jc diwakar reddy

అమ్మ కడుపులో నుంచే జగన్ నేను ముఖ్యమంత్రి అంటూ పుట్టాడు

Submitted by arun on Wed, 04/25/2018 - 16:52

గవర్నర్ నరసింహన్ బతక నేర్చిన వ్యక్తి అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. నాడు ఇందిరా గాంధీకి సన్నిహితంగా ఉన్న నరసింహన్ నేడు మోడీకి క్లోజ్‌గా ఉన్నాడని తెలిపారు. అమ్మ కడుపు నుంచే జగన్... నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అని పుట్టాడని ఎద్దేవా చేశారు. మెగాస్టార్ బ్రదర్స్ కూడా సీఎం కావాలని  కలలుకంటున్నారని తెలిపారు. కర్నాటక ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్సే గెలుస్తుందని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు. 

జనసేన ఆపరేషన్ ఆకర్ష్ షురూ..జేసీకి జనసేన ఆహ్వానం..?

Submitted by arun on Thu, 04/12/2018 - 11:46

వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని చాలా కాలం కిందటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే ఒకసారి జిల్లాలో పర్యటించిన పీకే.. మరోసారి అనంతలో టూర్‌కి సన్నాహాలు చేస్తున్నారు. తన పోరాటాలకు కేంద్రంగా పవన్ అనంతపురం జిల్లాను ఎంచుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. రాబోయే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా జనసేనాని పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. పార్టీ ప్రారంభమై నాలుగేళ్లయినా ఏ ఒక్కరూ ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జనసేనలోని కీలకనేతలు ఆపరేషన్ ఆకర్ష్‌ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాద‌ని చెప్పింది చంద్ర‌బాబే

Submitted by lakshman on Wed, 04/11/2018 - 04:55

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కోసం టీడీపీ తొల‌త ఢిల్లీలో ఆందోళ‌న చేప‌ట్టింది. అయితే ఆ పార్టీని ఎవ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో త‌ట్టాబుట్టా స‌ర్దుకొని ఏపీలో పోరాటం చేస్తుంది. అయితే తాము ఎంత ఆందోళ‌న చేసినా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా రాద‌ని చెబుతార‌ని , చంద్ర‌బాబు చెప్పారు కాబ‌ట్టే చేస్తున్నామ‌ని టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అని అన్నారంటూ వైసీపీ నేత అనంత వెంక‌ట్రామిరెడ్డి చెప్పుకొచ్చారు. 

ఎంపీ జేసీపై సీఎం చంద్రబాబు సెటైర్‌

Submitted by arun on Mon, 03/12/2018 - 15:41

'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' జాగ్రత్త అంటూ సీఎం చంద్రబాబునాయుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై సెటైర్ వేసిన ఆసక్తికర ఘటన అమరావతి అసెంబ్లీ లాబీల్లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీకి చెందిన ఎంపీలంతా ప్రత్యేకహోదా కావాలంటూ పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, సీఎంను కలిసేందుకు అసెంబ్లీకి వచ్చారు. సీఎంను కలిసేందుకు వెళ్తుండగా, లాబీలో ఆయనే జేసీకి ఎదురయ్యారు. దీంతో ఆయన 'బడి ఎగ్గొడితే ఫెయిలవుతారు' అంటూ సెటైర్ వేశారు.

జగన్... దమ్ముంటే ఈరోజే చేయించు

Submitted by arun on Wed, 02/14/2018 - 14:18

ప్రత్యేక హోదాపై కేంద్రం స్పందించకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వ్యాఖ్యలపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్‌కు దమ్ముంటే ఇవాళే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తే ఆ తర్వాత ఉప ఎన్నికలు రావనే అలా చేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఏడాది క్రితం కూడా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామన్నారని ఈ సందర్భంగా ఎంపీ గుర్తు చేశారు.

చంద్ర‌బాబు సై అంటే..

Submitted by arun on Thu, 02/01/2018 - 16:45

చంద్రబాబు సై అంటే కేంద్రంపై యుద్ధానికి సిద్ధమని జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపించిన జేసీ పొమ్మనలేక పొగ పెడుతున్నట్టు ఉందని అన్నారు. ఏపీకి ఎటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదని,  అతి తక్కువ నిధులిచ్చి సాయం చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన హామీలపై, తిరుపతి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీలపై కూడా కేంద్ర బడ్జెట్‌లో న్యాయం చేయలేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఏ ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని ప్రశ్నించారు.

మరోసారి జేసీ దివాకర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 01/09/2018 - 12:33

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలు కరివేపాకులా మారారన్న జేసీ పార్లమెంట్‌లో చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి దించమంటే దించాలన్నారు. అంతకంటే ఎంపీలు ఏమీ చేయలేరన్నారు. రైల్వేజోన్‌‌పై చెప్పాల్సింది ప్రధాని మోడీయేనన్న జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీలు ఏమీ చేయలేరన్నారు. అవసరం, సందర్భాన్నిబట్టే చంద్రబాబుకి కూడా మోడీ అపాయింట్‌మెంట్ ఇస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.