mahabubnagar

దూసుకుపోతున్న నాగం, రేవంత్ , అరుణ...అక్కడ వార్ వన్ సైడేనా

Submitted by arun on Fri, 07/13/2018 - 14:21

మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ వర్గాలు మంచి జోరు మీదున్నాయి. నాగం, రేవంత్, అరుణ పాలమూరు త్రయంగా పిలిచే వీరు ముగ్గురు టిఆరెస్ పై  ముప్పేట దాడి చేసేస్తున్నారు ఇద్దరు మంత్రులు,  ఎమ్మెల్యేలు ఉన్నా  వీరి దాడి తట్టుకోడం చేత కావడం లేదు. ఉమ్మడి మహబూబ్‍నగర్‍ జిల్లాకి ఎన్నికల మూడ్ వచ్చేసింది అధికార టీఆర్‍ఎస్‍, ప్రతిపక్ష కాంగ్రెస్‍ నేతల మధ్య మాటల యుద్దం ముదురుతోంది.  అధికారంలో లేకపోయినా బలమైన నేతలు, క్యాడర్‍ ఉండటంతో టిఆర్‍ఎస్‍ కి వణుకు పుట్టిస్తోంది కాంగ్రెస్. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నా కాంగ్రెస్‍ పార్టీ నాయకుల దూకుడును పూర్తిస్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు.

రేవంత్ రెడ్డి రాక‌..చాప‌కింద నీరులా వ‌ర్గ‌పోరు

Submitted by arun on Mon, 01/08/2018 - 16:18

మహబూబ్‌నగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత పోరు మొదలయ్యాయ్. పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కృష్టి చేస్తుంటే మరోవైపు జిల్లా నేతలు వర్గపోరుతో కొట్టుకుంటున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే ఉండటంతో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నాయ్.