padayatra

దారి మార్చిన జగన్‌...తెలంగాణ ఎన్నికలు...

Submitted by arun on Sat, 10/13/2018 - 10:15

తెలంగాణ ఎన్నికలు ముగిసేవరకు ఏపీలో జగన్ పాదయాత్ర కొనసాగనుందా? మరికొద్ది రోజుల్లో ముగియాల్సిన జగన్‌ పాదయాత్రను పొడిగించబోతున్నారా? తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావం చూపుతాయని జగన్ భావిస్తున్నారా? అసలు జగన్‌ వ్యూహం ఏంటి? 

వెంకన్నపై భక్తిని చాటుకున్న శునకం...తమిళనాడు నుంచి తిరుమల వరకు...

Submitted by arun on Tue, 10/02/2018 - 16:24

ఏడుకొండల వెంకన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు.. తాను కూడా, శ్రీవారికి భక్తురాలినేనని నిరూపించింది ఓ శునకం. తిరుమలేశుని దర్శనం కోసం ఒకటి, రెండు కాదు ఏకంగా.. 400 కిలో మీటర్లు నడిచింది. 8 రోజుల పాటు నడిచి.. తమిళనాడు నుంచి ఏడుకొండలకు చేరుకుంది. తిరుమలకు చేరుకున్న ఈ శునకాన్ని చూసి అందరు ఆశ్చర్యపోతున్బారు. తమిళనాడు కడలూరు జిల్లాకు చెందిన ఓ భక్తబృందం పాదయాత్రగా తిరుమలకు బయలుదేరింది. అయితే, వీరికి మార్గమధ్యలో ఓ శునకం కనిపించింది. ఆకలితో ఉన్నదానికి రెండు బిస్కెట్లు వేశారు. అక్కడి నుంచి ఆ కుక్క వారితో పాటు పాదయాత్రగా.. తిరుమలకు వరకు వచ్చింది.

సెన్సేషనల్ కామెంట్లతో వేడి పెంచిన జగన్

Submitted by arun on Tue, 08/07/2018 - 14:24

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  ఎక్కువ రోజులు గోదావరి జిల్లాలోనే పాదయాత్ర సాగించిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసి ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. నెరవేర్చగలిగిన వాగ్దానాలనే ఇస్తూ, తన విశ్వసనీయతను మరోసారి నిలబెట్టుకునే దిశగా వైసిపి అధినేత అడుగులు వేస్తున్నారా? పార్టీని అధికారంలోకి తెచ్చే జిల్లాలో జగన్ టూర్ వాడి, వేడిగా సాగింది. బుధవారం ముగియనున్న జగన్ తూర్పు గోదావరి పర్యటనపై ఓ రౌండ్ అప్..

జగన్ పాదయాత్రకు కాపుల నిరసన సెగ

Submitted by arun on Sat, 08/04/2018 - 12:20

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలులో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. వాటర్ ట్యాంకు పైకెక్కి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని కిందికి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ మాత్రం మౌనంగా పాదయాత్రను సాగిస్తున్నారు. 
 

జగన్‌ పాదయాత్రకు అనుమతించని పోలీసులు

Submitted by arun on Sat, 06/09/2018 - 16:29

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. గోదావరి బ్రిడ్జిపై నుంచి జగన్ పాదయాత్రకు.. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. పాదయాత్రకు మరో మార్గం ఎంచుకోవాలని.. రాజమహేంద్రవరం  డీఎస్పీ లేఖ రాశారు. బ్రిడ్జి కండీషన్‌ సరిగా లేదని.. పోలీసులు అనుమతి నిరాకరించారు.

కాంగ్రెస్‌ యాత్రకు హైకమాండ్‌ బ్రేక్‌...విరామం వెనుక అసలు కథ ఇదే!!

Submitted by arun on Wed, 04/25/2018 - 12:58

తెలంగాణలో కాంగ్రెస్‌ నేతల పాదయాత్రలకు బ్రేక్ పడింది. ముఖ్యనేతలంతా పాదయాత్రలు చేయడానికి క్యూ కట్టడంతో.. హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. నాయకుల పాదయాత్రల వల్ల పార్టీలో కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయంతో పాదయాత్ర చేద్దామనుకున్న నేతలంతా డిజప్పాయింట్ అయ్యారు.

పాదయాత్రకు మహూర్తం ఖారారు చేసిన డీకే అరుణ

Submitted by arun on Sat, 04/14/2018 - 11:36

ఏపీలో కొనసాగుతున్న  పాదయాత్రల హాడావుడి తెలంగాణను తాకింది. కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా పాదయాత్రలకు సిద్ధం అవుతున్నారు. అధిష్టానం అనుమతినివ్వక ముందే నడక మార్గానికి రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంటున్నారు. ఇటీవల ముగ్గురు  నేతలకు అధిష్టానం అనుమతి ఇవ్వడంతో సీనియర్లు తాము కూడ పాదయాత్ర చేస్తామంటూ విజ్ణప్తులు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి డికే అరుణ పాదయాత్రకు ముహూర్తం సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది.   

పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్..వైసీపీలోకి క్యూక‌ట్ట‌నున్న నేత‌లు..?

Submitted by lakshman on Sun, 04/08/2018 - 23:41

ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. పార్టీల‌న్నీ స‌న్నాహాల్లో ఉన్నాయి. ఓవైపు హోదా ఉద్య‌మంలో బిజీగా గ‌డుపుతూనే మ‌రోవైపు సొంత ఇంటిని చ‌క్క‌దిద్దుకోవ‌డంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు త‌గ్గ‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ప‌రిస్థితిని త‌మ‌కు సానుకూలంగా మ‌ల‌చుకోవాల‌నే ప్ర‌య‌త్నంలో జ‌గ‌న్ త‌లామున‌క‌లైన‌ట్లు స‌మాచారం. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను అభ్య‌ర్థుల విష‌యంలో ముంద‌స్తుగా సిద్ధం చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ఉన్న‌ట్లు ఆ పార్టీనేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా ఇత‌ర పార్టీల నుంచి చేర‌డానికి సంకేతాలు ఇచ్చిన వారిని వెంట‌నే చేరాల‌ని సూచించిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఎర్రటి ఎండలో ఎర్ర కండువా కట్టిన జనసేనాని

Submitted by arun on Fri, 04/06/2018 - 16:39

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి జనం మధ్యకొచ్చారు. తలపై ఎర్రటి కండువా కట్టుకుని ఎర్రటి ఎండలో మూడు కిలోమీటర్లు నడిచారు. వామపక్షాలతో కలిసి పవన్‌ చేపట్టిన ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మకం ద్రోహం చేశాయన్న పవన్ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

పాదయాత్రలో పాల్గొన్న పవన్‌కల్యాణ్‌

Submitted by arun on Fri, 04/06/2018 - 12:13

ప్రత్యేక హోదా తమ హక్కు అంటూ జెజవాడ నినదించింది.  వామపక్షాలతో కలిసి జనసేన చేపట్టిన పాదయాత్రకు ప్రజలు భారీగా తరలివచ్చారు. నలువైపుల నుంచి పోటెత్తిన జనంతో కిక్కిరిసింది.   జనసేన అధినేత అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నేరుగా బెంజ్ సర్కిల్ చేరుకుని  పాదయాత్రలో పాల్గొన్నారు. బెంజ్‌సర్కిల్‌ వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర  రామవరప్పాడు కూడలి వరకూ సాగుతోంది. వేలాదిమంది కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పవన్‌ అభిమానులతో బెంజిసర్కిల్ వద్ద సందడి వాతావరణం కనిపించింది. ఒకదశలో వాహనం దిగి పాదయాత్ర ప్రారంభించేందుకు పవన్‌ ఇబ్బందిపడాల్సి వచ్చింది.