Kota Srinivasa Rao

ప‌వ‌న్ క‌ల్యాణ్ పాలిటిక్స్ పై కోటా కామెంట్స్

Submitted by lakshman on Tue, 01/09/2018 - 14:37

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ర‌జ‌నీ కాంత్ రాజ‌కీయంపై న‌టుడు కోటా శ్రీనివాస‌రావు స్పందించారు. ర‌జ‌నీకాంత్ ఆల‌స్యం చేయ‌కుండా పార్టీ ని స్థాపించి నిర్మాణం చేప‌ట్టాల‌ని సూచించారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అన్న చిరంజీవి విష‌యంలో ఎదురైన ఇబ్బందులు, స‌వాళ్ల‌ను అవ‌పోష‌ణ ప‌ట్టాల‌ని సూచించారు. రాజ‌కీయాల్లోకి ఎవ‌రైనా రావ‌చ్చు. స‌వాళ్లును ఎందుర్కోవ‌డ‌మే కావాల్సింద‌ని సూచించారు. అధికారంలో ఉన్నా లేక‌పోయినా బీజేపీకి, గౌర‌వం ఉన్నాయ‌ని కొనియాడారు. రాజధాని అమరావతిపై మాట్లాడుతూ బుడిబుడి అడుగులు వేస్తున్న నిర్మాణంలో ఉండ‌గానే ..ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని ప్ర‌భుత్వాన్ని నిందించ‌డం స‌రికాద‌న్నారు.

తానే ముఖ్య‌మంత్రిన‌న్న జ‌గ‌న్ పై కోటా కామెంట్స్

Submitted by lakshman on Tue, 01/09/2018 - 00:17

విల‌క్ష‌ణ న‌టుడు కోటా శ్రీనివాస‌రావు ఓ ఇంట‌ర్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర  వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ గురించి, బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో క‌మ‌లం పార్టీ హ‌వాపై మాట్లాడారు. అధికారంలో ఉన్నా లేక‌పోయినా బీజేపీకి, గౌర‌వం ఉన్నాయ‌ని కొనియాడారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోమ‌రాజు వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ఆయ‌న.. పార్టీలో లీడర్లుగా ఉన్నవాళ్లకు న‌మ్మ‌కం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ..అందుకే కాబోలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే ముఖ్య‌మంత్రిని అని జ‌గ‌న్ అన‌ట్లేదా అని ప్ర‌శ్నించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే..

ఆయ‌నుంటేనే ఏపీ అభివృద్ధి - కోట‌

Submitted by lakshman on Tue, 01/09/2018 - 00:13

ఏపీని న‌డిపించే సత్తా ఉన్ననాయ‌కుడు సీఎం చంద్ర‌బాబేన‌ని కోటా కితాబిచ్చారు. రాష్ట్ర‌విభ‌జ‌న‌లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ చేతిలో పెట్టార‌ని..ఏపీ అంటే ఆకులు ప‌ట్టుకుని విస్త‌రి త‌యారు చేసుకోవ‌డమే అన్నచందంగా మారింద‌న్నారు. అంతేకాదు  హైద‌రాబాద్ లా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలా అవ్వాలంటే క‌నీసం 20సంవ‌త్స‌రాలు ప‌డుతుంద‌ని సూచించారు. అంతేకాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అది చంద్ర‌బాబు వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని ,ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. ఏపీ ఆయన చేతిలో ఉండటమే మంచిది. అంతకన్నా ఎవరూ చేయగలిగిందేమీ లేదు.

ఎమ్మెల్యే రోజాపై మండిప‌డ్డ కోటా శ్రీనివాస‌రావు

Submitted by lakshman on Tue, 01/09/2018 - 00:02

  వైసీపీ ఎమ్మెల్యే రోజాపై న‌టుడు కోట శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు. కొద్దిరోజుల క్రితం రోజా నిర్మాత బండ్ల‌గ‌ణేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే.  ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రోజా-బండ్ల‌గ‌ణేష్ లు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై స్పందించారు. ఆ స‌మ‌యంలో  వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ ను  ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌శ్నించ‌డంపై వారి మధ్య మాటలు శ్రుతిమించాయి. వీరిద్దరి మధ్య చ‌ర్చ‌లు తారాస్థాయికి చేరుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదంపై కోటా స్పందించారు. రోజాను ఓ రాజ‌కీయ నాయ‌కురాలిగా చూడ‌డంలేద‌ని అన్నారు.