Poonam Kaur

అమెరికా సెక్స్ రాకెట్: పూనమ్ షాకింగ్ కామెంట్స్

Submitted by arun on Thu, 06/28/2018 - 16:36

కాస్టింగ్ కౌచ్ గురించి మరిచిపోకముందే అమెరికాలో చికాగో సెక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ దందా సాగిస్తున్న కిషన్ మోదుగుమూడి - అతడి సతీమణీ చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఈ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అమెరికా పోలీసులు ఈ కేసులో ఇప్పటికే సంచలన వాస్తవాలు వెలుగులోకి తీసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ చికాగో సెక్స్ రాకెట్ గురించి మరో బాంబు పేల్చింది. 

ఆ దర్శకుడు నమ్మకద్రోహి...పూనమ్ ట్వీట్ వైరల్!

Submitted by arun on Fri, 05/25/2018 - 13:19

గ‌త కొన్ని రోజులుగా త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా సంచ‌ల‌న ట్వీట్లు చేస్తున్న హీరోయిన్ పూన‌మ్ కౌర్ తాజాగా మ‌రోసారి త‌న ట్వీట్ల ప‌వ‌ర్ చూపించింది. తాజాగా చేసిన ట్వీట్స్ .. ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారాయి. 'జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో వేసేస్తాడు జాగ్రత్త .. నమ్మకద్రోహి' అంటూ ఆమె చేసిన ట్వీట్ గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన ఈ ట్వీట్ లో రెండు సినిమా పేర్లను వాడటంతో ఈ విషయం మరింత వేడెక్కింది.

పూనమ్ కౌర్ సంచలన పోస్ట్

Submitted by arun on Fri, 03/16/2018 - 14:56

సినీ నటి పూనమ్ కౌర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సంచలన పోస్ట్ చేసింది. బట్టలు మార్చినంత ఈజీగా.. మనుషులను మారుస్తూ రాజకీయాలు చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేసిందా.. అని అభిమానులు  ఆలోచనలో మునిగిపోతే... ఇప్పుడు ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అంతలా ఆలోచింపజేసిన ఆ పోస్ట్‌లోని సందేశం యధావిధిగా.. ‘కాన్సెప్ట్ కాపీ చేసి.. డైలాగ్స్ కాపీ చేసి.. బట్టలు మార్చుకున్నట్లు మనుషులను మారుస్తూ.. మాట మీద ఉండకపోవడం.. జనాల అమాయకత్వంతో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ.. జనాలను మభ్యపెట్టి.. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు.

పూనమ్ ట్వీట్ ఎవ‌రిని ఉద్దేశించి..?

Submitted by arun on Mon, 01/29/2018 - 11:42

ఎవరి గురించి మాట్లాడిందో తెలియదుగానీ, నటి పూనం కౌర్ సంచలన వ్యాఖ్యలనే చేసింది. "డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతాలు... మీ అస్తిత్వం ఏంటి? అవసరాల కోసం మారిపోయిన నిజాయతీ... నీ గుణం ఏంటి?" అని ప్రశ్నించింది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల వ‌ల్ల క‌త్తి మ‌హేష్‌.. అత‌ని వ‌ల్ల హీరోయిన్ పూన‌మ్ కౌర్ ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్‌, పూన‌మ్ గురించి క‌త్తి మ‌హేష్ సంధించిన ప్ర‌శ్న‌లు, వాటికి స్పంద‌న‌గా పూన‌మ్ చేసిన ట్వీట్లు సంచ‌ల‌నం సృష్టించాయి. ఆ వివాదం ఎలాగోలా స‌ద్దుమ‌ణిగింది. తాజాగా పూన‌మ్ చేసిన ఓ ట్వీట్ సంచ‌ల‌నంగా మారింది.
 

క‌త్తి ప్ర‌శ్న‌ల‌కు పవన్ అభిమానుల స‌మాధానాలు!

Submitted by arun on Tue, 01/09/2018 - 14:27

నటి పూనం కౌర్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తూ, రెండు రోజుల క్రితం సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ కొన్ని ప్రశ్నలను సంధించిన తరువాత, వాటికి సమాధానాలను పవన్ ఫ్యాన్స్ ప్రిపేర్ చేశారు. కత్తి ప్రశ్నలకు సమాధానాలను సోషల్ మీడియా మాధ్యమంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ సమాధానాల్లో ఉన్న వివరాల ప్రకారం, ‘‘ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌ల్సా` సినిమాలో క‌మలినీ క్యారెక్ట‌ర్ కోసం మొద‌ట‌గా పూన‌మ్ కౌర్‌ను తీసుకున్నారు. ఆ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లోనే ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి పూన‌మ్ పాల్గొంది.

హీరోయిన్ పూన్ కౌర్ పై స్పందించిన మంత్రి

Submitted by lakshman on Tue, 01/09/2018 - 11:22

క‌త్తిమ‌హేష్ వివాదంలో హీరోయిన్ పూన్ కౌర్ పై మంత్రి స్పందించారు. మ‌హేష్ ..పూనమ్ కౌర్ వ్య‌క్తిగ‌త జీవితం పై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈసంద‌ర్భంగా మ‌హేష్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది? అంటూ పూన‌మ్ ను ప్ర‌శ్నించారు. అయితే పూన‌మ్ కౌర్ ఏపీ చేనేత బ్రాండ్ అంబాసీడర్ వ్య‌వ‌హారంపై ఏపీ చేనేత శాఖ మంత్రి కొల్లు ర‌వీంద్ర స్పందించారు. తాను చేనేత మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎవ‌ర్ని అంబాసీడ‌ర్ గా ఎంపిక చేయ‌లేదని చెప్పారు.

పూన‌మ్ కౌర్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ఎందుకు ప్ర‌య‌త్నించిందంటే

Submitted by lakshman on Mon, 01/08/2018 - 22:53

ప‌వన్ క‌ల్యాణ్ - క‌త్తిమ‌హేష్ వివాదంలో  పూన‌మ్ కౌర్ ఎంట‌ర్ అవ్వ‌డం. మ‌హేష్ పై కామెంట్స్ చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ద్ద‌తిస్తూ  ట్వీట్ చేయ‌డం. అందుకు ప్ర‌తిస్పంద‌న‌గా మ‌హేష్ స‌వాల్ విసరడం. అనంత‌రం ప్రెస్ మీట్ పెట్టీమ‌రి ప‌వ‌న్ -పూన‌మ్ వ్య‌క్తిగ‌త జీవితాల‌పై ఆరు ప్ర‌శ్న‌ల‌కు సంధించ‌డం జ‌రిగింది. అయితే మ‌హేష్ వేసిన ఆరు ప్ర‌శ్న‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా ఆరు ప్ర‌శ్న‌ల్లో కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం దొరికిన‌ట్లు తెలుస్తోంది.

కత్తి మహేష్ పై పరువు నష్టం దావా వేస్తాం

Submitted by arun on Mon, 01/08/2018 - 15:22

పవన్ కల్యాణ్, కత్తి మహేష్ మధ్య మొదలైన వివాదం ఓ మలుపు తీసుకుని... పూనం కౌర్, కత్తి మహేష్ మధ్య రాజుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ కు మద్దతుగా, కత్తి మహేష్ ను ఫ్యాట్సో, బెగ్గర్ అని వ్యాఖ్యానిస్తూ పూనం కౌర్ ట్వీట్ చేయడంతో గొడవ పెద్దదైపోయింది. ఈ నేపథ్యంలో పూనం కౌర్ కు ఇవే తన ప్రశ్నలంటూ ఓ ఆరింటిని కత్తి మహేష్ సంధించారు. వీటికి పూనం కౌర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పవన్ కు పూనం కౌర్ విజ్ఞప్తి

Submitted by arun on Mon, 01/08/2018 - 13:39

కొందరి రాజకీయ కారణాలకు, రహస్య ఎజెండాలకు తాను లక్ష్యంగా మారానని నటి పూనం కౌర్ వాపోతోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కల్పించుకుని తన గౌరవాన్ని కాపాడాలని వేడుకుంటూ వరుస ట్వీట్లు పెట్టింది. 'గౌరవనీయులైన పవన్ కల్యాణ్ గారు.. ఇది నా కెరీర్, ఫ్యామిలీకి సంబంధించిన విషయం. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు సహాయం చేయండి' అని పూనమ్ మరో ట్వీట్ చేశారు. ఆపై "రహస్య అజెండాలతో వస్తున్న వారికి లక్ష్యంగా నేను మారాలని అనుకోవడం లేదు. నేను మిమ్మల్ని కలిసి ఈ విషయంలో మాట్లాడుతాను" అని పవన్ ను ఉద్దేశించి మరో ట్వీట్ చేసింది. దీంతో పూనంకు మద్దతుగా పవన్ అభిమానుల నుంచి ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.

క‌త్తికి మ‌ద్ద‌తుగా పూనమ్ ట్వీట్‌!

Submitted by arun on Mon, 01/08/2018 - 13:29

పవన్ కల్యాణ్-మహేష్ కత్తి వివాదం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలంటూ కత్తి విసిరిన సవాలుతో.. వివాదం క్లైమాక్స్‌కు చేరుకుందనే అంతా భావించారు. కానీ అనూహ్యంగా వివాదం మరో మెట్టు ఎక్కింది. కత్తి చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలాంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్ క‌త్తి మ‌హేష్‌కు, ఆయ‌న త‌ల్లికి మ‌ద్ద‌తుగా పూన‌మ్ ఓ ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆదివారం జ‌రిగిన ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ వివేక్.. క‌త్తి మ‌హేష్ త‌ల్లి గురించి ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాడు.