స‌చిన్

స‌చిన్ కూతురు సారా ను కిడ్నాప్ చేస్తానంటూ క‌ల‌కలం

Submitted by arun on Sun, 01/07/2018 - 22:12

స‌చిన్ కూతురు సారా ను కిడ్నాప్ చేస్తానంటూ ఓ అగంత‌కుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స‌చిన్ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌శ్చిమ్ బంగ మిద్నాపూర్ కు చెందిన దేవ్ కుమార్ మిత్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆవారాగా తిరిగే త‌ను స‌చిన్ కూతురు సారాను అనే సార్లు టీవీల్లో చూసిన‌ట్లు చెప్పారు. దీంతో ఆమెపై ఇష్టం పెరిగి గత నెల చివరి వారంలో సచిన్‌ ఇంటి ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి సారాను కిడ్నాప్‌ చేస్తానని, పెళ్లి చేసుకుంటానంటూ నిందితుడు బెదిరించినట్లు చెప్పుకొచ్చాడు.