Thu, 03/29/2018 - 12:58

సర్పంచ్‌ ఎన్నికలపై ఊహాగానాలకు తెరపడింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రస్తుతమున్నట్టుగానే ప్రత్యక్ష పద్ధతిలోనే, పార్టీల ప్రమేయం లేకుండా జరగనున్నాయి. అనేక కసరత్తుల తర్వాత పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు చేస్తూ రూపొందించిన నూతన పంచాయతీరాజ్‌ చట్టం 2018 బిల్లును ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 

విభజన హామీలపై సీఎం పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్

Submitted by arun on Wed, 03/28/2018 - 16:23

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం ఒక జాతీయ పార్టీ రోడ్డున పడేసిందని, మరో జాతీయ పార్టీ మోసం చేసిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు, హోదా హామీని నెరవేర్చాలని సీఎం డిమాండ్‌ చేశారు. కొన్ని పార్టీలు అవిశ్వాసంపై గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

కేంద్రంపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 03/27/2018 - 16:58

కేంద్రంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఈ దేశాన్ని సాకే 7 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రం తన పని తాను చేయకుండా రాష్ట్రాలను బికారులుగా మారుస్తోందని మండిపడ్డారు. దేశం ముందుకెళ్లాలంటే గుణాత్మక మార్పులు అవసరమన్నారు. 

సకాలంలో చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ: సీఎం కేసీఆర్

Submitted by arun on Tue, 03/27/2018 - 12:58

దేశంలోనే సకాలంలో చెల్లింపులు చేసే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో కేసీఆర్‌ మాట్లాడారు. అంతకు ముందు ఇదే అంశంపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా.. చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై కలుగ చేసుకున్న సీఎం కేసీఆర్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్న సిస్టం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కారణంగానేకొన్ని రాష్ట్రాల్లో చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు. తెలంగాణలో చెల్లింపులు ఆగలేద ఆగవన్నారు. ప్రభుత్వంపై అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు సీఎం కేసీఆర్.

కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వం రద్దు మంచిదే: అక్బరుద్దీన్

Submitted by arun on Tue, 03/13/2018 - 11:19

అసెంబ్లీ నుంచి కోమటిరెడ్డి, సంపత్‌పై బహిష్కరణ వేటును, మిగిలిన కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ను ఎంఐఎం సమర్థించింది. వేటు వేయడం న్యాయబద్ధమైనదన్నారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అసహన రాజకీయాలతో ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కాంగ్రెస్‌ పార్టీ ఇకనైనా మానుకోవాలని సూచించారాయన. గవర్నర్ మీద దాడి చేయాలనుకున్నాం కానీ మండలి చైర్మన్‌కు తగిలిందంటూ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. 

అరాచక శక్తులను సహించం : సీఎం కేసీఆర్

Submitted by arun on Tue, 03/13/2018 - 11:05

తెలంగాణలో అరాచక శక్తులను సహించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి దురదృష్టకరమనీ, బాధాకరమని శాసనసభలో అన్నారు. నిన్నటి ఘటన కాంగ్రెస్ సభ్యుల అరాచకాలకు పరాకాష్ట అన్న ముఖ్యమంత్రి రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయాల్లో ఇంత అసహనం పనికిరాదన్నారు కేసీఆర్. కాంగ్రెస్‌ సభ్యుల సస్పెన్షన్‌ కఠిన నిర్ణయమే అయినా తప్పదని వ్యాఖ్యానించారు.
 

కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దు

Submitted by arun on Tue, 03/13/2018 - 10:17

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో దురదుష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, దీనిపై తీవ్ర మనస్థాపం చెందినట్లు తెలిపారు. అనంతరం శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. నిన్న సభలో అనుచితంగా ప్రవర్తించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ ల అసెంబ్లీ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. మిగతా కాంగ్రెస్ సభ్యులపై వేటు పడింది.