padayatra

హోదాపై కేంద్రం తీరుకు నిరసనగా ఏప్రిల్ 6న పవన్ పాదయాత్ర

Submitted by arun on Wed, 04/04/2018 - 15:41

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చుకొనేందుకు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై ఈ రోజు విజయవాడలో జరిగిన సీపీఎం, సీపీఐ, జనసేన నేతల భేటీలో చర్చించారు. ఈ భేటీ ముగిసిన అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో తొలుత జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ..విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ఏప్రిల్ 6న జాతీయ రహదారులు లేని చోట ముఖ్య కూడళ్లలో పాదయాత్రలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నాయని పవన్ విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ద్రోహం చేసిందని ఆయన చెప్పారు.

పాదయాత్ర ఉత్కంఠ..త‌ల‌లు ప‌ట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు

Submitted by arun on Thu, 02/22/2018 - 16:49

తెలంగాణ కాంగ్రెస్ లో పాదయాత్ర ల ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతి కోసం ఎదురుచూసిన నేతలకు అధిష్టానం తీసుకున్న కొత్త నిర్ణయం విస్మయానికి గురిచేసింది. దీంతో ఎవరు పాదయాత్ర చేయాలో అర్థం కాక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. 

పాదయాత్రలు చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ లో పోటీపడిన నలుగురిలో ఎవరికో ఒకరికి అధిష్టానం అవకాశం ఇస్తుందని భావిస్తే ఒకేసారి ముగ్గురు నేతలకు పాదయాత్రలు చేసుకోమని అనుమతి ఇవ్వడంతో నేతలు విస్తుపోతున్నారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళానికి గురిచేస్తున్నాయి.

త్వరలో రేవంత్‌ పాదయాత్ర

Submitted by arun on Thu, 02/15/2018 - 12:18

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెకుటల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌-కృష్నా రైల్వేలైన్‌, నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతలకు నిధుల కేటాయింపుతో పాటు పలుడిమాండ్ల సాధనకు కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వరకు 120 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. బంరాస్‌ పేట, పరిగి,వికారాబాద్‌,. మన్నెగూడ,చేవేళ్ల, మెయినాబాద్‌ మీదుగా ఈ యాత్ర సాగునుంది.

జగన్ పాదయాత్ర మాకు ఇబ్బంది కాదు: అఖిలప్రియ

Submitted by arun on Sat, 01/06/2018 - 17:38

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై ఏపీ పర్యటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ స్పందించారు. జగన్ పాదయాత్రతో తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అఖిలప్రియ అన్నారు. శనివారం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆమె ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం టూరిజంశాఖ అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. భక్తుల కోసం శ్రీశైలంలో రూ.6కోట్లతో లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు.