bhuma akhila priya

రసవత్తరంగా ఆళ్లగడ్డ రాజకీయాలు

Submitted by arun on Thu, 04/26/2018 - 11:28

అమరావతికి చేరిన ఆళ్లగడ్డ పంచాయితీకి మంత్రి అఖిలప్రియ వరుసగా రెండో రోజూ డుమ్మా కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చినా తనకు సమాచారం లేదంటూ ఎస్కేప్ అయ్యారు. అయితే మరో నేత ఏవీ సుబ్బారెడ్డి మాత్రం బాబు ఆదేశం మేరకు అమరావతి వచ్చారు. ఆళ్లగడ్డ వ్యవహారాన్ని సెటిల్ చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇద్దరు నేతలతో భేటీ కానున్నారు.

అమరావతిలో ఆళ్లగడ్డ పంచాయతీ

Submitted by arun on Wed, 04/25/2018 - 11:38

ఆళ్లగడ్డ పంచాయితీ అమరావతికి చేరింది. మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డిల వ్యక్తిగత కక్షలను టీడీపీ అధినాయకత్వం సీరియస్‌గా తీసుకుంది. పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో ఉన్న తనపై జరిగిన రాళ్ల దాడి వెనుక అఖిలప్రియ వర్గీయులు ఉన్నారన్న సుబ్బారెడ్డి ఆరోపణలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎంత నచ్చజెప్పినా ఇద్దరూ వినడం లేదని ఆగ్రహించిన బాబు ఈ మధ్యాహ్నం ఇద్దరికీ క్లాస్ తీసుకోనున్నారు.

రాళ్ల దాడిపై నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి: ఏవీ సుబ్బారెడ్డి

Submitted by arun on Tue, 04/24/2018 - 12:28


ఆళ్లగడ్డ పంచాయతీ రేపటికి వాయిదాపడింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవాలని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి ఆదేశాలు అందాయి. అయితే తనకు పదవులపై వ్యామోహం లేదన్న ఏవీ సుబ్బారెడ్డి కావాలనే అఖిలప్రియ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాళ్ల దాడిపై తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే ఇప్పటికీ అఖిలప్రియను తన కుటుంబ సభ్యురాలిగానే భావిస్తున్నట్లు ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.

మంత్రి అఖిలప్రియతో మనస్పర్థలు వాస్తవమే: సుబ్బారెడ్డి

Submitted by arun on Fri, 04/13/2018 - 11:23

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇకపై ఆళ్లగడ్డలో కాలు పెట్టవద్దని సీఎం చంద్రబాబు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలపై ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఉదయం విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు చెప్పినట్టుగా ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియకు, తనకు మధ్య విభేదాలు ఉన్నమాట నిజమేనని, అయితే, అవి చిన్నచిన్నవే తప్ప పెద్దవి కాదని అన్నారు.

ఆళ్లగడ్డ టీడీపీలో ముదిరిన విభేదాలు..

Submitted by arun on Fri, 03/30/2018 - 12:00

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నివురు గప్పిన నిప్పులా ఉన్న టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి అఖిలప్రియ, ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇద్దరూ  బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సుబ్బారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి వెళ్లొద్దని అఖిలప్రియ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించడం విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో ఆళ్ళగడ్డ టీడీపీలో ఏం జరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.

జగన్ పాదయాత్ర మాకు ఇబ్బంది కాదు: అఖిలప్రియ

Submitted by arun on Sat, 01/06/2018 - 17:38

చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై ఏపీ పర్యటక శాఖ మంత్రి భూమ అఖిలప్రియ స్పందించారు. జగన్ పాదయాత్రతో తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అఖిలప్రియ అన్నారు. శనివారం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఆమె ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం టూరిజంశాఖ అన్ని వసతులు కల్పిస్తుందని తెలిపారు. భక్తుల కోసం శ్రీశైలంలో రూ.6కోట్లతో లైటింగ్, సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశామని అన్నారు.