sangareddy

హరీష్ రావుకు తృటిలో తప్పిన ప్రమాదం

Submitted by arun on Sat, 09/29/2018 - 12:52

సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. హరీష్ రాక సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు బాణా సంచా కాల్చడంతో అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన కార్యకర్తలు వాహనాలను వదిలేసి పారిపోయారు. హరీష్ మాత్రం పొగల్లో చిక్కుకుని కొద్దిసేపు ఇబ్బంది పడ్డారు. మంత్రిని మంటలు, పొగ చుట్టుముట్టడంతో ఆంతా కంగారు పడ్డారు. వెంటనే అప్రమత్తమైన ముగ్గురు గన్‌మెన్లు వచ్చి ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం మంత్రిని అక్కడి నుంచి తరలించారు.

కిడ్నీ కోసం చోరీ

Submitted by arun on Sat, 07/14/2018 - 17:44

కిడ్నీ వ్యాధి భార్య ప్రాణం మీదికొచ్చింది. లక్షలు పోసినా రోగం నయం కానంది. ఉన్నదంతా ఊడ్చేసినా డాక్టర్లు ఇంకా కావాలన్నారు. చేసేదేం లేక భర్త దొంగగా మారాడు. భార్య సాయంతో ఓ జ్యూయలరీ షాపును దోచుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన బంగారం షాపు దోపిడిని పోలీసులు ఛేదించారు. 

‘అమ్మ’లకు పరీక్ష: పరీక్ష రాసిన 47వేల మంది మహిళలు

Submitted by arun on Mon, 03/26/2018 - 12:14

అమ్మలు బడిబాట పట్టారు..! ఒక్కరు కాదు ఇద్దరు కాదు... 47వేల మంది మహిళలు పాఠశాలలకు వచ్చి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 475 గ్రామ పంచాయతీల్లోని పాఠశాలల్లో ఆదివారం ఉదయం పరీక్ష రాస్తున్న మహిళలే కనిపించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు పరీక్షలు రాయడమేమిటీ..? ఏం పరీక్షలు అని అనుకుంటున్నారు కదా..? ఇటీవలే బదిలీపై వెళ్లిన కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ ప్రయోగాత్మకంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. నిరక్షరాస్యులైన స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వారి పిల్లలు చదువు నేర్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

జైల్లో చిప్ప‌కూడుతిన్న శ్రీమంతుడు

Submitted by arun on Tue, 02/06/2018 - 11:04

నాలుగ్గోడల మధ్య బందీ ఏడు చువ్వల వెనకాతలే జీవితం బయట ప్రపంచంతో సంబంధం ఉండదు.. అయిన వాళ్లను కలిసే అవకాశం ఉండదు.. పెట్టింది తినాలి.. చెప్పింది చేయాలి.. నేరం చేసిన వారు జైలుకెళ్తారు. కానీ, ఇప్పుడు ఎలాంటి తప్పు చేయని వారు కూడా సంగారెడ్డి జైలుకు క్యూ కడుతున్నారు. పక్క రాష్ట్రాల నుండే కాదు, విదేశీయులు కూడా ఇక్కడ జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇంతకీ సంగారెడ్డి జైలులో నయా ఖైదీల సంగతేంటో మీరే చూడండి. ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే ఔత్సాహికులకు సంగారెడ్డి జైలు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పలువురు అత్సాహికులు కేరాఫ్ ఎడ్రాస్ గా నిలిచింది.. ‎

వార్డెన్‌ అరాచకం

Submitted by arun on Mon, 01/08/2018 - 14:15

విద్యార్ధులను క్రమశిక్షణలో పెట్టాల్సిన వార్డెన్‌ క్రమం తప్పాడు. చిన్న తప్పుకే పెద్ద శిక్షలు విధిస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. ప్లాస్టిక్‌ పైపుతో విద్యార్ధులను చితకబాదుతూ నరకం చూపించాడు. బండ బూతులు తిడుతూ విద్యార్ధులను గోడ కుర్చీ వేయించాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ ఎస్టీ హాస్టల్‌ వార్డెన్‌ యాదయ్య అరాచకంతో పిల్లలు బెంబేలెత్తిపోతున్నారు. చేతులు నొప్పి పెడుతున్నాయి, కొట్టొద్దు సార్‌ అని వేడుకున్నా వదిలిపెట్టకపోవడంతో విద్యార్ధులు అల్లాడిపోయారు.