balakrishna

కాళ్లు మొక్కిన నిరుపేదకు.. సాయమందించిన బాలయ్య

Submitted by arun on Fri, 10/05/2018 - 14:53

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ కృష్ణా జిల్లా హంసల దీవి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్‌లో బిజీగా వున్న బాలయ్య దగ్గరికి ఓ నిరుపేద వ్యక్తి వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. అతను అంత నిస్సహాయంగా ఎందుకు ఏడుస్తూ తన కాళ్ళు పట్టుకున్నాడో అడిగి తెలుసుకున్నాడు బాలయ్య. అతనికి క్యాన్సర్ వ్యాధి వుందని, జబ్బు నయం చేయించుకోవడానికి తనవద్ద డబ్బులేదని, మీరే ఆదుకోవాలని చెప్పాడతడు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన బాలయ్య అప్పటికప్పుడే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఫోన్ చేశారు. ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాలయ్య చేసిన సాయానికి ఆ వృద్ధుడు సంతోషంతో కంటతడి పెట్టాడు.

అభిమానులపై చేయి చేసుకున్న బాలకృష్ణ

Submitted by arun on Tue, 10/02/2018 - 10:26

 సినీనటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ  చెంపదెబ్బల స్పెషలిస్ట్ గా మారిపోయారు. రీల్ లైఫ్‌లో అభిమానులే తన దేవుళ్లు అంటూ స్పీచ్ లు ఇచ్చే బాలయ్య అభిమానంతో దగ్గరకు వస్తున్న ఫ్యాన్స్‌ను అక్కున చేర్చుకోవాల్సింది పోయి చెంప చెళ్లు మనిపించడం లేదా కాలుతో తన్నడం చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు.  

ఆకట్టుకుంటున్న ‘యన్‌.టి.ఆర్‌’ సరికొత్త పోస్టర్‌

Submitted by arun on Thu, 09/20/2018 - 17:20

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఎన్‌టీఆర్ చిత్రంలోనుంచి ఈ రోజు ఉద‌యం ఏఎన్ఆర్ ఫ్ట‌స్ లుక్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. అక్కినేని జ‌యంతి సంద‌ర్భంగా ఆ పోస్ట‌ర్‌ను లాంచ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ .. అక్కినేనిగా సుమంత్ ఎంతగా కుదిరారనేది ఈ పోస్టర్లో కనిపిస్తోంది .      

నటుడిగా, నిర్మాతగా ’యన్టీఆర్‘ను తెరకెక్కించడం ఆనందంగా ఉంది: బాలకృష్ణ  

Submitted by arun on Sat, 08/04/2018 - 12:42

తన తండ్రి బయోపిక్ యన్టీఆర్ చిత్రానికి నటుడిగా, నిర్మాతగా తాను వ్యవహరించడం చాలా సంతోషంగా ఉందన్నారు హీరో నందమూరి బాలకృష్ణ. ’యన్టీఆర్‘ చిత్రీకరణ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం స్వాగ్రామమైన కృష్ణ జిల్లా నిమ్మకూరులో పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి యన్టీఆర్ బాల్యంపై చిత్రీకరణ జరిపేందుకు దర్శకుడు క్రిష్ తో కలిసి లోకేషన్ల ను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యన్టీఆర్ దంపతుల విగ్రహాలకు బాలకృష్ణ పూల మాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. జనవరి 9న యన్టీఆర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

బాలయ్య బాబు డాన్స్

Submitted by arun on Sat, 06/30/2018 - 15:20

ఆడేపల్లి గ్రామంలో మన బాలయ్య,

ఆడెనుగా నలుగురితో కలిసి కృష్ణాయ్యలా!

అదిరిపోయే డైలాగుల ముద్దుల మామయ్య,

అన్నగారి చిత్రంతోఎన్ని సిత్రాలొ రామయ్యలా!

తండ్రి బాటలో నడుస్తున్న తనయుడు

Submitted by arun on Sat, 06/30/2018 - 11:39

తండ్రి బాటలో తనయుడు పయనిస్తున్నాడా..? ప్రజల్లో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన తీరు చూస్తుంటే. ఎన్నికలు దగ్గరపడిన సమయంలో తన నియోజకవర్గంలోని మూరుమూల గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎప్పుడూ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరన్న అపవాదును తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు బాలకృష్ణ. 

స్థానికులతో బాలయ్య

మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన బాలయ్య

Submitted by arun on Fri, 06/29/2018 - 17:07

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గ్రామబాట పట్టారు. మొన్న పల్లె నిద్ర చేసిన ఆయన.., ఇవాళ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పాతచమలపల్లి, దేమకేతేపల్లి, టేకులోడు గ్రామాల్లో పర్యటించి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆడేపల్లి గ్రామంలో గిరిజన మహిళలతో బాలకృష్ణ సరదాగా నృత్యం చేశారు. 


 

ఎన్టీఆర్‌ బయోపిక్‌ : నాదెండ్ల కుటుంబం నోటీసులు

Submitted by arun on Thu, 06/28/2018 - 16:41

‘ఎన్టీఆర్’ బయోపిక్ పై నాదెండ్ల భాస్కరరావుకుటుంబం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణకు భాస్కరరావు పెద్దకుమారుడు నోటీసులు పంపారు. ఎమ్మెల్యే హోదాను ఉద్దేశించ ఒకటి, నటుడిగా మరొక నోటీసును బాలకృష్ణకు నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడు పంపారు. సినిమాలో తమ పాత్రల గురించి ఎలాంటి అనుమతి తీసుకోలేదని వెల్లడించారు. నెగటివ్‌ షేడ్‌లో భాస్కరరావును చూపించే ప్రయత్నం చేస్తునట్టు తమకు సమాచారం ఉందని ఆయన చెప్పారు. కాగా, క్రిష్‌ దర్శకత్వంలో ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ నుంచి డైరెక్టర్ తేజ ఔట్

Submitted by arun on Thu, 04/26/2018 - 11:14

ఎన్టీఆర్ బయోపిక్‌ ప్రాజెక్ట్‌ నుంచి డైరెక్టర్ తేజ తప్పుకున్నారు. ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి తేజ ఓ సంచలనం రేపారు. అయితే దర్శకత్వ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.