jc diwakar reddy

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ జేసీ ...అనంతపురంలో ఐదుగురు ఎమ్మెల్యేలను...

Submitted by arun on Sat, 11/17/2018 - 17:28

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో టిడిపి గెలవాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న 40 శాతం ఎమ్మెల్యేలను మార్చాలన్నారు జేసీ. 
అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలను మార్చకుంటే పరిస్థితి కష్టంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎంపీలకు ఎటువంటి పవర్ లేకుండా పోయిందన్నారు. ఎంపీలకు ఉండాల్సిన పవర్ మొత్తం సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకే కట్టబెట్టారన్నారు. 
 

మనీ మ్యాటరే బెడిసికొట్టిందా...ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన విషయాలు

Submitted by arun on Tue, 09/25/2018 - 15:44

రాజకీయ రంగు పులుముకున్న ప్రబోధానంద ఆశ్రమం వ్యవహారం వెనుక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ పూర్తి ఘటన వెనుక డబ్బు వ్యవహారమే కారణమని చెబుతున్నా ఎవరు ఎవరిని డిమాండ్‌ చేశారు..? అసలు అగ్నికి ఆజ్యం పోసిందెవరు..? అన్న దానిపై నివ్వెరపర్చే నిజాలు బయటకొచ్చాయి. 

స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్... ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు...ఎక్కడి నుంచి పోటీకి...

Submitted by arun on Sat, 09/22/2018 - 16:42

ప్రబోధానంద స్వామి రాజకీయ ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి దాకా ఖాకీ వర్సెస్ జేసీ అన్నట్టు సాగిన రాజకీయం ఇప్పుడు స్వామి వర్సెస్ జేసీ బ్రదర్స్ అన్నట్టు మలుపు తిరిగింది. జేసీ సోదరులు కుట్ర పూరితంగా తమ ఆశ్రమంపై దాడి చేశారని ఆరోపిస్తూ స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఇక తానే స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు..? ఎక్కడి నుంచి పోటీకి దిగుతారన్న దాన్నది జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం : హోంమంత్రి

Submitted by arun on Sat, 09/22/2018 - 13:45

ఖాకీ వర్సెస్‌ ఖద్దర్‌గా మారిన తాడిపత్రి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా జేసీ, పోలీసుల వ్యాఖ్యలపై హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థపై దివాకర్‌రెడ్డి తీరు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్న హోంమంత్రి.. ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఇటు నాలుకలు కోస్తామంటూ ఆవేశంగా మాట్లాడిన పోలీసు సంఘం తీరును కూడా ఆయన తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలు కూడా సమర్థనీయం కాదన్న చిన రాజప్ప రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు. 

త్వరలో రాజకీయాల్లోకి వస్తాం: ప్రబోధనాంద స్వామి

Submitted by arun on Sat, 09/22/2018 - 13:38

కుట్రతోనే తమ ఆశ్రమంపై దాడి జరిగిందన్నారు ప్రబోధానంధ స్వామి. రాజకీయ కుట్రలో భాగంగానే దాడులు చేశారని ఆరోపించారు. స్థానిక ప్రజలను జేసీ సోదరులు రెచ్చగొట్టే తమ ఆశ్రమంపై దాడులు చేయించారని ప్రబోధనాంధ స్వామి తెలిపారు. త్వరలో తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు ప్రబోధానంధ స్వామి. రాజకీయాల ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అనిపిస్తే తాము కూడా త్వరలోనే రాజీయాల్లోకి వస్తామని చెప్పారు. తాను ఎవరికి బెదిరేది లేదని ప్రబోధానంధ స్పష్టం చేశారు. తమ ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడంలేదని ...ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

సీఐ గోరంట్ల మాధవ్‌కు జేసీ సవాల్...దమ్ముంటే....

Submitted by arun on Fri, 09/21/2018 - 15:22

పోలీసు సంఘం అధికారులపై ఫైర్ అయ్యారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. దమ్ముంటే నాలుక కోయాలని, తనపైనే మీసాలు తిప్పుతావా అంటూ సీఐ మాధవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నువ్వు ఉద్యోగం వదిలి రా.. నేను రాజకీయాలు వదిలి వస్తా.. తేల్చుకుందాం’ అని జేసీ సవాల్‌ విసిరారు. కొజ్జా అన్న పదం అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే నేను క్షమాపణ చెబుతానని చెప్పారు. ప్రబోధానంద ఆశ్రమంలో అక్రమాలు జరుగుతున్నాయన్న జేసీ దొంగనోట్లతోపాటు దొంగ ఆధార్, రేషన్ కార్డులు తయారు చేసే ముద్రణాలయం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

భగ్గుమన్న తాడిపత్రి

Submitted by arun on Mon, 09/17/2018 - 10:49

 అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులానే ఉంది. ప్రబోదానందస్వామి భక్తులకు జేసీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది.  వినాయక నిమజ్జన సమయంలో రేగిన వివాదం చినికిచినికి గాలివానగా మారి 48 గంటలు గడుస్తున్నా పరిస్ధితులు ఇంకా సద్దుమణగలేదు.  చిన్నపడమల, పెద్దపడమల గ్రామాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాల కు చెందిన పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. తాడిపత్రి పోలీసు స్టేషన్ ఎదుట భైఠాయించిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  ప్రబోదానందస్వామి ఆశ్రమాన్ని సీజ్ చేయాలంటూ పట్టుబట్టారు.  పట్టణంలో 144వ సెక్షన్ విధించిన పోలీసులు వినాయక నిమజ్జన వేడుకలను వాయిదా వేశారు.

ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/05/2018 - 13:45

తనదైన కామెంట్స్‌తో రోజుకో వివాదం పూటకో రాద్ధాంతం చేసే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు రాజకీయ విమర్శలతో వివాదాలు రేపిన ఆయన తాజాగా  పోలీస్ వ్యవస్ధ తీరుపై తీవ్ర స్ధాయిలో విమర్శలు గుప్పించారు.  ఫ్రెండ్లీ పోలీస్‌తో శాంతిభద్రతలు కాపాడలేరన్న ఆయన ఆలూరులో ఎస్సైపై దాడి జరిగితే ఫిర్యాదు చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. పోలీసుల్లో చావ చచ్చిందా అంటూ ప్రశ్నించిన జేసీ ఫ్రెండ్లీ పోలీస్‌ విధానంతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. జిల్లాల్లో పోలీస్‌ వ్యవస్థ నిర్వీర్యమైందంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. 

జేసీకి ఎదురుపడిన సోనియా.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

Submitted by arun on Fri, 07/20/2018 - 15:02

పార్లమెంట్ లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. టీడీపీ ఎంపీ జేసీకి ఎదురుపడ్డారు. దీంతో.. తన ఆవేదననంతా జేసీ.. సోనియా ముందు ఉంచారు. ఈ సందర్భంలో జేసీ సోనియాతో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ‘‘తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్.. రెడ్లకు తీరని అన్యాయం చేశావ్.. కాంగ్రెస్‌ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు’’ అంటూ సోనియాకు జేసీ దండం పెట్టారు. జేసీ వ్యాఖ్యలు విన్న సోనియా నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ గతంలో కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌లో మనుగడ కష్టమని భావించి.. 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.

సొంత పార్టీ నేతలకు జేసీ ఝలక్

Submitted by arun on Thu, 07/19/2018 - 10:16

కేంద్రంపై అవిశ్వాసానికి టీడీపీ మద్దతు కూడగడుతున్న సమయంలో ఎంపీ జేసీ దివాకర్‌‌రెడ్డి సొంత పార్టీ నేతలకు ఝలక్ ఇచ్చారు. టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా సంచలన నిర్ణయం తీసుకుని కలకలం రేపారు. అవిశ్వాసానికి దూరంగా ఉంటానని ప్రకటించిన జేసీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అసలు హాజరుకాబోనంటూ ప్రకటించారు. అంతేకాదు విప్ జారీ చేసినా వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పారు. తనకు హిందీ ఇంగ్లీష్ రాదనీ అలాంటప్పుడు పార్లమెంటు సమావేశాలకు వెళ్లి ఏం చేయాలంటూ టీడీపీలో కాక పుట్టించారు.