trs leaders

‘టీజీ...చిల్లర మాటలు, పిచ్చి ప్రేలాపనలు మానుకో’

Submitted by arun on Thu, 06/21/2018 - 15:46

ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతివ్వకపోతే తమ సత్తా చూపుతామంటూ టీడీపీ  రాజ్యసభ స‌భ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. టీజీ వెంకటేష్ చిల్లర మాటలు, పిచ్చి ప్రేలాపణలు మానుకోకపోతే బుద్ధి చెప్పాల్సి వస్తుందని  ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. కేంద్రంతో పోరాడి హక్కులు సాధించుకోవడంలో విఫలమైన  టీడీపీ నేతలు ..తమపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.  తెలంగాణ అభివృద్ధి చూసి టీజీలో అసూయ, ద్వేషం పెరగడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓరుగల్లు ఖిల్లా 2019 ఎన్నికల్లో సంచలనంగా మారనుందా ?

Submitted by arun on Thu, 04/26/2018 - 12:56

ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు ఖిల్లా 2019 ఎన్నికల్లో  సంచలనంగా మారనుందా ? ఎన్నికలకు ముందు అధికార పార్టీలో జంప్ జిలానీలు పెరగనున్నారా ?  బస్సు యాత్రతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు మారాయా ? కారు దూకుడుకు బ్రేకులు వేసేందుకు హస్తం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా ?  అధికార పార్టీకి చెందిన నేతలు మూడు రంగుల కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా ?  ఇప్పుడీ  అంశాలే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మూడు జిల్లాల పరిధిలో అసలు ఏం జరుగుతుందో తెలియక అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. 

చంపే బాధ్యతను ఓ మంత్రి, ఎమ్మెల్యేకు అప్పగించింది : మందకృష్ణ

Submitted by arun on Fri, 03/09/2018 - 17:45

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆ బాధ్యతను ఓ మంత్రితో పాటు ఎమ్మెల్యేలకు అప్పజెప్పిందని ఆరోపించారు. సూర్యాపేట నుంచి ఓ కారు తన వాహనాన్ని వెంబడిస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు వాహనాన్ని గుర్తించలేదన్నారు. ఈ నెల 13న తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. 24 ఏళ్ల పోరాటంలో ఎప్పుడు ఇంత ఆందోళనకు గురి కాలేదన్నారు మందకృష్ణ. 

టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిన రాజ్యసభ సీట్ల వ్యవహారం

Submitted by arun on Wed, 03/07/2018 - 10:52

మొత్తం 3 రాజ్యసభ సీట్లు. అందులో ఒకటి కన్ఫార్మ్ అయిపోయింది. ఇంకో రెండు మిగిలాయి. ఈ రెండింటిలో ఒకటి యాదవులకు రిజర్వ్ అయ్యింది. కానీ వాళ్లలో ఎవరికి ఇస్తారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. మిగిలిన ఒక సీటు కోసం పోటీ చాలానే ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఆ రెండు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయనేదే హాట్ టాపిక్‌గా మారింది.

టీఆర్ఎస్‌ను వణికిస్తోన్న ఇసుక తుఫాన్

Submitted by arun on Tue, 01/09/2018 - 13:35

తెలంగాణలో ఇసుక వివాదం అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేరెళ్ల ఘటన ముగియక ముందే కాంభాపూర్‌లో వీఆర్‌ఏ సాయిలు హత్య జరగడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇసుక  మాఫియా ఆగడాలు మితిమీరుతున్నాయన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అపవాదును మోయాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఇసుక వివాదం టీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతోంది. ఇసుక మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో గులాబీ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక  అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందనే విమర్శలు తీవ్రమయ్యాయి.